Uco Bank
-
వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ బ్యాంకులు ఇవే..
భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్‌లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
41 వేల ఖాతాల్లో రూ.820 కోట్లు జమ.. ప్రముఖ బ్యాంకులో సీబీఐ సోదాలు
యూకో బ్యాంక్‌లో గతంలో జరిగిన ఇమిడియట్ పేమెంట్ సిస్టమ్(ఐఎంపీఎస్) లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రల్లోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. బ్యాంకులో గతేడాది నవంబరు 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదార్ల అకౌంట్‌ల్లోకి తప్పుగా డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ రూ.820 కోట్లని తేల్చింది. 7 ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41,000కు పైగా ఖాతాదారులకు తప్పుగా నిధులు జమ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు కట్ అవకుండానే, యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమైనట్లు గుర్తించారు. ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమ అయిన తేదీల్లోనే, యూకో బ్యాంకులో వేల సంఖ్య లో కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును చాలామంది విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో యూకో బ్యాంకు, ఐడీఎఫ్సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఇంటర్నెట్ డాంగుల్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సీజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్‌లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్‌కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌లోనూ కోల్‌కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్ -
రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం..
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఎదురవుతున్న సైబర్ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ చెప్పారు. కేంద్ర ఆర్థికశాఖ సమక్షంలో ఇటీవల జరిగిన భేటీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సన్నద్ధత గురించి చర్చించామని మంత్రి కరద్ పేర్కొన్నారు. సైబర్ దాడులు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి అవకతవకలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్థిక మోసాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబరు 4, 2023 వరకు జరిగిన 4 లక్షలకు పైగా సంఘటనల్లో ఈ వ్యవస్థ మొత్తం రూ.1,000 కోట్లకు మించి ఆదా చేసిందని పేర్కొన్నారు. పలువురి ఖాతాల్లో నవంబర్, 2023లో పొరపాటున జమ అయిన రూ.820 కోట్లకు గాను రూ.705.31 కోట్లను యూకో బ్యాంక్ రికవరీ చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరద్ ఈ సమావేశంలో వెల్లడించారు. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ ఛానెల్లో సాంకేతికలోపంతో 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున ఈ నిధులు జమ అయినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి నవంబర్ 15న యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజినీర్లు, ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోని 13 ప్రదేశాల్లో డిసెంబర్ 5న సీబీఐ సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిళ్లకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచ్‌లతో సహా వివిధ ఛానెల్‌ల ద్వారా యాక్సెస్ చేయగల 24/7 ఇంటర్‌బ్యాంక్ మొబైల్, ఐఎంపీఎస్‌లో లోపం ఏర్పడినట్లు విచారణలో తేలిందని అధికారులు వివరించారు. -
ప్రభుత్వ ‘యూకో’ బ్యాంక్ బాగోతం.. ప్రశ్నార్ధకంగా 114 కోట్లు!
డిసెంబర్ 7న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ యూకో బ్యాంక్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా యూకో బ్యాంక్‌కు చెందిన 41వేల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమయ్యాయి. వాటిల్లో రూ. 705.31 కోట్లు రికవరీ అయ్యాయి. బ్యాంక్ ఐఎంపీ పేమెంట్ చానెల్లో సాంకేతిక లోపంతో జరిగిన నిధుల బదిలీలో రూ.114.69 ఇంకా రికవరీ కాలేదని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ లోక్ సభ సమావేశాల్లో లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన యూకో బ్యాంక్ ఉద్యోగుల్ని గుర్తించింది. గుర్తించలేని ఇతర వ్యక్తులపై సీబీఐ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్నాటకలోని 13 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్ క్రెడిట్ కార్డులు, ఈ మెయిల్ ఆర్కైవ్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. -
ఖాతాల్లోకి రూ.820 కోట్లు - ఆనందపడేలోపే..
గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యూకో బ్యాంక్ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్‌పాట్ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి. ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. -
యూకో కస్టమర్ల ఖాతాల్లోకి రూ. 820 కోట్లు
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులోని పలువురు కస్టమర్ల ఖాతాల్లోకి ఏకంగా రూ. 820 కోట్లు పొరపాటున జమయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంకు రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఆయా ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేసి రూ. 649 కోట్లు (సుమారు 79 శాతం) మొత్తాన్ని రాబట్టినట్లు గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది. మిగతా రూ. 171 కోట్లు కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నామని, తగు చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేసినట్లు వివరించింది. ఈ సాంకేతిక సమస్య మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక హ్యాకింగ్ ప్రయత్నమేదైనా జరిగిందా అనే అంశంపై బ్యాంకు స్పష్టతనివ్వలేదు. నవంబర్ 10–13 మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సరీ్వస్ (ఐఎంపీఎస్)లో సాంకేతిక లోపం కారణంగా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు చేపట్టిన కొన్ని లావాదేవీల్లో తమ బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లోకి నగదు క్రెడిట్ అయినట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఆయా బ్యాంకుల నుంచి తమకు నిధులు అందకుండానే ఈ లావాదేవీలు చోటు చేసుకున్నాయని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో తగు చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. -
ప్రభుత్వ బ్యాంక్ ‘స్వీట్’ ఐడియా! మిఠాయిలిచ్చి ప్రేమగా అడుగుదాం..
మొండి బకాయిలను రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ (UCO Bank) సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి శాఖలోని టాప్ 10 డిఫాల్టర్లకు 'స్వీట్ ప్యాకెట్లు' పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. వాళ్లూ ఒకప్పుడు విలువైన కస్టమర్లే ప్రస్తుతం డిఫాల్టర్‌గా మారినవాళ్లు ఒకప్పుడు విలువైన కస్టమర్ అనే విషయాన్ని బ్యాంకు మరచిపోదని యూకో బ్యాంక్ జనరల్ మేనేజర్ (రికవరీ) ధీరజ్ పట్వర్ధన్ అన్ని జోనల్ హెడ్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్! కాబట్టి, అటువంటి కస్టమర్లతో "సరైన అనుసంధానం"తో వారికి, బ్యాంకుకు మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు. దీనివల్ల బ్యాంక్ పట్ల సానుభూతి, సామరస్యం పెరుగుతాయని, కొంత మంది రుణగ్రహీతలు తమ బకాయిలు సెటిల్ చేయడానికి ముందుకు వస్తారని వివరించారు. స్వీట్లిచ్చి దీపావళి శుభాకాంక్షలు దీనికి సంబంధించి యూకో బ్యాంక్ జారీ సర్కులర్‌ను ప్రముఖ బ్యాంకింగ్ కాలమిస్ట్ తమల్ బందోపాధ్యాయ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రతి బ్రాంచ్‌లోని టాప్ 10 ఎన్పీఏ రుణగ్రహీతలకు స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని, బ్రాంచ్ హెడ్లు వారిని వ్యక్తిగతంగా కలుసుకుని, దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని సర్క్యులర్‌లో బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కువగా ఉద్యోగ వలసలు.. ఆర్బీఐ డేగకన్ను! గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 124 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 223 కోట్లకు పెరిగి 80.80 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,650 కోట్ల నుంచి 21.78 శాతం పెరిగి రూ. 2,009 కోట్లకు చేరుకున్నట్లు యూకో బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఎన్పీఏ రుణాలు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 4.48 శాతంగా ఉన్నాయి. ఇవి మార్చిలో 4.78 శాతం కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 7.42 శాతంగా ఉన్నాయి. Wonderful idea. UCO Bank plans to celebrate Diwali, greeting top ten #NPA borrowers of every branch with sweets. @UCOBankOfficial @ChairmanIba @ChiefIba pic.twitter.com/HZJMenPnz5 — Tamal Bandyopadhyay (@TamalBandyo) November 2, 2023 -
యుకో బ్యాంక్ డబుల్ ధమాకా!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 653 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో సాధించిన రూ. 310 కోట్లతో పోలిస్తే ఇది 110 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8 శాతం నుంచి 5.63 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 2.81 శాతం నుంచి 1.66 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీల కంటే రికవరీలు పెరగడంతో మొండి రుణాలకు కేటాయింపులు రూ. 565 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 3,919 కోట్ల నుంచి రూ. 4,627 కోట్లకు బలపడింది. కనీస మూలధన నిష్పత్తి 14.32 శాతంగా నమోదైంది. ఈ కాలంలో ఆర్బీఐ రూ. 88 లక్షల జరిమానా విధించినట్లు బ్యాంక్ వెల్లడించింది. క్యూ3 ఫలితాల నేపథ్యంలో యుకో బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 29.50 వద్ద ముగిసింది. చదవండి: మెగా రిపబ్లిక్ డే సేల్స్.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌పై భారీ ఆఫర్స్ -
బ్యాంక్ మేనేజర్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్.. మచిలీపట్నంలో ఏం జరిగింది?
యానాం: యూకో బ్యాంకు మేనేజర్ విస్సాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్‌లో బ్యాలెన్స్ షీట్లో రూ.29 లక్షలు తక్కువగా వుందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం యానాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలాజ్యోతి ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్‌లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు.. మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు, వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్‌లో ఘటన చోటు చేసుకుంది. మా ఒత్తిడి లేదు యానాం యూకో బ్రాంచ్ మేనేజర్‌పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
అప్పులు ఇవ్వడమే అతడికి శాపమైందా? అందమైన కుటుంబం చివరికి ఇలా?
తూర్పు గోదావరి: కొంతమంది రూ.లక్షల్లో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో అదికాస్తా బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుని ఉరితాడయ్యింది.. హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య, ఇద్దరు కుమార్తెల భవితవ్యం అగమ్యగోచరమయ్యింది. యానాం పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన విస్పాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) గతంలో మచిలీపట్టణంలో యూకో బ్యాంకు మేనేజర్‌గా పనిచేశారు. రొయ్యల చెరువుల సేద్యానికి అక్కడ కొంతమందికి లక్షలాది రూపాయలు రుణాలు ఇచ్చారు. తీసుకున్న రుణాలను సంబంధిత వ్యక్తులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మేనేజర్ శ్రీకాంత్‌పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమేర రుణాలను శ్రీకాంత్ వ్యక్తిగతంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం శ్రీకాంత్ యానాం శాఖకు బదిలీ అయ్యారు. స్థానిక గోపాల్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు భార్య కావ్యను పిల్లల్ని స్కూల్ వద్ద దింపేసి రావాలని శ్రీకాంత్ చెప్పడంతో.. ఆమె మూడవ తరగతి చదువుతున్న స్వరాగ, ఎల్కేజీ చదువుతున్న స్వరి్ణతను స్కూల్‌కు తీసుకువెళ్లారు. ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో మరోమార్గంలో వెళ్లి చూడగా ఫ్యాన్‌కు శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. స్థానికులు, భార్య కలిసి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అయినవారు కన్నీరుమున్నీరు యానాం జీజీహెచ్‌లో కుమారుడి మృతదేహం వద్ద శ్రీకాంత్ భార్య, తల్లి బోరున విలపించారు. బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏదోలా తామే చెల్లిస్తామని చెబుతూ ఉన్నామని, అయిన్పప్పటికీ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ఒడిగడితే తాము నివారించామని, కాని ప్రస్తుతం విధి కాటేసిందని శ్రీకాంత్ మావయ్య చెప్పారు. తమను భుజాలపై ఎక్కించుకుని ఆడించిన నాన్న తమను శాశ్వతంగా విడిచి అందనిలోకాలకు వెళ్లిపోయాడని తెలియని శ్రీకాంత్ కుమార్తెల అమాయక చూపులు అందరిని కలిచివేశాయి. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లను సవరించిన ఆ రెండు బ్యాంకులు..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) రెపో రేటు(4 శాతం), రివర్స్ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ మానిటరరీ పాలసీ ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసీఓ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎఫ్డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు 2.75% నుంచి 5.15% మధ్య ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు యుకో బ్యాంక్ యుకో బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో డిపాజిట్ చేసే ఎఫ్డీలపై ఇతర సిటిజన్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 0.50 బేసిసి పాయింట్స్ అధికంగా పొందనున్నారు. యుకో బ్యాంక్ కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు (చదవండి: రూ.14వేలకే యాపిల్ ఐఫోన్!! ఇక మీదే ఆలస్యం!) -
వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్!
కరోనా మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతి రాష్ట్రం వ్యాక్సిన్ వేసుకోవాలి అవగాహన కలిపిస్తున్నాయి. అలాగే, వ్యాక్సిన్ వేసుకున్న వారికి పలు స్వచ్చంద సంస్థలు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బ్యాంకులు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలను ప్రోత్సాహిస్తున్నాయి. పరిమిత కాలానికి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కనీసం ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వినియోగదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 999 రోజుల పాటు 30 బేసిస్ పాయింట్లు(బీపీఎస్) అధిక రేటును అందించనున్నట్లు యుకో బ్యాంక్ తెలిపింది. "టీకా డ్రైవ్‌లను ప్రోత్సహించడానికి మా వంతు సహాయం చేస్తున్నాము. మేము UCOVAXI-999 పేరిట ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చాము. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది" అని ఒక బ్యాంకు అధికారిని చెప్పారు. అలాగే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇటీవలే ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ అనే ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీమ్ కింద టీకాలు వేసుకుంటే వినియోగదారులకు 25 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) అదనపు వడ్డీ రేటును అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ పథకం 1,111 రోజుల మెచ్యూరిటీని కలిగి ఉంది. ఇది పరిమిత కాలానికి వర్తిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న సీనియర్ సిటిజన్లకైతే అదనంగా మరో 25 బేసిస్ పాయింట్లు కలిపి మొత్తం 50 బేసిస్ పాయింట్లు లేదా 0.50శాతం వడ్డీ ఇవ్వనుంది. చదవండి: డెలివరీ బాక్స్ ఓపెన్ చూసి షాక్ అయిన మహిళ? -
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం తాజా నిధులు
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్ ఓవర్సీస్, అలహాబాద్ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్ బ్యాంకు గురువారమే ప్రకటించింది. -
తగ్గిన యూకో బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కొంచెం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,136 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.892 కోట్లకు తగ్గాయని యూకో బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే నష్టాలు పెరిగాయి. ఈ బ్యాంక్‌కు ఈ క్యూ1లో రూ.601 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.3,749 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,534 కోట్లకు పెరిగింది. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం.., గత క్యూ2లో రూ.29,581 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.25,665 కోట్లకు తగ్గాయి. నికర మొండి బకాయిలు రూ.11,820 కోట్ల నుంచి రూ.7,238 కోట్లకు చేరాయి -
యూకో బ్యాంకు వద్ద భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని యుకో బ్యాంక్ శాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజి రోడ్, ఫరా టవర్స్‌లో ఉన్న బ్యాంకు కార్యాలయంలో బుధవారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం తీవ్ర ఆందోళనకుదారి తీసింది. షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యూకో బ్యాంకు ఆఫీసునుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఇదే భవంలోనే పలు కోచింగ్ సెంటర్లు ఉండటంతో చాలా మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంతో తీవ్ర భయాందోళనలో పక్క భవనం నుండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. బార్టన్ సెంటర్ పక్కనే ఉన్న భవనం మొదటి అంతస్తులోని కేబుల్ గదిలో మంటలు చెలరేగాయి. ఇవి పై అంతస్తులకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు భవనంపైనుంచి దూకడానికి ప్రయత్నిచారు. అయితే భవనం మెయింటెనెన్స్ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. భయపడొద్దని, ఆందోళన చెందుతున్నవారికి చెప్పాం, ఫైర్ సిలిండర్ల సాయంతో మంటలను ఆర్పివేసి, ప్రజలను రక్షించామని సిబ్బంది అలీ తెలిపారు. అనంతరం ఫైర్ ఇంజిన్లు వచ్చి పరిస్థితిని మరింత చక్కదిద్దాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. -
విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా యశ్ బిర్లా సూర్య
ఉద్దేశపూర్వక రుణ వేగవేతదారుల జాబితాలో మరో పారిశ్రామికవేత్త చేరాడు. యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్, యశోవర్ధన్ బిర్లాను యుకో బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా ప్రకటించింది. బిర్లా సూర్య కంపెనీ రూ.67.65 కోట్లు చెల్లించలేదంటూ బ్యాంకు ఆదివారం ఈ మేరకు బహిరంగ నోటీసులు జారీ చేసింది. అప్పు తీర్చే ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ బకాయిలు చెల్లించని ఉద్దేశపూర్వక రుణఎగవేతదారుడుగా బిర్లా సూర్యను ముంబైలోని యుకో బ్యాంక్ కార్పొరేట్ శాఖ ప్రకటించింది. రుణ బకాయిలు చెల్లించనందున, యశ్ బిర్లాను గతంలో (జూన్ 3, 2013) ఎన్‌పిఎగా బ్యాంకు ప్రకటించింది. అప్పటినుండి బకాయి రూ .67.65 కోట్లకు చేరింది. దీనిపై అనేక నోటీసులు ఉన్నప్పటికీ, రుణగ్రహీత తమకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించలేదంటే యశ్ బిర్లా ఫోటోతో సహా విడదుల చేసిన నోటీసులో బ్యాంక్ పేర్కొంది. అలాగే యశ్ బిర్లా సంస్థ దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, హామీదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్స్) గా బ్యాంక్ ప్రకటించింది. కోల్‌కతాకు చెందిన యుకో బ్యాంక్ మరో ఏడు కంపెనీల డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయి రూ.740 కోట్లుగా ఉంది. కాగా నిధుల మళ్లింపు, అవినితికిఆరోపణలకు సంబంధించి బిర్లా సంస్థలు బిర్లా కాట్సిన్, బిర్లా శోకాఎడ్యూటెక్, జెనిత్స్టీల్ కంపెనీలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే (2018, సెప్టెంబరు) దర్యాప్తునకు ఆదేశించింది. యశోవర్ధన్ బిర్లాకు బిర్లా సూర్యతోపాటు డజనుకు పైగా ఇతర కంపెనీలు ఉన్నాయి. జెనిత్ స్టీల్, బిర్లా పవర్, బిర్లా లైఫ్ స్టైల్, శ్లోకా ఇన్ఫోటెక్ ప్రధానమైనవి. -
బయటపడ్డ మరో బ్యాంకింగ్ మోసం
న్యూఢిల్లీ : మరో బ్యాంకింగ్ మోసం శనివారం బయటపడింది. సుమారు రూ.621 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ కౌల్‌తో పాటు మరి కొంత మంది బిజినెస్ ఎక్జిక్యూటివ్‌లపై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రేవేటు ఇన్ఫ్రా స్ట్రక్చర్ సంస్థ ఎరా ఇంజనీరింగ్ ఇఫ్రా లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అల్టియస్ ఫిన్సర్వ్ ప్రైవేటు లిమిటెడ్‌లకు రుణాల చెల్లింపు విషయంలో అరుణ్ కౌల్ అవతవకలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అరుణ్ కౌల్ 2010 నుంచి 2015 మధ్యంలో యూకో బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారని, ఈ సంస్థలకు రుణాలు మంజూరు చేయడంలో అరుణ్ కౌల్‌దే ప్రధాన భూమిక అని సీబీఐ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ఫిబ్రవరి తర్వాత బయట పడిన మరో పెద్ద మోసం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఇద్దరు వజ్రాల వ్యాపారులు బ్యాంకులకు సుమారు రెండు బిలియన్ డాలర్లు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ మోసం కేసు బ్యాంకింగ్ రంగాన్నే ఓ కుదుపు కుదుపేసింది. ఈ నెల1న యూకో బ్యాంక్ మాజీ మేనేజర్‌తో పాటు మరో నలుగురిపై రూ.19 కోట్ల మోసానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ మోసం వెలుగులోకి రావడంతో యూకో బ్యాంకు ఉద్యోగులు ఆశ్చర్యపోయే పరిస్థితి తలెత్తింది. యూకో బ్యాంకు కేసుకు సంబంధించి అరుణ్ కౌల్‌తో పాటు కొంత మందిబ్యాంకు అధికారులు, రెండు ప్రైవేటు కంపెనీలకు చెందిన అకౌంటెంట్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు దేనికి సంబంధించి మంజూరు చేశారో దానికి వినియోగించలేదని, చార్టడ్ అకౌంటంట్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రుణాలను అటువైపు మళ్లించి మోసానికి పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది. దీనికి సంబంధించి రెండు కంపెనీలు, అకౌంటంట్లు, నిందితుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. -
రూ.621 కోట్ల స్కాం : మాజీ చీఫ్‌పై కేసు నమోదు
ముంబై : రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణంతో కుదేలైన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉదంతంతో పాటు ఇటీవల మరికొన్ని బ్యాంకుల కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూకో బ్యాంకుకు చెందిన రూ.621 కోట్ల రుణ కుంభకోణం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో భాగమైన బ్యాంకు మాజీ సీఎండీ అరుణ్ కౌల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అరుణ్ కౌల్‌తో పాటు ప్రైవేటీ కంపెనీపై కూడా సీబీఐ కేసు దాఖలు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వారిలో కౌల్‌తో పాటు, ఎరా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హేమ్ సింగ్ భరాణా, చార్టెడ్ అకౌంటెంట్స్ పంకజ్ జైన్, వందనా శార్దాలు ఉన్నారు. ఆల్టియస్ ఫిన్సర్వ్ పవన్ బన్సాల్, ఇతర పబ్లిక్ సర్వెంట్లను కూడా ఈ కుంభకోణ కేసులో సీబీఐ విచారిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు బ్యాంకులో రూ.621 కోట్ల రుణాలను తప్పుదోవ పట్టించినట్టు తెలిసింది. ఈ రుణాలను ఆమోదించిన అవసరాలకు ఉపయోగించలేదని, చార్టెడ్ అకౌంటెంట్లు అందించిన తప్పుడు సర్టిఫికేట్లతో ఈ రుణాలను పొందినట్టు అధికారులు చెప్పారు. కంపెనీ ఇలా అక్రమంగా రుణం పొందినప్పుడు కౌల్ బ్యాంకు సీఎండీగా ఉన్నారు. ఢిల్లీతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ తనికీలు నిర్వహించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అధికారిక, నివాస ప్రాంతాల్లో ఈ తనిఖీలను చేపట్టింది. -
బాలచందర్ ఆస్తుల వేలం.. గందరగోళం!
సాక్షి, చెన్నై : లెజెండరీ దర్శకుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.. కే బాలచందర్ ఆస్తుల వేలం వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిదేం జరగబోదని నిర్మాణ సంస్థ.. ఆస్తులను వేలం వేసి తీరతామని యూకో బ్యాంక్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం మొదలైంది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో రజనీ కాంత్, కమల్ హాసన్‌లు గురువు కోసం ఏదైనా చేస్తారేమోనని అంతా ఎదురు చూశారు. వారు స్పందించకపోయినప్పటికీ ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలచందర్ ఆస్తుల వేలం ఉండబోదని తెలిపింది. ‘వ్యాపారంలో భాగంగానే బాలచందర్.. ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోవటంతో రుణంపై వడ్డీ పేరుకుపోయింది. 1.36 కోట్లకు వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు రుణం తిరిగి చెల్లించాం. మిగతా రుణాన్ని సింగిల్ సెటిల్మెంట్లో చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు’ అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ మాత్రం ఈ ప్రకటనపై సానుకూలంగా స్పందించలేదు. బాలచందర్ ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని, ఇది కోర్టు పరిధిలో వ్యవహారం కాబట్టి ఇంతకు మించి స్పందించలేమని బ్యాంకు అధికారులు చెప్పటంతో గందరగోళం మొదలైంది. -
మరిన్ని బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలపై జరిమానా విధించింది. ఆలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంకులపై వరుసగా రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.కోటి జరిమానా వేసింది. కేవైసీ, యాంటీ-మనీ ల్యాండరింగ్ (ఏఎంఎల్) నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఈ బ్యాంకులపై జరిమానా పడి ంది. కేవైసీ/ఏఎంఎల్ నియమావళిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే కారణంగా ఆర్బీఐ తమపై పెనాల్టీ విధించిందని యూకో బ్యాంక్ బీఎస్ఈకి నివేదించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు కూడా ఇదే విషయాన్ని బీఎస్ఈకి తెలియజేశాయి. -
స్కిల్ ఇండియా మిషన్ నిధులు గోల్మాల్
హైదరాబాద్ : ప్రధాని స్కిల్ ఇండియా నిధులను దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ అధికారులు గోల్మాల్ చేశారు. నల్లగొండ జయం ఇన్స్టిట్యూట్తో చేతులు కలిపిన బ్యాంక్ అధికారులు స్కిల్ ఇండియా నిధులను స్వాహా చేశారు. విద్యార్థులు పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి అందినకాడికి దండుకున్నారు. స్కిల్ ఇండియా నిధుల గోల్‌మాల్‌పై సీబీఐ అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 180మంది జయం ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు సీబీఐ నోటీసులు పంపింది. సీబీఐ నోటీసులతో అవాక్కైన విద్యార్థులు తమకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేస్తారంటూ దిల్సుఖ్నగర్ యూకో బ్యాంక్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. స్కిల్ ఇండియా పేరుతో విద్యార్థి ఖాతాలో ప్రతినెల రూ.10వేలు జమ కాగా, దాదాపు రూ.కోటికి పైగా స్కిల్ ఇండియా నిధులు స్వాహా చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ఘటనపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. -
విలీన బాటలో మరో మూడు బ్యాంకులు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, తన అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రతిపాదన అనంతరం మరో మూడు బ్యాంకుల విలీన ప్రక్రియ విధానాన్ని కూడా ప్రభుత్వం అన్వేషిస్తోంది. యూకో బ్యాంకుతో పాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కూడా దిగ్గజ సంస్థల్లో విలీనం చేయాలని భావిస్తోంది. బలహీనంగా ఉన్న ఈ బ్యాంకులను, ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకుల్లో కలిపి, లాభాల్లో నడిపించాని చూస్తోంది. ఈ విలీనానికి సంబంధించి వివిధ ఆప్షన్ల కోసం ప్రభుత్వం అన్వేషణ ప్రక్రియలో ఉందని ఒక అధికారి వెల్లడించారు. స్టేట్ బ్యాంకు ప్రతిపాదించిన దాన్ని అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం మొదలుపెడుతుందని తెలుస్తోంది. తన ఐదు అనుబంధ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకునే ప్రతిపాదనను ఎస్ బీఐ మంగళవారం కేంద్రప్రభుత్వం ముందుంచిన సంగతి తెలిసిందే. ఈ విలీనంతో రూ.5000 కోట్ల స్థిర మూలధనాన్ని అనుబంధ బ్యాంకుల నుంచి ఎస్ బీఐ పొందుతుందని ఆ బ్యాంకు చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. అదేవిధంగా విలీన ప్రక్రియ పూర్తైతే బ్యాంకు డిపాజిట్లు 21లక్షల కోట్లకు పైగా కలిగి ఉంటాయని, అడ్వాన్సులు రూ.17.5 లక్షల కోట్లకు పెరుగుతాయని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అన్నీ ప్రపంచ బ్యాంకుల్లో ఉన్న తమ బ్యాంకింగ్ ర్యాంకును మెరుగుపరుచుకుంటామని, బ్యాలెన్స్ షీటు సైజులో 59 నుంచి 55కు పెరుగుతామని భట్టాచార్య పేర్కొన్నారు. యూకో బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకుల విలీన ప్రక్రియలో బ్యాక్స్ బోర్డు బ్యూరో(బీబీబీ) సహకారాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. టెక్నాలజీ పరంగా, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నింటి పరిష్కారంలో ప్రభుత్వానికి బీబీబీ సహకరించనుంది. అవసరమైతే బ్యాంకు బోర్డులతో కూడా బీబీబీ సమావేశం కానుందని అధికారులు చెబుతున్నారు. కలకత్తాకు చెందిన యూకో బ్యాంకుకు మొండిబకాయిలు 6.76 శాతం నుంచి 15.43శాతానికి పెరగడంతో, మార్చి త్రైమాసికంలో రూ.1,715 కోట్ల నికర నష్టాలను నమోదుచేసింది. అదేవిధంగా బ్యాంకు ఆఫ్ ఇండియా డిసెంబర్ త్రైమాసికంలో రూ.1,506 కోట్ల నష్టాలను, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు రూ.1,425 కోట్ల నష్టాలను ప్రకటించాయి. -
డీలా పడిన యూకో బ్యాంకు
ముంబై : యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు(యూసీఓ) వరుసగా రెండో త్రైమాసికం కూడా నష్టాలనే నమోదుచేసింది. శుక్రవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.1,715.16 కోట్ల నికర నష్టాలను బ్యాంకు ప్రకటించింది. రుణాల ఎగవేత పెరగడం, నికర వడ్డీల ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ నష్టాలను నమోదుచేసినట్టు బ్యాంకు వెల్లడించింది. రుణాలు ఇవ్వడం ద్వారా వచ్చే నికర వడ్డీల ఆదాయం(ఎన్ఐఐ) 26.85శాతం పడిపోయి రూ.933.11కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ. 1,275.67కోట్లగా ఉన్నాయి. వడ్డీల ద్వారా వచ్చే ఆదాయాల కాకుండా, ఇతరేతర ఆదాయాలు కూడా 41.47శాతం పడిపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయాలు రూ.662.55 కోట్లు ఉంటే, ఈ ఏడాది ఈ క్వార్టర్లో రూ.387.80 కోట్లగానే ఉన్నాయని బ్యాంకు తెలిపింది. బ్యాంకుకు వసూలు కాని అప్పులు 142.44శాతం పెరిగి రూ.2,344.80 కోట్లగా ఉండటంతో వరుస నష్టాలను యూఎస్ఓ నమోదు చేస్తుందని బ్యాంకు తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో వసూలు కాని రుణాలు రూ.2,360.84 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుకు ఉన్న మొత్తం రుణశాతంలో, స్థూల మొండిబకాయిలు మార్చి త్రైమాసికంలో 15.43శాతం పెరిగాయి. కిందటి క్వార్టర్లో ఇవి 10.98శాతమే ఉన్నాయి. నికర మొండిబకాయిల 4.3శాతం నుంచి 9.09శాతం పెరిగినట్టు బ్యాంకు ప్రకటించింది. యూఎస్ఓ ఈ త్రైమాసికంలో నమోదుచేసిన నష్టాలతో, స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు షేర్లు 5శాతం మేర పడిపోయాయి. -
యూకో బ్యాంక్‌లో సైకో హల్చల్
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని యూకో బ్యాంక్‌లో గురువారం మధ్యాహ్నం ఓ సైకో హల్చల్ చేశాడు. రాళ్లు, రాడ్‌తో బ్యాంక్ లోపలికి చొచ్చుకు వెళ్లి దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు బ్యాంక్ సిబ్బంది గాయపడ్డారు. బ్యాంక్ సిబ్బంది అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. అనంతరం కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బ్యాంక్ ఉద్యోగుల దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడిని సురేష్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.