
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులోని పలువురు కస్టమర్ల ఖాతాల్లోకి ఏకంగా రూ. 820 కోట్లు పొరపాటున జమయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంకు రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఆయా ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేసి రూ. 649 కోట్లు (సుమారు 79 శాతం) మొత్తాన్ని రాబట్టినట్లు గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది.
మిగతా రూ. 171 కోట్లు కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నామని, తగు చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేసినట్లు వివరించింది. ఈ సాంకేతిక సమస్య మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక హ్యాకింగ్ ప్రయత్నమేదైనా జరిగిందా అనే అంశంపై బ్యాంకు స్పష్టతనివ్వలేదు. నవంబర్ 10–13 మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సరీ్వస్ (ఐఎంపీఎస్)లో సాంకేతిక లోపం కారణంగా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు చేపట్టిన కొన్ని లావాదేవీల్లో తమ బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లోకి నగదు క్రెడిట్ అయినట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఆయా బ్యాంకుల నుంచి తమకు నిధులు అందకుండానే ఈ లావాదేవీలు చోటు చేసుకున్నాయని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో తగు చర్యలు ప్రారంభించినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment