సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్‌ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది.
మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్‌లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్‌పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment