Auckland
-
Australia to New Zealand: గాల్లో కుదిపేసిన విమానం
సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది. మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్‌లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. -
New Zealand: ఆక్లాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్(న్యూజిలాండ్ కాలమానం ప్రకారం) ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2024కి కివీస్ ప్రజలు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్బంగా లైట్‌హౌస్ దగ్గర లేజర్ షో ఆకట్టుకుంది. బాణాసంచా పేలుళ్లలో న్యూఇయర్‌కు ఆక్లాండ్ ప్రజలు స్వాగతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. #WATCH | New Zealand's Auckland welcomes the new year 2024 with fireworks (Source: Reuters) pic.twitter.com/faBWL0b7Eh — ANI (@ANI) December 31, 2023 ఇటు భారత్‌లోనూ మరికొన్ని గంటల్లో ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గిరిలో ఈ ఏడాదికి చివరి సూర్యాస్తమయం ఇదే అంటూ వీడియోను షేర్ చేశారు. #WATCH Last sunset of 2023; visuals from Jalpaiguri, West Bengal. pic.twitter.com/DrFDxjN8gj — ANI (@ANI) December 31, 2023 #WATCH Last sunset of 2023; visuals from Kolkata, West Bengal. pic.twitter.com/LXUF0YK9hk — ANI (@ANI) December 31, 2023 #WATCH Last sunset of 2023; visuals from Guwahati, Assam. pic.twitter.com/6d8CnrSkmx — ANI (@ANI) December 31, 2023 -
న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్. న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
ఓరి దేవుడా! అది బస్సా!.. ఇంకేదైననా?
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అకాల భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. చెట్లు, ఇళ్లు కూలిపోవడమే గాక రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడ రోజువారీ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ యంత్రాంగం ఈ పాటికే ముంపుకు గురైన ప్రాంతాలను సర్వే చేయడం, ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానిపై సమీక్షించడం వంటి పనులు ప్రారంభించింది. అలాగే మరోవైపు నగరాలను క్లీన్ చేయడం వంటి బాధ్యతలను చేపట్టింది కూడా. అంతేగాదు న్యూజిలాంగ్ చరిత్రలో దీన్ని అతి పెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో అదర్నీ తెగ ఆకర్షించింది. ఈ వీడియోని డెబ్బీ బర్రోస్ అనే మహిళ షేర్ చేశారు. ఆమె ఆక్లాండ్ కౌన్సిల్‌లోని 21 స్థానిక బోర్డులలో ఒకటైన మౌంగాకీకీ టమాకీ స్థానిక బోర్డుకు డిప్యూటి చైర్మన్. ఆ వీడియోలో రహాదారిపై నడుమ లోతు వరద నీటితో నిండుగా ఉంది. అక్కడ ఉన్న ఒక కారు కేవలం దానిపై ఉండే రూఫ్ మాత్రమే కనిపిస్తోంది. అంత నిండుగా ఉన్న వరద నీళ్లల్లో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది. అందులో ప్యాసింజర్లు నుంచోని కనిపిస్తున్నారు. అంతేగాదు నీళ్లు ఒకవైపు నుంచి లోపలకు వెళ్తుంటే మరోవైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏదో బోట్ మాదిరిగా వెళ్లిపోతుంది. డ్రైవర్ కూడా ఏదో ఖాళీ రోడ్డు మీద నడుపుతున్నంత ఈజీగా నడిపేశాడు. దీంతో సదరు డిప్యూటీ చైర్మన్ డెబ్బీ బర్రోస్ దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నా!.. ఇది నిజమేనా? చాలా తమాషాగా అనిపిస్తోందన్నారు. వాస్తవానికి ఆ రహదారిని మూసేస్తుండగా ఒక బస్సు అదే సమయంలో రయ్యి మంటూ దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు డెబ్బీ బర్రోస్. దీంతో నెటిజన్లు చాలా హాస్యస్పదంగా ఉంది, బహుశా ఆ డ్రైవర్ డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యవంతుడు కాబోలు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. Historic flooding? No problem, at least for this New Zealand bus driver, who was seen in a viral video driving his bus through shoulder-deep floodwaters like it was NBD. The area around Auckland has experienced unprecedented flooding and rainfall in recent days. pic.twitter.com/a4OUrb5eUj — NowThis (@nowthisnews) February 3, 2023 (చదవండి: కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్) -
తొలి వన్డేకు వర్షం ముప్పు.. వరుణుడి కోసమే సిరీస్ పెట్టినట్లుంది
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో వరుణుడు శాంతించేలా కనిపించడం లేదు. తాజాగా నవంబర్ 25న(శుక్రవారం) ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఆక్లాండ్‌లో వర్షం కురుస్తున్నప్పటికి రెండు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో కాస్త మార్పు కనపించింది. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. మ్యాచ్ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్ ఉందని.. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని.. గంటకు 32 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తి స్థాయిలో జరిగింది. వర్షంతో తొలి టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టి20లో మాత్రం టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో టి20లో కివీస్ ఇన్నింగ్స్ అనంతరం వరుణుడు అడ్డు తగలడం.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించడంతో 1-0తో సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా కివీస్ టూర్ఫై మాత్రం భారత అభిమానులు సంతృప్తిగా లేరు. అసలు టీమిండియా సిరీస్ ఆడడానికి వెళ్లినట్లుగా అనిపించడం లేదని వాపోయారు. టి20, వన్డే సిరీస్‌లు టీమిండియా, కివీస్‌లు ఆడేందుకు కాకుండా వరుణుడి కోసమే ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ చేశారు. ఇక టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు మాత్రం శిఖర్ ధావన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో పలుసార్లు జట్టును నడపించిన ధావన్ ప్రతీసారి సక్సెస్ అవడమే గాక బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌ను కూడా నెగ్గి రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో తన స్థానం మరింత సుస్థిరం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..! -
న్యూజీలాండ్‌లో జరగనున్న 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఆక్లాండ్ (న్యూజీలాండ్): 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రంగా అంగరంగ వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 17-18, అక్టోబర్ 2, 2022 తేదీలలో నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు. ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారాలను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (ఇండియా) కు ప్రదానం చేయనున్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (ఇండియా), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
అక్కడ ముందుగానే న్యూ ఇయర్ 2022
ప్రపంచ దేశాలన్ని న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి నగరంగా నిలిచింది. ఆక్లాడ్లోని ప్రజలు బాణాసంచా కాల్చుతూ.. శుక్రవారం నగరంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో పలు దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాల్లో ఆంక్షల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కొత్త ఏడాది 2022లోకి అడుగుపెడతామన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ముందుగానే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నగరమంతా బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటోంది. #WATCH | New Zealand's Auckland rings in #NewYear2022 with fireworks display (Video: Reuters) pic.twitter.com/UuorkGHPEg — ANI (@ANI) December 31, 2021 -
వైడ్ బాల్ విషయంలో వివాదం.. బౌలర్ ముఖంపై దాడి
ఆక్లాండ్: స్థానికంగా జరిగిన ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య వివాదం గొడవకు దారితీసింది. సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్‌ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41)పై ప్రత్యర్ధి జట్టు ఆటగాడు దాడి చేయడంతో అతను కొన్ని నిమిషాల పాటు స్పృహ కోల్పోయాడు. వైడ్ బాల్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం మొదలవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైడ్ బాల్ విషయంలో మోసం చేయొద్దని అనడంతో రెచ్చిపోయిన ప్రత్యర్ధి జట్టు ఆటగాడు.. గొంతు నులమడంతో పాటు తన ముఖంపై దాడి చేసి గాయపరిచాడని, చికిత్స అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరగడం వల్ల తాను 300 డాలర్లు నష్టపోయినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ గొడవపై స్పందించిన ఆక్లాండ్ క్రికెట్ సంఘం.. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, బాధిత క్రికెటర్ పార్ట్ టైమ్ కింద ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
మాల్లో కరోనా రోగి : భారీ జరిమానా
అక్లాండ్ : భారత్ నుంచి ఇటీవల తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి (32) సూపర్ మార్కెట్‌కు వెళ్లేందుకు అక్లాండ్‌లోని ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్ కేంద్రం ఫెన్సింగ్‌ను దాటుకుని ఈ వ్యక్తి మంగళవారం ఉదయం అదృశ్యమయ్యాడని న్యూజిలాండ్ హెరాల్డ్ వెల్లడించింది. జులై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. కాగా ఈ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని వెల్లడించినట్టు అధికారులు తెలిపారని ఆ కథనం పేర్కొంది. కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమవడం తీవ్రమైన విషయమని ఆరోగ్య మంత్రి క్రిస్ హిప్కిన్స్ అన్నారు. అతడి చర్యలు స్వార్థపూరితమని, ఆ వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్ చెప్పారు. ఐసోలేషన్ కేంద్రం నుంచి వెళ్లినందుకు అతడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ 2.8 లక్షల జరిమానా విధిస్తారని న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది. కాగా కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి తమ స్టోర్‌కు వచ్చాడని తెలియడంతో సూపర్‌మార్కెట్ సిబ్బంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ 1187 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 23 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉంటున్నారు.చదవండి : కరోనా చీకటిలో ధారవి -
కరోనా : ఇలా కూడా నిర్థారణ చేసుకోవచ్చు!
వెల్లింగ్టన్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా వైరస్ సోకని ప్రాంతం లేదు. కొంతమందిలో లక్షణాలు కనిపిస్తుంటే మరికొంత మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అవుతుంది. చాలా మందికి తమకి కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ ప్రస్తుతం వస్తున్న రద్దీ లేదా ఇతర కారణాల వల్ల కావొచ్చు, ఆసుపత్రులకు వెళ్లి ఎలా పరీక్షలు చేయించుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం న్యూజీల్యాండ్‌లోని ఆక్ల్యాండ్కు చెందిన జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సంధ్యా రామనాథన్ మంచి చిట్కాలు, కొన్ని సలహాల ఇచ్చారు. కరోనా సోకిందా లేదా నిర్థారణ కోసం ఉపయోగపడే పరికరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానంగా ఉంటే ఒక చిన్న పరికరంతో తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ఆ పరికరం పేరు పల్స్ ఆక్సీ మీటర్. ఈ మిషన్‌లో మన చూపుడు వేలును ఉంచితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఎంత మేరకు ఉందో తెలియజేస్తుంది. చూపుడు వేలుకి ఆక్సీమీటర్ పెట్టిన తర్వాత మిషన్‌లో 95 నుంచి 100 మధ్యలో రీడింగ్ చూపిస్తే ఈ రక్తంలో ఆక్సీజన్ తగినంతగా ఉన్నట్టు లెక్క. అంతకంటే తక్కువ చూపిస్తే లేదా 93 కన్నా తక్కువ చూపించిన పక్షంలో వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ రామనాథన్ చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా కరోనా వైరస్ బారిన పడితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుంది. అందుకే పల్స్ ఆక్సీ మీటర్‌తో పరీక్షించినప్పుడు రేటింగ్ తక్కువ వస్తే వైద్యులను సంప్రదించాలి. (వైరస్ సోకకుండా పుతిన్‌కు భారీ టన్నెల్) మరో విధంగా కూడా మన కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని నిర్థారణ చేసుకోవచ్చు. దీని కోసం మీకు కావల్సింది రెండు పెద్ద బెలూన్లు. వీటిలోకి గాలి ఊదటం ద్వారా మీరు ఎంతవరకు శ్వాసను ఎంత వరకు ఆపగలుగుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ సోకితే మనం శ్వాసను ఎక్కువసేపు పట్టి ఉంచలేం. ఇకపోతే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరం. దాని కోసం ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను తీసుకోవాలి. ప్రతి రోజు తినే ఆహారంలో జింక్, విటమిన్ డి, విటమిన్ సి తప్పని సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరిస్తూ, తరచూ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంచుకోవాలి. (మనం కరోనా వైరస్‌ను తిప్పికొట్టగలం) ఇక కరోనా వైరస్ సోకిన వారు దాని నుంచి కోలుకోవాలంటే తరుచూ వేడి నీటితో పుక్కిళ్లించి ఉమ్ముతూ ఉండాలి. అదే విధంగా నాజిల్ స్స్ర్పేని ఉపయోగించాలి. కరోనా వైరస్ ఊపిరితిత్తుల గోడలో చివరి భాగన అతుక్కొని ఉంటుంది. దానిని బయటకు తీసుకురావడానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ సోకినా తొందరగా దాని నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలి అనేది డాక్టర్ సంధ్య రామ్‌నాథన్ వీడియోలో చూపించారు. పైన చెప్పినవన్నీ చేయడం ద్వారా కరోనావైరస్ సోకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. (ఈ పరికరంతో కరోనా వైరస్.. మటాష్) -
36 ఏళ్లు... 11 సిరీస్‌లు...
భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో విదేశాల్లో విజయం సాధించడమనేది మొదటి నుంచీ పెద్ద సవాల్‌గానే నిలిచింది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్లు ఉన్న సమయంలో కూడా విదేశాల్లో సిరీస్ విజయాలు మనకు అంత సులభంగా దక్కలేదు. ఈ రకంగా విదేశాల్లో భారత ప్రదర్శనను బట్టి చూస్తే తొలి సిరీస్ విజయం ఎప్పుడైనా అపురూపమే. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మధురక్షణమే. 1968లో న్యూజిలాండ్ గడ్డపై భారత్ విదేశాల్లో తమ తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1932లో భారత జట్టు ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. దాంతో కలిపి వరుసగా జరిపిన 11 విదేశీ పర్యటనల్లోనూ 10 సార్లు జట్టుకు సిరీస్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతుల్లో ఈ పరాజయాలు ఎదురుకాగా, స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్‌తో ఆడిన ఒక్క సిరీస్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. గెలుపు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. ఇలాంటి నేపథ్యంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు అద్భుత విజయం దక్కింది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత్ 4 టెస్టుల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకోవడం విశేషం. మన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సయ్యద్ ఆబిద్ అలీ, ఎంఎల్ జైసింహ ఈ సిరీస్ విజయంలో భాగంగా ఉన్నారు. ఈ నాలుగు టెస్టుల ఫలితాలను చూస్తే... తొలి టెస్టు (డ్యునెడిన్) భారత్ ఐదు వికెట్లతో విజయం డౌలింగ్ (143) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 350 పరుగులు చేసింది. ఆబిద్ అలీకి 4 వికెట్లు దక్కాయి. అజిత్ వాడేకర్ (80), ఫరూఖ్ ఇంజినీర్ (63) బ్యాటింగ్‌తో భారత్ 359 పరుగులు చేసింది. ఎరాపల్లి ప్రసన్న 6 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం రుచి చూసింది. రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్): న్యూజిలాండ్ ఆరు వికెట్లతో విజయం డౌలింగ్ (239) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ ముందుగా 502 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీకి 6 వికెట్లు దక్కాయి. భారత్ 288 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగలిగింది. 88 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి కివీస్ ఛేదించింది. మూడో టెస్టు (వెల్లింగ్టన్): భారత్ ఎనిమిది వికెట్లతో విజయం ఎరాపల్లి ప్రసన్న 5 వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే కుప్పకూలింది. భారత్ 327 పరుగులు చేసి భారీ ఆధిక్యం అందుకుంది. అజిత్ వాడేకర్ (143) శతకం సాధించడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మళ్లీ బ్యాటింగ్‌లో విఫలమై 199 పరుగులకే ఆలౌటైంది. బాపు నాదకర్ణి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. 59 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి సిరీస్‌లో ముందంజ వేసింది. నాలుగో టెస్టు (ఆక్లాండ్): భారత్ 272 పరుగులతో విజయం విదేశాల్లో భారత్ సిరీస్ విజయపు కలను నెరవేర్చిన మ్యాచ్ ఇది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు మాత్రమే చేసినా... న్యూజిలాండ్‌ను 140 పరుగులకే పడగొట్టింది. మరోసారి ప్రసన్న 4 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 261 వద్ద డిక్లేర్ చేసింది. రూసీ సుర్తీ 99 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 374 పరుగుల అసాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ సొంతగడ్డపై చేతులెత్తేసింది. 101 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రసన్న 4, బేడీ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. భారత్ చరిత్రాత్మక సిరీస్ విజయంలో అజిత్ వాడేకర్ 328 పరుగులతో మన తరఫున టాప్ స్కోరర్‌గా నిలవగా...సుర్తీ, ఫరూఖ్ ఇంజినీర్ చెరో 321 పరుగులు సాధించారు. ఏకైక సెంచరీని వాడేకర్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో 24 వికెట్లతో ఎరాపల్లి ప్రసన్న ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా... బిషన్ సింగ్ బేడీ 16, బాపు నాదకర్ణి 14 వికెట్లతో అండగా నిలిచారు. –సాక్షి క్రీడా విభాగం -
సిరీస్ గెలుచుకున్న కివీస్; భారత్‌కు తప్పని పరాభవం
-
సిరీస్ గెలుచుకున్న కివీస్; భారత్‌కు తప్పని పరాభవం
ఆక్లాండ్ : న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కూడా టీమిండియా పరాజయం పాలై సిరీస్‌ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. శనివారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. కాగా మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలవడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. (అయ్యర్.. ఆ షాట్ అవసరమా!) భారత ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన బ్యాటింగ్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చినా మిగిలిన ఆటగాళ్ల సహాకారం కరువైంది. చివర్లో నవదీప్ సైనీ తన మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుపై ఆశలు చిగురించినా కైల్ జేమిసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఇక చివర్లో ఒత్తిడిని జయించలేక 48.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్ అయ్యర్ 52, నవదీప్ సైనీ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌదీ, జేమిసన్, కొలిన్ డి ఇంగ్రామ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్మెన్లలో గప్టిల్ 79, రాస్ టేలర్ 73, నికోల్స్ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 3వికెట్లు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశారు. కాగా నామమాత్రంగా మారిన మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనూయిలో జరగనుంది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురవకుండా ఉంటుందమో వేచి చూడాలి. (కోహ్లి అంచనా తప్పింది..!) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి'
ఆక్లాండ్ : అండర్ 19 ప్రపంచకప్‌లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్ లో సేన్వెస్ పార్క్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజార, అజింక్యా రహానే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ముందుగా ఫైనల్ చేరినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమనేది ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించారు. ఫైనల్లోనూ ఇదే తరహాలో ఆడి బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి. ఈసారి కూడా కప్పు మనదే అవ్వాలి' అంటూ పేర్కొన్నారు. (ఇదే రోజు పాకిస్తాన్‌పై అద్భుతం..) కాగా సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా కుర్రాళ్లు 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఏడవ సారి ఫైనల్‌కు చేరుకుంది. ప్రసుత్తం టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడేందుకు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. చటేశ్వర్ పుజారా 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో 349 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. అప్పటి ప్రపంచకప్ ఫైనల్ పాకిస్తాన్- ఇండియా మధ్య జరగ్గా, పాక్ 38 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. (బంగ్లాదేశ్ వచ్చేసింది ) -
బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి
-
'ఐపీఎల్ ప్రదర్శనతోనే ధోని భవితవ్యం తేలనుంది'
ఆక్లాండ్ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో మాజీ కెప్టెన్ ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొందరూ ధోని రీ ఎంట్రీ పక్కా.. అంటే, మరికొందరూ జార్ఖండ్ డైనమైట్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోని భవితవ్యం ఐపీఎల్‌తో తేలనుందని పేర్కొన్నాడు. 'రానున్న ఐపీఎల్ ధోనికి ఎంత కీలకమో సెలెక్టర్లు, కెప్టెన్‌తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. ధోని తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడని, ఈ విధంగానే అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కాగా ఐపీఎల్‌కు సంబంధించి ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఐపీఎల్లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు.ఐపీఎల్లో ఆడే ఆటతోనే అతని భవితవ్యం ముడిపడి ఉంది. ఒక వేళ ఐపీఎల్లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనినే నిర్మోహమాటంగా తప్పుకుంటాడని' రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.('ధోనికి ప్రత్యామ్నాయం అతడే') గతేడాది వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం ధోని ఆటకు దూరమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు ఆర్మీతో గడిపినా.. అనంతరం తన భవితవ్యంపై స్పష్టతనివ్వకుండా మౌనంగానే ఉన్నాడు. పైగా జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు. ఆటకు దూరమవడంతోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలిగించింది. అయితే ఇటీవల జార్ఖండ్ టీమ్‌తో కలిసి ధోని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు.(నేను సెలక్టర్‌ను కాదు కోచ్‌ను: రవిశాస్త్రి) -
తొలి టీ20లో అదరగొట్టిన భారత్
-
టీ20 చరిత్రలో ఇదే తొలిసారి..!
ఆక్లాండ్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన రికార్డు లిఖించబడింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేసి పరుగుల మోత మోగించారు. ఈ క్రమంలోనే ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు యాభైకి పైగా పరుగులు చేయగా, ఇద్దరు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కివీస్ ఆటగాళ్లలో మున్రో( 59), విలియమ్సన్(51), రాస్ టేలర్(54 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించగా, భారత్ నుంచి కేఎల్ రాహుల్(56), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20లో ఐదుగురు బ్యాట్స్మన్లు యాభైకి పరుగుల్ని సాధించడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా, టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. (ఇక్కడ చదవండి: అయ్యర్ అదరహో.. ) టీమిండియానే టాప్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల పరుగులు, ఆపై టార్గెట్‌ను అత్యధిక సార్లు సాధించిన ఘనత కూడా టీమిండియాదే. ఇప్పటివరకూ ఇంటర్నేషనల్ టీ20ల్లో నాలుగుసార్లు 200 పరుగుల్ని ఛేదించింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆసీస్ రెండుసార్లు మాత్రమే ఆ ఫీట్‌ను సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లు తలోసారి మాత్రమే రెండొందలకుపైగా టార్గెట్‌ను ఛేదించిన జట్లు. 2009లో శ్రీలంకతో మొహాలీలో జరిగిన టీ20లో భారత్ 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించగా, 2013లో ఆసీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. గతేడాది చివర్లో హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేధించింది. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) -
అయ్యర్ అదరహో..
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అదరగొట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి శుభారంభం చేసింది. రోహిత్ శర్మ(7) విఫలమైనా కేఎల్ రాహుల్(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు ఆరంభంలో అదరగొడితే, శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని అధిగమిస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి శభాష్ అనిపించాడు. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాంట్నార్ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి కవర్లోకి ఆడాడు. దానికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్ క్రీజ్‌ను వదిలి రాకతప్పలేదు. ఆ సమయానికి రాహుల్ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం సాధించాడు. దాంతో భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. కాసేపటికి రాహుల్ ఔటైనప్పటికీ అయ్యర్ చక్కటి ఆట తీరుతో అలరించాడు. కోహ్లి హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి పెవిలియన్ చేరినప్పటికీ అయ్యర్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కాసేపు శివం దూబే(13)కలిసి ఇన్నింగ్స్ రిపేర్ చేసిన అయ్యర్.. మనీష్ పాండే(14 నాటౌట్)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు విజయం అందించాడు. దాంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం జరుగనుంది. (ఇక్కడ చదవండి: రాహులా.. ఇదే కదా అదృష్టం!) ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్‌కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్ ఝుళిపించింది. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్ కొట్టడానికి యత్నించగా స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో గప్టిల్ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్ హోమ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 117 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్‌ను రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్ టేలర్ నుంచి కూడా చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. చహల్ బాగా ఆఫ్‌సైడ్‌కు వేసిన బంతిని వెంటాడి షాట్‌కు యత్నించాడు. అయితే ఎడ్జ్ తీసుకోవడంతో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, టేలర్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో న్యూజిలాండ్ రెండొందల మార్కును చేరింది. టేలర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, చహల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాహులా.. ఇదే కదా అదృష్టం!
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాంట్నార్ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతిని కవర్స్‌లోకి ఆడాడు. దానికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్ క్రీజ్‌ను వదిలి రాకతప్పలేదు. ఈ క్రమంలోనే రెండుసార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముందుగా బౌలర్ బెన్నెట్ డైరెక్ట్ హిట్ కోసం యత్నించగా అది మిస్ అయ్యింది. అప్పటికి రాహుల్ పిచ్ సగం కూడా దాటలేదు. ఆపై మిడ్ వికెట్ ఫీల్డర్ మళ్లీ బంతిని వికెట్లపైకి వేయగా అది కూడా తగల్లేదు. దాంతో రాహుల్ బతికిపోయాడు. ఎలాగో రనౌట్ నుంచి తప్పించుకోవడంతో రాహుల్ ఊపిరి తీసుకున్నాడు. ఇక రాహులా.. ఇదే కదా అదృష్టం అనుకోవడం అభిమానుల వంతైంది. ఆ సమయానికి రాహుల్ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం సాధించాడు. కాగా, 56 వ్యక్తిగత పరుగుల వద్ద రాహుల్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇష్ సోథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి సౌతీ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: విలియమ్సన్కు పూనకం..) -
విలియమ్సన్కు పూనకం..
ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ 204 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్‌కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్ ఝుళిపించింది. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్ కొట్టడానికి యత్నించగా స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో గప్టిల్ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్ హోమ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 117 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) విలియమ్సన్కు పూనకం.. సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్‌ను రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్ టేలర్ నుంచి కూడా చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. చహల్ బాగా ఆఫ్‌సైడ్‌కు వేసిన బంతిని వెంటాడి షాట్‌కు యత్నించాడు. అయితే ఎడ్జ్ తీసుకోవడంతో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, టేలర్ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో న్యూజిలాండ్ రెండొందల మార్కును చేరింది. టేలర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, చహల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. (ఇక్కడ చదవండి: ‘పంత్‌ను అలా చూడాలనుకుంటున్నా’) -
పంత్, శాంసన్‌లను పక్కన పెట్టేశారు..
ఆక్లాండ్: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో వరుసగా జరిగిన సిరీస్‌లను కైవసం చేసుకుని మంచి జోరు మీదున్న టీమిండియా.. కొత్త ఏడాది తొలి విదేశీ పర్యటనలో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) న్యూజిలాండ్‌తో తొలి టీ20ని ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్దింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ప్రత్యర్థి జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత జట్టులో స్పెషలిస్టు కీపర్‌ని ఎవర్నీ తీసుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ కీపింగ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన కేఎల్ రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ టీ20 సిరీస్‌లో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లు ఉన్నప్పటికీ వారికి అవకాశం దక్కలేదు. అదనపు బ్యాట్స్‌మన్ కావాలనే ఉద్దేశంతో వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. దాంతో పంత్, శాంసన్‌లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యారు.(ఇక్కడ చదవండి: ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్..!) భారత క్రికెట్ జట్టు తమ టి20 చరిత్రలో ఎన్నడూ ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్‌లో భారత్ ఎలా రాణిస్తుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరొకవైపు పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్‌తో ఆడతుండటంతో పాటు వారి గడ్డపై భారత్ ఎంత వరకూ ఆకట్టుకుంటుందో అనేది చూడాలి. ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. మరీ చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయంగా కనబడుతోంది. తుది జట్లు.. భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే, షమీ, బుమ్రా, శార్దూల్ , చహల్ న్యూజిలాండ్ విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సీఫెర్ట్, రాస్ టేలర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్, బ్లెయిర్ టిక్నెర్ -
కివీస్ చేరిన కోహ్లి బృందం
ఆక్లాండ్: మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగు పెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కెప్టెన్ కోహ్లి సహచర ఆటగాళ్లు అయ్యర్, శార్దుల్లతో కలిసి ట్వీట్ చేశాడు. ఈ పర్యటనలో భారత్, కివీస్ మధ్య 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టి20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. గత ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత్ వన్డే సిరీస్‌ను 4–1తో గెలుచుకొని టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది. -
బజార్లో బూతు వీడియోలు..
అక్లాండ్ : ఓ షాప్ ప్రమోషనల్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ అక్లాండ్‌లోని అసిక్స్ అనే స్పోర్ట్స్ స్టోర్ బయట ఉన్న ప్రమోషనల్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు ప్లే కావడంతో అక్కడున్న ప్రజలు, ఇబ్బంది పడాల్సి వచ్చింది. కుటుంబసభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి రోడ్డుపై వచ్చిన వారు ఆ దృశ్యాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు. సాధారణంగా ఆ స్టోర్‌ను ఉదయం 10గంటలకు తెరుస్తారు. అయితే ఉదయం 8 గంటల నుంచి స్టోర్ తెరపై పోర్న్ వీడియోలు ప్లే అవుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఆ తర్వాత స్టోర్ నిర్వహకులు ఆ వీడియోలు ప్లే కాకుండా చూశారు. అయితే ఎవరో హ్యాకింగ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని స్టోర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని.. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగనివ్వమని తెలిపారు. -
నేను ప్రాధేయపడ్డా.. సవాల్ చేశా: సచిన్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌ది ప్రత్యేక శకం. ప్రపంచ క్రికెట్లో ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడంటే అందుకు ఓపెనర్‌గా సక్సెక్ కావడం ప్రధానం కారణం. 1989లో భారత క్రికెట్లోకి అడుగపెట్టిన సచిన్.. 1994లో ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్ ద్వారా ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించాడు సచిన్. తాను ఓపెనర్‌గా రావడానికి టీమిండియా మేనేజ్మెంట్ను ఎలా ఒప్పించాడనే విషయాన్ని సచిన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తాను ఓపెనర్‌గా రావడానికి ఎంతగానో ప్రాధేయపడ్డానని, అదే సమయంలో మేనేజ్మెంట్తో వాదనకు దిగానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు లింక్డిన్లో ఒక వీడియోను షేర్ చేసిన సచిన్.. తాము సక్సెస్ అవుతామనుకునే ఫీల్డ్‌లో రిస్క్ చేయడానికి వెనుకంజ వేయొద్దని అభిమానులకు సూచించాడు. ‘ విఫలం అవుతామనే భయం ఎప్పటికీ వద్దు. నీవు సక్సెస్ అవుతాను అనుకుంటే కచ్చితంగా అందుకోసం రిస్క్ చేయి. రిస్క్ చేయపోతే ముందుకు వెళ్లడం కష్టం. అందుకు నేనొక ఉదాహరణ. నేను ఓపెనర్‌గా చేయడానికి భయపడలేదు. నాకిష్టమైన ఓపెనింగ్ విభాగంలో బ్యాటింగ్‌కు చేయడానికి టీమిండియా మేనేజ్మెంట్ను ఎంతో వేడుకున్నా. వారితో వాదించి మరీ ముందుకు వెళ్లా. 25 ఏళ్ల క్రితం నాటి ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను ఓపెనర్‌గా దిగుతానని పట్టుబట్టా. ఒకవేళ నేను ఓపెనర్‌గా సక్సెస్ కాలేకపోతే మళ్లీ ఎప్పుడూ మిమ్మల్ని అడగనని మరీ వారికి సవాల్ చేశా. అదే నా సక్సెస్‌కు కారణం. భయపడితే విజయాలు రావు. విఫలం అవుతాననే భయం వద్దు’ అని సచిన్ పేర్కొన్నాడు.