ఆక్లాండ్: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో వరుసగా జరిగిన సిరీస్‌లను కైవసం చేసుకుని మంచి జోరు మీదున్న టీమిండియా.. కొత్త ఏడాది తొలి విదేశీ పర్యటనలో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) న్యూజిలాండ్‌తో తొలి టీ20ని ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్దింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ప్రత్యర్థి జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత జట్టులో స్పెషలిస్టు కీపర్‌ని ఎవర్నీ తీసుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ కీపింగ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన కేఎల్ రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది. ఈ టీ20 సిరీస్‌లో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లు ఉన్నప్పటికీ వారికి అవకాశం దక్కలేదు. అదనపు బ్యాట్స్‌మన్ కావాలనే ఉద్దేశంతో వీరిద్దర్నీ పక‍్కన పెట్టేశారు. దాంతో పంత్, శాంసన్‌లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యారు.(ఇక్కడ చదవండి: ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్..!)
భారత క్రికెట్ జట్టు తమ టి20 చరిత్రలో ఎన్నడూ ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్‌లో భారత్ ఎలా రాణిస్తుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరొకవైపు పొట్టి ఫార్మాట్‌లో బలమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్‌తో ఆడతుండటంతో పాటు వారి గడ్డపై భారత్ ఎంత వరకూ ఆకట్టుకుంటుందో అనేది చూడాలి. ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. మరీ చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయంగా కనబడుతోంది.
తుది జట్లు..
భారత్
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే, షమీ, బుమ్రా, శార్దూల్ , చహల్
న్యూజిలాండ్
విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సీఫెర్ట్, రాస్ టేలర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్, బ్లెయిర్ టిక్నెర్
Comments
Please login to add a commentAdd a comment