
ఆక్లాండ్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన రికార్డు లిఖించబడింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేసి పరుగుల మోత మోగించారు. ఈ క్రమంలోనే ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు యాభైకి పైగా పరుగులు చేయగా, ఇద్దరు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కివీస్ ఆటగాళ్లలో మున్రో( 59), విలియమ్సన్(51), రాస్ టేలర్(54 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించగా, భారత్ నుంచి కేఎల్ రాహుల్(56), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20లో ఐదుగురు బ్యాట్స్‌మన్లు యాభైకి పరుగుల్ని సాధించడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా, టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. (ఇక‍్కడ చదవండి: అయ్యర్ అదరహో.. )
టీమిండియానే టాప్..
అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల పరుగులు, ఆపై టార్గెట్‌ను అత్యధిక సార్లు సాధించిన ఘనత కూడా టీమిండియాదే. ఇప్పటివరకూ ఇంటర్నేషనల్ టీ20ల్లో నాలుగుసార్లు 200 పరుగుల్ని ఛేదించింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆసీస్ రెండుసార్లు మాత్రమే ఆ ఫీట్‌ను సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లు తలోసారి మాత్రమే రెండొందలకుపైగా టార్గెట్‌ను ఛేదించిన జట్లు.
2009లో శ్రీలంకతో మొహాలీలో జరిగిన టీ20లో భారత్ 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించగా, 2013లో ఆసీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. గతేడాది చివర్లో హైదరాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేధించింది. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!)
Comments
Please login to add a commentAdd a comment