
అక్లాండ్ : ఓ షాప్ ప్రమోషనల్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ అక్లాండ్‌లోని అసిక్స్ అనే స్పోర్ట్స్ స్టోర్ బయట ఉన్న ప్రమోషనల్ స్క్రీన్‌పై పోర్న్ వీడియోలు ప్లే కావడంతో అక్కడున్న ప్రజలు, ఇబ్బంది పడాల్సి వచ్చింది. కుటుంబసభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి రోడ్డుపై వచ్చిన వారు ఆ దృశ్యాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు.
సాధారణంగా ఆ స్టోర్‌ను ఉదయం 10గంటలకు తెరుస్తారు. అయితే ఉదయం 8 గంటల నుంచి స్టోర్ తెరపై పోర్న్ వీడియోలు ప్లే అవుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఆ తర్వాత స్టోర్ నిర్వహకులు ఆ వీడియోలు ప్లే కాకుండా చూశారు. అయితే ఎవరో హ్యాకింగ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని స్టోర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని.. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగనివ్వమని తెలిపారు.