ప్రపంచ దేశాలన్ని న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి నగరంగా నిలిచింది. ఆక్లాడ్‌లోని ప్రజలు బాణాసంచా కాల్చుతూ.. శుక్రవారం నగరంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో పలు దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి.
మరికొన్ని దేశాల్లో ఆంక్షల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కొత్త ఏడాది 2022లోకి అడుగుపెడతామన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ముందుగానే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నగరమంతా బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటోంది.
#WATCH | New Zealand's Auckland rings in #NewYear2022 with fireworks display
— ANI (@ANI) December 31, 2021
(Video: Reuters) pic.twitter.com/UuorkGHPEg
Comments
Please login to add a commentAdd a comment