అండర్ 19 ప్రపంచకప్‌లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్ లో సేన్వెస్ పార్క్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది.