
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు
ఆక్లాండ్ టెస్ట్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఆరంభంలో ఇండియా బౌలర్లు చెలరేగినా... ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. స్కిప్పర్ బ్రెండన్ మెక్కులమ్, కేన్ విలియమ్స్ లిద్దరు సెంచరీలు చేసి కివీస్ ఇన్నింగ్స్‌ను స్థిర పరచడమే కాకుండా భారీ స్కోరు దిశగా నడిపించారు. మెక్కులమ్ తన కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ చేయగా, విలియమ్స్ ఐదో సెంచరీ చేశాడు. విలియమ్స్ ఔటయ్యాక వచ్చిన అండరన్సన్ కూడా స్థిరంగా ఆడటంతో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 329 పరుగులు చేసింది.