New Zealand v India
-
న్యూజిలాండ్ 252/5
-
న్యూజిలాండ్ 252/5
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ టెస్ట్‌లో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 252 పరుగులు చేసింది. 114 పరుగులతో మెక్‌కల్లామ్, 52 పరుగులతో వాట్లింగ్ నాట్ ఔట్‌గా ఉన్నారు. లధమ్ 29, రూధర్ ఫర్డ్ 36 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి భారత్‌పై న్యూజిలాండ్ ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్ వేస్తున్న భారత జట్టు జహీర్ ఖాన్ 3 వికెట్లు, మహ్మద్ షమ్మి, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు. -
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు
-
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు
ఆక్లాండ్ టెస్ట్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఆరంభంలో ఇండియా బౌలర్లు చెలరేగినా... ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చెలరేగారు. స్కిప్పర్ బ్రెండన్ మెక్కులమ్, కేన్ విలియమ్స్ లిద్దరు సెంచరీలు చేసి కివీస్ ఇన్నింగ్స్‌ను స్థిర పరచడమే కాకుండా భారీ స్కోరు దిశగా నడిపించారు. మెక్కులమ్ తన కెరీర్లో ఎనిమిదో సెంచరీ చేయగా, విలియమ్స్ ఐదో సెంచరీ చేశాడు. విలియమ్స్ ఔటయ్యాక వచ్చిన అండరన్సన్ కూడా స్థిరంగా ఆడటంతో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 329 పరుగులు చేసింది.