
న్యూజిలాండ్ 252/5
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ టెస్ట్లో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 252 పరుగులు చేసింది. 114 పరుగులతో మెక్కల్లామ్, 52 పరుగులతో వాట్లింగ్ నాట్ ఔట్గా ఉన్నారు. లధమ్ 29, రూధర్ ఫర్డ్ 36 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి భారత్పై న్యూజిలాండ్ ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్ వేస్తున్న భారత జట్టు జహీర్ ఖాన్ 3 వికెట్లు, మహ్మద్ షమ్మి, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.