Wellington test
-
'ఆరో వికెట్ భాగస్వామ్యం విడిపోయింది'
వెల్లింగ్టన్ : వెల్లింగ్టన్ టెస్ట్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఎట్టకేలకు ఆరో వికెట్ భాగస్వామ్యం విడిపోయింది. సెంచరీ వీరుడు వాట్లింగ్‌ను మహ్మద్ షమీ కొత్త బంతితో ఇబ్బంది పెట్టి ఎల్బీడబ్ల్యూ రూపంలో వికెట్ తీశాడు. దాంతో 355 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెర పడింది. మరోవైపు బ్రెండన్ మెక్కులమ్ డబుల్ సెంచరీ చేశాడు. 252 పరుగులతో ఆడుతున్నాడు. వాట్లింగ్, మెక్కులమ్ భారీ భాగస్వామ్యం...2001లో ఈడెన్‌గార్డెన్స్‌లో ఆసీస్‌పై రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ మెగా పార్ట్నర్షిప్ అందరికీ గుర్తు చేసింది. -
న్యూజిలాండ్ 252/5
-
న్యూజిలాండ్ 252/5
భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ టెస్ట్‌లో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టానికి 252 పరుగులు చేసింది. 114 పరుగులతో మెక్‌కల్లామ్, 52 పరుగులతో వాట్లింగ్ నాట్ ఔట్‌గా ఉన్నారు. లధమ్ 29, రూధర్ ఫర్డ్ 36 పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి భారత్‌పై న్యూజిలాండ్ ఆరు పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్ వేస్తున్న భారత జట్టు జహీర్ ఖాన్ 3 వికెట్లు, మహ్మద్ షమ్మి, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.