PAK Vs NZ: పాక్‌కు పరాభవం | New Zealand Defeat Pakistan In First Match Of Champions Trophy 2025, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

CT 2025 PAK Vs NZ: పాక్‌కు పరాభవం

Published Thu, Feb 20 2025 1:07 AM | Last Updated on Thu, Feb 20 2025 1:23 PM

New Zealand Defeat Pakistan in First Match of Champions Trophy 2025

తొలి మ్యాచ్‌లో ఓడిన డిఫెండింగ్‌ చాంపియన్‌

60 పరుగులతో న్యూజిలాండ్‌ గెలుపు

లాథమ్, విల్‌ యంగ్‌ సెంచరీలు  

కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగు పెట్టిన పాకిస్తాన్‌ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్‌ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. 

బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో సాంట్నర్‌ సారథ్యంలోని కివీస్‌ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టామ్‌ లాథమ్‌ (104 బంతుల్లో 118 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్‌ యంగ్‌ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో చెలరేగారు. 

యంగ్, లాథమ్‌ నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించారు.  గ్లెన్‌ ఫిలిప్స్‌ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్‌ ఐదో వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్‌ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్‌ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్‌దిల్‌ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు.    

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: యంగ్‌ (సి) (సబ్‌) ఫహీమ్‌ (బి) నసీమ్‌ 107; కాన్వే (బి) అబ్రార్‌ 10; విలియమ్సన్‌ (సి) రిజ్వాన్‌ (బి) నసీమ్‌ 1; మిచెల్‌ (సి) అఫ్రిది (బి) రవూఫ్‌ 10; లాథమ్‌ (నాటౌట్‌) 118; ఫిలిప్స్‌ (సి) ఫఖర్‌ (బి) రవూఫ్‌ 61; బ్రేస్‌వెల్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. 
వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. 
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10–0–68–0, నసీమ్‌ 10–0–63–2, అబ్రార్‌ 10– 0–47–1, రవూఫ్‌ 10–0–83–2, ఖుష్‌దిల్‌ 7–0– 40–0, సల్మాన్‌ 3–0–15–0.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: షకీల్‌ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్‌ ఆజమ్‌ (సి) విలియమ్సన్‌ (బి) సాంట్నర్‌ 64; రిజ్వాన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రూర్కే 3; ఫఖర్‌ (బి) బ్రేస్‌వెల్‌ 24; సల్మాన్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) స్మిత్‌ 42; తాహిర్‌ (సి) విలియమ్సన్‌ (బి) సాంట్నర్‌ 1; ఖుష్‌దిల్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 14; నసీమ్‌ (బి) హెన్రీ 13; రవూఫ్‌ (సి) మిచెల్‌ (బి) సాంట్నర్‌ 19; అబ్రార్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్‌) 260. 
వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. 
బౌలింగ్‌: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్‌వెల్‌ 10–1–38–1, ఫిలిప్స్‌ 9–0–63–0, సాంట్నర్‌ 10–0–66–3, స్మిత్‌ 2–0–20–1.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement