
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్-ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం చహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. ధనశ్రీ చహల్‌ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేయడం క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ధనశ్రీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ధనశ్రీ చహల్‌ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఈ విషయంలో చహల్‌కు అండగా నిలుస్తున్నారు. చాలా మంది క్రికెట్ అభిమానుల్లాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా చహల్‌కు మద్దతుగా నిలిచినట్లనిపిస్తుంది.
తాజాగా ధనశ్రీని విమర్శిస్తూ శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ సోషల్‌మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. దీనికి రితిక లైక్ కొట్టింది. ఇది తెలిసి అభిమానులు ధనశ్రీ అంటే రితికకు సరిపోదా అని చర్చించుకుంటున్నారు. ధనశ్రీపై శుభాంకర్ విమర్శలతో ఏకీభవించే రితిక ఇలా చేసుంటుందని అనుకుంటున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
శుభాంకర్ మిశ్రా ధనశ్రీ వర్మను 'గోల్డ్ డిగ్గర్' అని సంబోధించాడు. గోల్డ్ డిగ్గర్ అంటే డబ్బు కోసం ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకునే మహిళ అని అర్దం. వీడియోలో శుభాంకర్ ధనశ్రీని ఉద్దేశిస్తూ ఇలా కూడా అన్నాడు. విడాకుల తర్వాత ధనశ్రీ ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొనుంది. అందకే ఆమె చహల్‌ను భరణం పేరుతో డబ్బు డిమాండ్ చేసింది. భరణం పేరుతో భర్త నుంచి డబ్బు తీసుకుంటే అది సాధికారత ఎలా అవుతుంది. ఇలా చేసి స్వయంకృషితో ఎదిగిన మహిళ అని ఎలా చెప్పుకుంటారంటూ వ్యంగ్యంగా విమర్శించాడు.
కాగా, చహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ దగ్గర చహల్ డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. పెళ్లి తర్వాత చహల్, ధనశ్రీ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఈ ఏడాది మార్చి 20న చహల్, ధనశ్రీకి విడాకలు మంజూరయ్యాయి. గత ఏడాదిన్నరగా వీరిద్దరు కలిసి లేరని తెలుస్తుంది. అంటే వీరి వివాహ బంధం ముచ్చటగా మూడేళ్లు మాత్రమే సాగిందన్న మాట.
ఇదిలా ఉంటే, చహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చహల్‌ను ఇటీవలే (మెగా వేలంలో) పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. చహల్ గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. అంతకుముందు అతను ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించే వాడు. చహల్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నా టీమిండియాలో చోటు మాత్రం దక్కడం లేదు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత స్పిన్ విభాగం అత్యంత పటిష్టంగా ఉండటంతో చహల్‌కు అవకాశాలు రావడం లేదు. చహల్ పంజాబ్ జెర్సీలో ఇవాళ (మార్చి 25) తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. నేటి మ్యాచ్‌లో పంజాబ్ గుజరాత్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ధనశ్రీ విషయానికొస్తే.. ఆమె ఇటీవలే ఓ ప్రైవేట్ వీడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోపై సోషల్‌మీడియాలో ద్వంద అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment