
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. చాహల్-ధనశ్రీ అధికారికంగా విడిపోయారు. వీరిద్దిరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. దీంతో ఈ జంట ఐదేళ్ల వివాహ బందం నేటితో ముగిసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడు.
ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ధనశ్రీకి భరణం కింద చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి విడాకుల కేసుపై గత కొంతకాలంగా బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే ఐపీఎల్-2025లో పాల్లోనేందుకు చాహల్ వెళ్లనుండడంతో విచారణను వేగవంతం చేయాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు బుధవారం ఆదేశించింది.
అదేవిధంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్న కారణంగా, తప్పనిసరి ఆరు నెలల విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలొనే బాంద్రా ఫ్యామిలీ కోర్టు నేడు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది.
యూట్యూబర్, కొరియాగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్‌కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత రెండేళ్లగా విభేదాలు తలెతెత్తడంతో వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు.
అయితే గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు నుంచి ‘చాహల్’ పేరును తీసేయడంతో పాటు ఫొటోలను కూడా డిలేట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నరంటూ వార్తలు వ్యాపించాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి పూటకో ఓ వార్త వస్తూనే ఉండేది.
ఎట్టకేలకు ఈ వార్తలు నిజమేనని అధికారికంగా స్పష్టమైంది. ఇక ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్‌జే మహ్‌వశ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.
చదవండి: షాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్.. నమీబియా కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్
Comments
Please login to add a commentAdd a comment