
రితికా, రోహిత్ శర్మ, చాహల్ (ఫైల్‌ఫొటో)
డర్బన్ : టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మధ్య ఇన్‌స్టాగ్రాం వేదికగా జరిగిన సరదా చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు రోహిత్ శర్మ ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. దీనికి క్యాప్షన్‌గా ‘ట్రైనింగ్ సెషన్ అనంతరం సేద తీరుతున్నాం. పక్కనే చాహల్, శార్దూల్ ఠాకూర్‌లున్నారు’ అని పేర్కొన్నాడు.
దీనికి చాహల్ ‘వదినా.. అసూయగా ఉందా అని కామెంట్ చేశాడు. వెంటనే రితికా ‘హ హ హ.. నీవు నా మైండ్‌ను బాగా చదివావు’ అని బదులిచ్చింది. ఇక్కడితో ఆగని చాహల్ ‘వదినా.. ఒక నెల రోజుల పాటు అన్నకు నేనే తోడుగా ఉంటానని’ మరో కామెంట్ చేశాడు. ఈ సరదా కామెంట్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక టెస్ట్ సిరీస్ ముందు సతీమణులతో భారత క్రికెటర్లు దక్షిణాఫ్రికా వచ్చిన విషయం తెలిసిందే. వీరంతా టెస్ట్ సిరీస్ అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక ఆరు వన్డేల సిరీస్‌లో డర్బెన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment