
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు రోహిత్ శర్మ-యజ్వేంద్ర చహల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో రోహిత్ కుటుంబంతో కూడా చహల్ బాగా చనువుగా ఉంటాడు. తాజాగా చహల్‌కు రోహిత శర్మ భార్య రితిక దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భాగంగా బెంగళూరులో ఉన్న రోహిత్ శర్మను కలిసిన రితిక.. ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ‘రీయునైటెడ్’ అనే క్యాప్షన్ ఇచ్చారు రితిక. అయితే తాను ఎందుకు ఫొటోలో లేనంటూ రితికను ప్రశ్నించాడు చహల్. ‘ నన్ను ఎందుకు కట్ చేశారు’ అంటూ చహల్ సరదాగా ట్వీట్ చేశాడు.
దానికి రితిక కూడా ఏమీ తగ్గలేదు. చహల్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘ నువ్వు ప్రస్తుతం భారత్ జట్టులో లేవు కదా. అందుకే నిన్ను కట్ చేశా’ అంటూ రితిక సమాధానం ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిని నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, గతంలో కూడా వీరి మధ్య ఇటువంటి కామెంట్ల చమత్కరింపే నడిచింది. ఒకనొక సందర్భంలో ‘రోహిత్ నిన్ను బాగా మిస్ అవుతున్నా’ అని చహల్ ట్వీట్ చేయగా, ‘ ఇప్పుడు రోహిత్ నా మనిషి’ అంటూ సమాధానం ఇచ్చారు.