ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్‌లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ.
ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్‌లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
స్టాండ్ బై: జేకబ్ డఫీ
పాకిస్తాన్‌లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)
ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)
ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)
ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)
ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..
ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీ
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్
ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీ
ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్
ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్
ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండి
ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండి
ఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్
ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండి
ఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్
మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీ
మార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్
మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్
మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్
మార్చి 09- ఫైనల్
ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment