ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 2–6, 6–2, 6–4తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సిన్ (అమెరికా)ను ఓడించాడు.
1 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్‌లో ప్రపంచ 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై, రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)పై సంచలన విజయాలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment