Semifinal
-
Semi Final: కష్టాల్లో ముంబై.. పట్టు బిగించిన విదర్భ
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్‌పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్‌గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 383ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్‌రౌండర్‌గా రాణించిన మిలింద్ కెరీర్లో 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. -
ప్రియాంక్ ప్రతాపం
అహ్మదాబాద్: సీనియర్ ఓపెనర్ ప్రియాంక్ పాంచాల్ (200 బంతుల్లో 117 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో అదరగొట్టడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మాజీ చాంపియన్ గుజరాత్ జట్టు దీటుగా బదులిస్తోంది. బ్యాటింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట కేరళ బ్యాటర్లు భారీ స్కోరు చేయగా... ఇప్పుడు గుజరాత్ కూడా అదే బాటలో నడుస్తోంది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 222 పరుగులు చేసింది. ప్రియాంక్ సూపర్ సెంచరీకి ఆర్య దేశాయ్ (118 బంతుల్లో 73; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం తోడవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జంట కేరళ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడంతో పరుగుల రాక సులువైంది. ముఖ్యంగా ఆర్య దూకుడుగా ఆడాడు. తొలి వికెట్‌కు 131 పరుగులు జోడించిన అనంతరం అతడు అవుటయ్యాడు. ఆ తర్వాత మనన్ హింగ్రాజియా (108 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ప్రియాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ప్రియాంక్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 29వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాజా రంజీ సీజన్లో అతడికిది రెండో శతకం. మూడో రోజు 71 ఓవర్లు వేసిన కేరళ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టింది. బాసిల్‌కు ఆ వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 418/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ జట్టు చివరకు 187 ఓవర్లలో 457 పరుగులు చేసి ఆలౌటైంది. వికెట్ కీపర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (341 బంతుల్లో 177 నాటౌట్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. మూడో రోజు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు మరో 39 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. చివరి వరుస బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్జాన్ మూడు, చింతన్ గజా రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న గుజరాత్ జట్టు కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 235 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్సింగ్ 10; సచిన్ బేబీ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (నాటౌట్) 177; సల్మాన్ నిజర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బి) చింతన్ 11; నిదీశ్ (రనౌట్) 5; బాసిల్ (సి) ఆర్య (బి) చింతన్ 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (187 ఓవర్లలో ఆలౌట్) 457. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395, 8–428, 9–455, 10–457, బౌలింగ్: చింతన్ 33–9–75–2; అర్జాన్ 34–9–81–3; ప్రియజీత్ సింగ్ 21–2–58–1; జైమీత్ 13–1–46–0; రవి బిష్ణోయ్ 30–7–74–1; సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0; విశాల్ జైస్వాల్ 22–5–57–1; ఆర్య దేశాయ్ 1–0–3–0. గుజరాత్ తొలి ఇన్నింగ్స్: ప్రియాంక్ (బ్యాటింగ్) 117; ఆర్య దేశాయ్ (బి) బాసిల్ 73; మనన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (71 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 222. వికెట్ల పతనం: 1–131. బౌలింగ్: నిధీశ్ 10–1–40–0; జలజ్ 25–5–71–0; బాసిల్ 15–1–40–1; ఆదిత్య 17–2–55–0; అక్షయ్ చంద్రన్ 3–0–11–0; ఇమ్రాన్ 1–0–3–0. -
ఎదురులేని నిశేష్
ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 2–6, 6–2, 6–4తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సిన్ (అమెరికా)ను ఓడించాడు. 1 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై, రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)పై సంచలన విజయాలు సాధించాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ సంచలనం
షెన్జెన్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ అదరగొడుతోంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మూడో ర్యాంక్ ద్వయం కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసేన్ (డెన్మార్క్)తో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–19తో గెలిచింది.47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. ఒక్కసారి కూడా స్కోరును సమం కానివ్వలేదు. రెండో గేమ్‌లో మాత్రం గట్టిపోటీనే లభించింది. డెన్మార్క్ జంట తీవ్రంగా పోరాడటంతో పలుమార్లు స్కోరు సమమైంది. చివర్లో స్కోరు 19–19 వద్ద సమంగా ఉన్నపుడు భారత జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. గత ఏడాది ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ నేడు జరిగే సెమీఫైనల్లో జిన్ యోంగ్–జే సియో సెయింగ్ (దక్షిణ కొరియా) జోడీతో తలపడుతుంది. గతంలో కిమ్ అస్ట్రుప్–స్కారప్లతో తొమ్మిదిసార్లు తలపడి, ఆరుసార్లు ఓడిపోయిన భారత జంట ఈ ఏడాది డెన్మార్క్ ద్వయంపై రెండోసారి గెలిచింది. ఇండియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోనూ డెన్మార్క్ జోడీనే సాత్విక్–చిరాగ్ ద్వయం ఓడించింది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సన్ (డెన్మార్క్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 18–21, 15–21తో ఓడిపోయాడు. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో మూడుసార్లు ఆధిక్యంలోకి వెళ్లి దానిని వృథా చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆంటోన్సన్దే పైచేయిగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న లక్ష్య సేన్... విశ్వ క్రీడల తర్వాత ఆడిన నాలుగు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్‌ను దాటి ముందుకెళ్లలేకపోయాడు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్ జోడీ
ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. వచ్చే సీజన్లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది. -
రష్మిక జోడీకి నిరాశ
సిడ్నీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 0–6తో టాప్ సీడ్ డెస్టనీ–మ్యాడిసన్ ఇంగ్లిస్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేమ్‌లు మాత్రమే గెలిచింది. -
W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్
దుబాయ్: ఈ ప్రపంచకప్‌లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో ఇంగ్లండ్, రెండు విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ ఈ స్థానాల్ని తారుమారు చేసింది. ఇంగ్లండ్ మహిళల జట్టు అనూహ్యంగా ఒక్క ఆఖరి పోరుతో ఇంటిబాట పట్టింది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి ‘టాప్’లోకి వచ్చి నిలిచింది. మూడు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్‌రేట్ విండీస్ (1.536) జట్టును సెమీఫైనల్స్‌కు పంపింది. ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా (1.382) రెండో జట్టుగా ముందంజ వేసింది. ఇంగ్లండ్ (1.091) మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాపార్డర్‌లో బౌచిర్ (14), డ్యానీ వ్యాట్ (16), అలైస్ క్యాప్సీ (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నట్ సీవర్ బ్రంట్ (50 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. కెపె్టన్ హీథెర్ నైట్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో చకచకా 46 పరుగులు జోడించింది. అయితే 80 పరుగుల జట్టు స్కోరు వద్ద హీథెర్ రిటైర్డ్‌హర్ట్ కావడంతో ఇంగ్లండ్ ఆటతీరు మారింది. తర్వాత వచ్చిన వారిలో ఏ ఒక్కరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోవడంతో ఇంగ్లండ్ 150 మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. అఫీ ఫ్లెచర్ 3, హేలీ మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ ఇంకో 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), క్వియానా జోసెఫ్ (38 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభమిచ్చారు. మెరుపు వేగంతో ఆడిన ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు.తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలో 102 పరుగులు జోడించాక క్వియానా, తర్వాత ఓవర్లో కెపె్టన్ హేలీ నిష్క్రమించారు. అప్పటికి 41 బంతుల్లో 38 పరుగులు కావాల్సి ఉండగా, డాటిన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు ) ధాటిగా ఆడింది. గెలుపు వాకిట ఆమె బౌల్డ్ కాగా, మిగతా లాంఛనాన్ని ఆలియా అలెన్ (4 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) పూర్తి చేసింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడతాయి. -
64 ఏళ్ల తర్వాత...
అస్తానా (కజకిస్తాన్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్íÙప్లో పెను సంచలనం సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, గత ఏడాది రన్నరప్ దక్షిణ కొరియా జట్టును భారత బృందం బోల్తా కొట్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో మంగళవారం జరిగిన టీమ్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 3–2తో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘డబుల్స్ స్పెషలిస్ట్’ ఐహిక ముఖర్జీ రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను ఓడించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే సెమీఫైనల్లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్ బెర్త్ పొందిన భారత జట్టుకు కనీసం కాంస్య పతకం ఖరారైంది. భారత మహిళల జట్టు ఏకైకసారి 1960లో ముంబై ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 64 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. ఆసియా టీటీ సమాఖ్య ఆధ్వర్యంలో 1952 నుంచి 1970 వరకు ఆసియా చాంపియన్‌షిప్ జరగ్గా... 1972 నుంచి కొత్తగా ఏర్పడిన ఆసియా టీటీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇద్దరు మేటి ర్యాంకర్లపై గెలిచి... ప్రపంచ 8వ ర్యాంకర్ షిన్ యుబిన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ 92వ ర్యాంకర్ ఐహిక 11–9, 7–11, 12–10, 7–11, 11–7తో గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ మనిక బత్రా 12–14, 13–11, 11–5, 5–11, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీను ఓడించి భారత ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్, భారత నంబర్‌వన్ ఆకుల శ్రీజ 6–11, 10–12, 8–11తో ప్రపంచ 49వ ర్యాంకర్ లీ యున్‌హై చేతిలో... నాలుగో మ్యాచ్‌లో మనిక బత్రా 11–13, 4–11, 11–6, 11–7, 10–12తో షిన్ యుబిన్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఐహిక ముఖర్జీ 7–11, 11–6, 12–10, 12–10తో ప్రపంచ 16వ ర్యాంకర్ జియోన్ జిహీపై గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
సెమీస్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
మకావ్: వరుసగా ఐదు టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఆ అడ్డంకిని ఆరో ప్రయత్నంలో అధిగమించింది. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–12, 21–17తో ఆరో సీడ్ సు యిన్ హుయ్–లోన్ జి యున్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. గత జూన్‌లో సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్ చేరిన తర్వాత గాయత్రి–ట్రెసా ఐదు టోర్నీలు ఆడారు. అయితే ఈ ఐదు టోర్నీల్లో వారు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 12–21తో ఓడిపోయాడు. నేడు జరిగే మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. గతవారం చైనా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లోనే సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు చేతిలో ఓడిన గాయత్రి–ట్రెసా ఈసారి గెలిచి బదులు తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి. -
సెమీస్‌లో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇని్వటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ జట్టు రెండు విజయాలు సాధించి 13 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 439/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 129.3 ఓవర్లలో 6 వికెట్లకు 560 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వరుణ్ గౌడ్ (63 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టి.రవితేజ (54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 353 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు 47 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 5 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు రెండో రోజు హైదరాబాద్ ఓపెనర్ ఎం. అభిరత్ రెడ్డి (243 బంతుల్లో 211; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. -
సెమీస్‌లో అనిరుధ్ జోడీ
రఫా నాదల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్ర శేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. స్పెయిన్‌లోని మనాకోర్ పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) ద్వయం 6–4, 6–7 (4/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రుడాల్ఫ్ మొలెకర్ (జర్మనీ)–జెరోమ్ కిమ్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచింది. -
‘లక్ష్యం’ దిశగా మరో అడుగు
పారిస్: భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ఒలింపిక్స్ పతక ఆశలను సజీవంగా నిలిపాడు. అద్భుత ఆటతీరుతో చెలరేగుతున్న లక్ష్య సెమీఫైనల్లోకి అడుగు పెట్టి పతకంపై గురి పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–15, 21–12 స్కోరుతో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా... ఆ తర్వాత సత్తా చాటిన 23 ఏళ్ల లక్ష్య సెమీస్ చేరాడు. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున సెమీఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా సేన్ ఘనత సృష్టించాడు. గతంలో భారత్ నుంచి అత్యుత్తమంగా పారుపల్లి కశ్యప్ (2012), కిడాంబి శ్రీకాంత్ (2016) క్వార్టర్ ఫైనల్ వరకు మాత్రమే రాగలిగారు. లో కీన్ యె (సింగపూర్), అక్సెల్సన్ (డెన్మార్క్) మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు. సెమీస్‌లో లక్ష్య గెలిస్తే అతనికి స్వర్ణం లేదా రజతం ఖాయమవుతుంది. ఒకవేళ సెమీఫైనల్లో ఓడినా కాంస్య పత కం కోసం మళ్లీ పోటీ పడే అవకాశం ఉంటుంది. 2021 వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యపతక విజేత అయిన లక్ష్య క్వార్టర్స్‌లో తొలి గేమ్‌లో కూడా పోరాడాడు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన టిన్ చెన్ 11–9తో ముందంజ వేసి ఆపై 14–9తో నిలిచాడు. అయితే కోలుకున్న లక్ష్య వరుస పాయింట్లతో 16–15కు దూసుకెళ్లాడు. స్కోరు 19–19కి చేరగా, చివరకు గేమ్ తైపీ ఆటగాడిదే అయింది. రెండో గేమ్ కూడా పోటాపోటీగా సాగగా సేన్ 11–10తో ఆధిక్యంలో నిలిచాడు. స్కోరు 13–13కి చేరిన తర్వాత 10 పాయింట్లలో 8 గెలుచుకొని గేమ్ సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌కు వచ్చే సరికి లక్ష్య ఆటతో మరింత జోరు పెరిగింది. విరామ సమయానికి 11–7 వద్ద ఉన్న సేన్ ఆ తర్వాత దూసుకుపోయాడు. వరుస స్మాష్‌లతో దూకుడు కనబర్చడంతో టిన్ చెన్ వద్ద సమాధానం లేకపోయింది. -
20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో నెదర్లాండ్స్
బెర్లిన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీ జట్టుతో ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 35వ నిమిషంలో సామెత్ అకెదిన్ గోల్‌తో టర్కీ ఖాతా తెరిచింది. 70వ నిమిషంలో డెవ్రిజ్ గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. 76వ నిమిషంలో టర్కీ ప్లేయర్ మెర్ట్ ముల్డర్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నెదర్లాండ్స్ కాపాడుకొని 2004 తర్వాత మళ్లీ యూరో టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
సెమీఫైనల్లో ప్రియాన్షు పరాజయం
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్ అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన ప్రియాన్షు సెమీఫైనల్లో మాత్రం తడబడ్డాడు. ప్రియాన్షుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు), 6,420 పాయింట్లు లభించాయి. -
స్వీట్ రివెంజ్.. ఇంగ్లండ్ చిత్తు.. టీ20 ఫైనల్‌కు భారత్ (ఫొటోలు)
-
T20 World Cup: ‘ఫైనల్’ అడుగు ఎవరిదో! నేడు ఇంగ్లండ్‌తో భారత్ సెమీఫైనల్
టీమిండియా ఏడు నెలల్లో మరో ప్రపంచకప్ ఫైనల్‌పై గురి పెట్టింది. 2022 టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించి తుది పోరుకు అర్హత పొందిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పై బదులు తీర్చుకునేందుకు భారత జట్టు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది.‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లు ఈ ఒక్క నాకౌట్ విజయంతో ఇంగ్లండ్ ను కసిదీరా ఇంటికి పంపొచ్చు... మనమేమో 10 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో మరోసారి ఫైనల్ చేరవచ్చు. బ్యాటింగ్ ఫామ్, బౌలింగ్ నిలకడ భారత్‌ను ఓ మెట్టుపైనే నిలబెడుతోంది. జార్జ్‌టౌన్: భారత్ ఇక అసలైన పోరుకు సిద్ధమైంది. గడిచిన 26 రోజులుగా ఆడిన మ్యాచ్‌లు వేరు, నేటి సెమీఫైనల్ పోరాటం వేరు. లీగ్, సూపర్–8 దశలు కావడంతో ఇన్నాళ్లూ కచ్చితంగా గెలవకపోయినా... ముందుకెళ్లే అవకాశమైతే ఉండింది. కానీ ఇది నాకౌట్ పోరు. అన్నీ గెలిచామన్న ధీమా కుదరదు. అలాగే ఇదీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఇంకా చెప్పాలంటే కప్ గెలవాలన్నా... ఆఖరి మెట్టుపై నిలవాలన్నా... ఈ రెండో మెట్టే గట్టిగా వేయాలి. లేదంటే అమీతుమీకి ముందే మన జైత్రయాత్రకు చెక్ పడుతుంది. పైగా ఇది టి20 ఫార్మాట్. ఈ మెరుపుల ఫార్మాట్‌ను బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లే కాదు... వరుణ దేవుడు కూడా శాసిస్తోంది. ఇది ఒక్కోసారి పెద్ద జట్లకు శాపంగా... ఉన్నపళంగా జఠిలంగా కూడా మారుతోంది. ఏడు జట్లను ఓడించాం కానీ... ఒక వార్మప్ మినహాయిస్తే... నాలుగు లీగ్ దశ పోటీలు, మూడు సూపర్–8 మ్యాచ్‌ల్లో ఏడు వేర్వేరు జట్లనైతే ఓడించాం. కానీ గట్టిగా జయించింది ఇద్దరినే! లీగ్ దశలో పాకిస్తాన్, ‘సూపర్–8’లో ఆ్రస్టేలియా ఈ రెండు మేటి జట్లపై గెలుపే ప్రపంచకప్ స్థాయి గెలుపని చెప్పొచ్చు. ఐర్లాండ్, అమెరికా, కెనడా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఓడించడం టీమిండియా స్థాయికి ఏమాత్రం విషయం కానేకాదు. ఆ్రస్టేలియా లాంటి మేటి జట్టుపై కెపె్టన్ రోహిత్ శర్మ విధ్వంసం భారత బ్యాటింగ్‌ను మరోస్థాయిలో నిలబెడుతోంది. కానీ విరాట్ కోహ్లి వైఫల్యమే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. బహుశా ఈ సెమీస్‌లో ఆ కరువు తీర్చు కుంటే అభిమానులకు ‘ఫైనల్ పండగే’ మిగులుతుంది. సూర్యకుమార్, దూబే, హార్దిక్ పాండ్యాలు దంచేయడం, బౌలింగ్‌లో బుమ్రాతో పాటు అర్‡్షదీప్ నిప్పులు చెరుగుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్‌లు కూడా జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. తడబడుతూ ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో మెగా ఈవెంట్ ను మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఇక్కడిదాకా వచ్చేందుకు తడబడింది. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడింది కూడా! కానీ ఏ జట్టుపై, ఏ వేదికపై సాధికారికంగా ఆడిన దాఖలాలైతే లేవు. అయితే అసలైన ఈ నాకౌట్ సమరంలో కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్‌లు బ్యాట్ ఝుళిపిస్తే మాత్రం భారత్‌కు కష్టాలు తప్పవేమో! బౌలింగ్‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ అద్భుతంగా రాణిస్తుండటం ప్రత్యర్థి బౌలింగ్ దళానికి బలంగా మారింది. 23 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 23 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. 12 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు తలపడగా... చెరో రెండు విజయాలతో సమంగా ఉన్నాయి.వర్షార్పణమైతే..గయానాలో బుధవారం వాన కురిసింది. మ్యాచ్‌కు వరుణ గండమైతే ఉంది. తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ఉదయం జరగనుండటంతో నిర్ణీత సమయం కటాఫ్ లేకుండా పొడిగింపు మాత్రం ఉంటుంది. భారీ వర్షంతో సెమీఫైనల్స్ రద్దయితే లీగ్, సూపర్–8 దశల్లో టాపర్‌గా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుతాయి. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), కోహ్లి, సూర్యకుమార్, రిషభ్ పంత్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్‡్షదీప్, బుమ్రా. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ), సాల్ట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్ రషీద్, టాప్లీ. పిచ్, వాతావరణం గయానా పిచ్ బౌలర్లకు స్వర్గధామం. ఈ వేదికపై తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 127. అయితే లక్ష్యఛేదన మరీ దారుణం. సగటు స్కోరు 95 పరుగులే! కాబట్టి మెరుపుల్ని ఆశించడం అత్యాశే! మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. -
చరిత్రకు చేరువలో..
తరూబా (ట్రినిడాడ్): ఓ ఆసక్తికర సెమీస్ సమరం, ఓ కొత్త ఫైనలిస్టుకు వేదికైన ఈ ప్రపంచకప్‌లో అటు దక్షిణాఫ్రికా, ఇటు అఫ్గానిస్తాన్ ఎవరు ఫైనల్ చేరతారో గురువారం మధ్యాహ్నంలోపు తెలిసిపోతుంది. మెగా ఈవెంట్లోనే మేటి జట్లను తోసిరాజని బాగా ఆకట్టుకున్న ఏకైక జట్టు అఫ్గానిస్తాన్. తమ ఆట ఆషామాషీగా లేదని, సంచలన విజయాలు గాలివాటం కానేకాదని రషీద్ ఖాన్ బృందం నిరూపిస్తోంది. ఆతిథ్య విండీస్, పటిష్ట న్యూజిలాండ్ ఉన్న గ్రూప్ ‘సి’లో లీగ్ దశనే అఫ్గానిస్తాన్ దాటడం గొప్పనుకుంటే... ‘సూపర్–8’లో ఏకంగా 2021 చాంపియన్ ఆ్రస్టేలియానే కంగుతినిపించడం, బంగ్లాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్న ఆఖరి మ్యాచ్‌లో పోరాడి గెలవడం క్రికెట్ చరిత్రలోనే నిలిచేలా చేసింది. అఫ్గాన్ సెమీస్ చేరడంతోనే రికార్డుల్లోకెక్కింది. ఇప్పుడు ఫైనల్ చేరి చరిత్ర పుటల్లోకెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు సమష్టిగా రాణిస్తుండటం అఫ్గాన్ పెను సంచలనాలకు కారణం కాగా... మరోవైపు గట్టి జట్టయిన దక్షిణాఫ్రికా మాత్రం ప్రతి మ్యాచ్‌ను కష్టపడుతూనే గెలుపొందడం విడ్డూరం. నెదర్లాండ్స్‌పై 103 పరుగుల లక్ష్యాన్ని 19వ ఓవర్లో ఛేదించడం, బంగ్లాదేశ్‌పై 4 పరుగులు, నేపాల్‌తో ఒక పరుగు తేడాతో గట్టెక్కడం సఫారీ స్థాయిని తక్కువ చేస్తోంది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడిన అమెరికాపై 194/4లాంటి భారీస్కోరు చేసినా కేవలం 18 పరుగులతోనే గెలుపొందడం... ఇలా ప్రతీ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా పెద్ద పెద్ద పోరాటాలే చేసింది. ఇలాంటి జట్టుపై జోరుమీదున్న అఫ్గాన్ గెలిస్తే సంచలనమైతే అవుతుందేమో కానీ ఇందులో పెద్ద విశేషమైతే ఉండదు. మొత్తం మీద తొలి ఫైనల్ అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కేశవ్, రబాడ, నోర్జే, షమ్సీ.అఫ్గానిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), గుర్బాజ్, ఇబ్రహీమ్, అజ్మతుల్లా, గుల్బదిన్, నబీ, కరీమ్, నంగేయలియా, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫరూఖీ. 2 దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టి20 మ్యాచ్‌లు జరగ్గా... రెండింటిలోనూ దక్షిణాఫ్రికానే గెలిచింది. 2010 ప్రపంచకప్‌లో 59 పరుగులతో, 2016 ప్రపంచకప్‌లో 37 పరుగులతో దక్షిణాఫ్రికా నెగ్గింది. -
భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆసాధరణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం(జూన్ 27) గయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్‌కప్‌లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్లు జాబితాను ప్రకటించింది. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రోవ్ వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. మరోవైపు అఫ్గానిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నితిన్ మీనన్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం తొలి సెమీఫైనల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా కెటిల్‌బరో పనిచేయనున్నాడు. అహ్సన్ రజా నాల్గవ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. -
తొలిసారి T20వరల్డ్‌కప్ సెమీస్‌లో.. అఫ్గన్‌లో అంబరాన్నంటిన సంబరాలు (ఫొటోలు)
-
SA Vs ENG: దక్షిణాఫ్రికా సూపర్...
గ్రాస్ ఐలెట్: టి20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో శుక్రవారం చివరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే అమెరికాను ఓడించింది. ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (38 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. డికాక్ దూకుడుతో పవర్‌ప్లేలోనే 63 పరుగులు చేసిన సఫారీ టీమ్ ఆ తర్వాత తడబడింది. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తర్వాతి 84 బంతుల్లో 100 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. హ్యారీ బ్రూక్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 42 బంతుల్లోనే 78 పరుగులు జోడించారు. 4 ఓవర్లలో ఇంగ్లండ్ 46 పరుగులు చేయాల్సి ఉండగా... బార్త్‌మన్ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. దాంతో సమీకరణం 18 బంతుల్లో 25గా మారింది. బ్రూక్, లివింగ్‌స్టోన్ క్రీజ్‌లో ఉండటంతో పాటు చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ గెలిచే స్థితిలో నిలిచింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, జాన్సెన్, నోర్జే ఒక్కసారిగా ఆటను మార్చేశారు. తర్వాతి 3 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చారు. దాంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. -
సెమీస్‌లో సుమిత్
పెరూగియా ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 77వ ర్యాంకర్ సుమిత్ 6–4, 7–5తో మాక్స్ కస్నికౌస్కీ (పోలాండ్)పై గెలుపొందాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. -
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టుట్గార్ట్లోబుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో థియో అరిబెజ్–సాదియో (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
లక్ష్య సేన్ @13
న్యూఢిల్లీ: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరిన భారత స్టార్ లక్ష్య సేన్ ర్యాంక్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ ఐదు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రణయ్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఏప్రిల్ 30వ తేదీలోపు టాప్–16లో ఉంటే ప్రణయ్, లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 11వ ర్యాంక్‌లో మార్పు లేదు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ మూడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌తో భారత నంబర్‌వన్ జోడీగా అవతరించింది. పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం నాలుగు స్థానాలు పడిపోయి 26వ ర్యాంక్‌కు చేరుకుంది. -
రఫ్ఫాడించిన రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది. -
సెమీస్‌లో ఓడిన అష్మిత
థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తూ 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 7–6 (7/3), 4–6, 6–2, 6–3తో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 20 ఏస్‌లతో హడలెత్తించాడు. 52 విన్నర్స్ కొట్టిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 13సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 36 ఏళ్ల జొకోవిచ్ ఈ టోర్నీలో గతంలో సెమీఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా తిరిగి రావడం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–4, 7–6 (7/5), 6–3తో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీఫైనల్లో జొకోవిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ టోర్నీలో సినెర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో సినెర్ ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సూపర్ సబలెంకా... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో తొమ్మిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్)పై, కోకో గాఫ్ 7–6 (8/6), 6–7 (3/7), 6–2తో మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్)పై విజయం సాధించారు. క్రిచికోవాతో 71 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. -
Vijay Hazare Trophy 2023: సెమీఫైనల్లో హరియాణా
రాజ్‌కోట్: లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (4/37) మాయాజాలం... అంకిత్ కుమార్ (102; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం... వెరసి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోరీ్నలో 12 ఏళ్ల తర్వాత హరియాణా జట్టు మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగాల్ జట్టుతో సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బెంగాల్ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. షహబాజ్ అహ్మద్ (100; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో రాణించాడు. అనంతరం హరియాణా 45.1 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు సాధించి విజయం సాధించింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్తాన్ 200 పరుగుల తేడాతో కేరళపై, కర్ణాటక ఏడు వికెట్ల తేడాతో విదర్భపై, తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొంది సెమీఫైనల్ చేరుకున్నాయి. -
సెమీస్‌లో మాళవిక
గువాహటి: గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాళవిక 21–12, 21–16తో కరుపతెవన్ లెట్షానా (మలేసియా)పై గెలుపొందింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 22–20, 21–16తో జెసితా పుత్రి మియాన్‌తొరో–ఫెబి సెతియనిన్‌గ్రమ్ (ఇండోనేసియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) ద్వయం 9–21, 14–21తో చూంగ్ హోన్ జియాన్–హైకాల్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టే లియా) జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 4–6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 3,22,000 డాలర్ల (రూ. 2 కోట్ల 68 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 21 టోర్నీలు ఆడింది. . ఏడు టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండు టోర్నీల్లో టైటిల్ సాధించి, ఐదు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
టురిన్ (ఇటలీ): ఈ ఏడాది తమ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ... పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెడ్ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 7–6 (7/5)తో ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చాంపియన్స్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంటపై గెలిచింది. ఈ గెలుపుతో రెడ్ గ్రూప్ నుంచి బోపన్న–ఎబ్డెన్; రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీలు సెమీఫైనల్‌కు అర్హత పొందాయి. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 40 మ్యాచ్‌ల్లో గెలిచింది. సీజన్ ముగింపు టోరీ్నలో బోపన్న ఆడటం ఇది నాలుగోసారి (2023, 2015, 2012, 2011) కాగా, ఎబ్డెన్ తొలిసారి బరిలోకి దిగాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), రెండో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), మెద్వెదెవ్ (రష్యా), యానిక్ సినెర్ (ఇటలీ) సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. -
‘షమీ’ఫైనల్ వండర్
భారత్ అప్రతిహత జైత్రయాత్రలో మరో అడుగు విజయవంతంగా పడింది... 1983, 2003, 2011... ఈ క్యాలెండర్లలో ఇప్పుడు 2023 చేరింది... అభిమానుల కలలను నిజం చేసే అంచనాలను నిలబెట్టే ప్రయత్నంలో టీమిండియా మరోసారి తుది పోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో ఒక్క ఓటమీ లేకుండా ముగించిన టీమిండియా నాకౌట్ పోరులోనూ తమ స్థాయిని నిలబెట్టుకుంది... ఆసక్తకిరంగా, అక్కడక్కడా పోటాపోటీగా సాగిన సమరంలో న్యూజిలాండ్‌పై విజయం సాధించి సగర్వంగా నిలిచింది. గత వరల్డ్ కప్‌లో ఇదే కివీస్ చేతిలో ఇదే సెమీస్ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి నాలుగేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకొని పాత గాయానికి మందు వేసింది. కోహ్లి, అయ్యర్, షమీ ఈ గెలుపులో హీరోలుగా నిలిచారు. 397 పరుగులు... ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు ఒకదశలో ఆందోళనకు లోనైంది... ఆటగాళ్లలో నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి కనిపించి తప్పులు చేయడం మొదలైంది... అభిమానుల్లో కాస్త ఉత్కంఠ, మరి కాస్త ఆందోళన... పోరాటానికి మారుపేరైన కివీస్ తగ్గలేదు... 32 ఓవర్ల తర్వాత చూస్తే కివీస్ స్కోరు 219/2... అంతకుముందు ఈ స్థితిలో భారత్ 226/1... పెద్ద తేడా ఏమీ లేదు. తర్వాతి ఓవర్లలో చెలరేగేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. అప్పుడొచ్చాడు షమీ... ఒకే ఓవర్లో రెండు వికెట్లతో కివీస్ వెన్ను వెరిచి మళ్లీ కోలుకోలేకుండా చేశాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి భారత్ తరఫున అత్యుత్తమ వన్డే గణాంకాలతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై: వన్డే వరల్డ్ కప్ చరిత్రలో నాలుగోసారి భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత రెండు టోర్నీల్లో సెమీఫైనల్‌కు పరిమితమైన టీమిండియా ఈసారి మరో అడుగు ముందుకేసి ట్రోఫీపై గురి పెట్టింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా... శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, అయ్యర్ 21.2 ఓవర్లలోనే 163 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కేన్ విలియమ్సన్ (73 బంతుల్లో 69; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (7/57) కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో కివీస్‌ను దెబ్బ కొట్టాడు. నేడు ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలో జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఒకరితో మరొకరు పోటీ పడి... ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టాడు. కివీస్ ప్రధాన పేసర్లపై తన జోరును ప్రదర్శించిన అతను చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. తనను ఇబ్బంది పెట్టగలడని భావించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్‌లోనే రోహిత్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. గిల్ కూడా అండగా నిలవడంతో తొలి 8 ఓవర్లలోనే భారత్ 70 పరుగులు చేసింది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ను తర్వాతి ఓవర్లోనే సౌతీ అవుట్ చేయడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం గిల్ తన ధాటిని పెంచాడు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన అతను 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కండరాలు పట్టేయడంతో గిల్ పెవిలియన్‌కు వెళ్లిపోగా, అతని స్థానంలో వచ్చిన అయ్యర్ మెరుపు బ్యాటింగ్‌తో కివీస్ పని పట్టాడు. 29వ ఓవర్ తొలి బంతికి భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. తన సొంత మైదానంలో సిక్సర్లతో చెలరేగిన అయ్యర్‌ను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కాలేదు. బౌల్ట్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 40వ ఓవర్ ముగిసేసరికి స్కోరు 287/1. చివరి 10 ఓవర్లలో టీమిండియా మరింతగా చెలరేగిపోయింది. రచిన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో అయ్యర్ సత్తా చాటాడు. సౌతీ ఓవర్లో భారీ సిక్స్ బాదిన అయ్యర్ తర్వాతి బంతికి సింగిల్ తీసి 67 బంతుల్లోనే వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. వీరందరికి తోడు కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన మెరుపులను జోడించడంతో చివరి 2 ఓవర్లలో 31 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 110 పరుగులు సాధించింది. భయపెట్టిన భాగస్వామ్యాలు... దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ తడబడింది. 39 పరుగులకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే విలియమ్సన్, మిచెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత వీరిద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. భారత బౌలింగ్ కొద్ది సేపు కట్టుతప్పి వైడ్లు, బైస్, ఓవర్‌త్రోలు, ఫీల్డింగ్ వైఫల్యాలు, రనౌట్ అవకాశాలు చేజారడం... ఇవన్నీ కూడా కివీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యంగా మిచెల్ ప్రతీ బౌలర్‌పై చెలరేగి పరుగులు సాధించగా, విలియమ్సన్ సరైన రీతిలో సహకరించాడు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంత సేపు (24.5 ఓవర్లు) భారత బృందంలో కాస్త ఒత్తిడి కనిపించింది. ఇదే జోరులో మిచెల్ 85 బంతుల్లో టోర్నీలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు వికెట్ దక్కింది. విలియమ్సన్‌ను అవుట్ చేసిన షమీ, అదే ఓవర్లో లాథమ్ (0)ను వెనక్కి పంపడంతో కివీస్ వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా 61 బంతుల్లోనే 75 పరుగులు జత చేయడం కూడా మ్యాచ్‌లో కివీస్ ఆశలు నిలిపింది. కానీ 44 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫిలిప్స్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ పరాజయం ఖాయమైంది. 4 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో భారత్ 1983 (విజేత), 2003 (రన్నరప్), 2011 (విజేత) తుది పోరుకు అర్హత సాధించింది. 1 ఒకే ప్రపంచకప్‌లో మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు మూడుసార్లు తీసిన తొలి బౌలర్‌గా షమీ గుర్తింపు పొందాడు. గతంలో గ్యారీ గిల్మోర్ (ఇంగ్లండ్; 1975లో), అషంత డి మెల్ (శ్రీలంక; 1983లో), వాస్బెర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్; 2003లో), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్; 2011లో), ముస్తఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్; 2019లో), మిచెల్ స్టార్క్ (ఆ్రస్టేలియా; 2019లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. 51 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అవతరించాడు. రోహిత్ ఇప్పటి వరకు 51 సిక్స్‌లు కొట్టాడు. 49 సిక్స్‌లతో క్రిస్ గేల్ (వెస్టిండీస్) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ గుర్తింపు పొందాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ 28 సిక్స్‌లు కొట్టాడు. క్రిస్ గేల్ (2015లో 26 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. 397 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2015 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ 6 వికెట్లకు 393 పరుగులు చేసింది. ‘వచ్చే కొద్ది రోజుల్లోనే నా రికార్డును బద్దలు కొడతావని ఆశిస్తున్నా’... కోహ్లి 49వ సెంచరీ తర్వాత సచిన్ టెండూల్కర్ చెప్పిన మాట ఇది. దిగ్గజ క్రికెటర్ ఆశీర్వాదం వాస్తవంగా మారేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. సరిగ్గా పది రోజులకే 49 నుంచి 50కి చేరుకొని విరాట్ కొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ ఎదురుగా... సచిన్ సొంత మైదానంలో... సచిన్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ బరిలోకి దిగిన తేదీన... సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో ఆఖరి సారిగా బ్యాటింగ్ చేసిన తేదీన... ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సచిన్ రికార్డును అధిగమించి వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలతో శిఖరాన నిలిచాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి ఫామ్ చూస్తే మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకోవడం లాంఛనమే అనిపించింది. బుధవారం తన స్థాయికి తగ్గ ఆటతో తనదైన శైలిలో కోహ్లి దానిని చేసి చూపించాడు. 9, 1, 1... గత మూడు వరుస ప్రపంచకప్ (2011, 2015, 2019) సెమీఫైనల్స్‌లో కోహ్లి స్కోర్లు ఇవి. ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన తర్వాత ‘సున్నా’ వద్ద ఎల్బీడబ్ల్యూ కోసం కివీస్ అప్పీల్, ఆపై రివ్యూ కోరడం కొద్దిసేపు అభిమానుల గుండె ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతని ఇన్నింగ్స్ జాగ్రత్తగా సాగింది. తొలి 40 బంతుల్లో అతను రెండే ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత మరో రెండు ఫోర్లతో 59 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ బౌలింగ్‌లో చూడచక్కటి సిక్సర్ కొట్టాక ఫిలిప్స్ ఓవర్లో తీసిన సింగిల్‌తో వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఘనతను అధిగమించాడు. 91 వద్ద సింగిల్ తీశాక కండరాలు పట్టేయడంతో ఫిజియోతో స్వల్ప చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్ ఇన్నింగ్స్ 42వ ఓవర్ నాలుగో బంతికి కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 50వ వన్డే సెంచరీ విరాట్ ఖాతాలో చేరింది. దాంతో వాంఖెడే మొత్తం హోరెత్తిపోయింది. 49వ శతకం సమయంలో ఎలాంటి భావోద్వేగాలు చూపించకుండా ప్రశాంతత కనబర్చిన కోహ్లి ఇక్కడ మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. గాల్లోకి ఎగిరి జంప్ చేయడంతో పాటు తన భార్య అనుష్క వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు పంపిన కింగ్... సచిన్‌ను చూస్తూ తలవంచి అభివాదంతో తన గౌరవాన్ని ప్రదర్శించాడు. మరో ఏడు బంతుల తర్వాత ఈ అద్భుత ఇన్నింగ్స్ ముగియగా, మైదానంలో ప్రేక్షకుల అభినందనల మధ్య అతను పెవిలియన్ చేరాడు. మొదటి 49 సెంచరీలు ఒక ఎత్తు... ఈ శతకం మరో ఎత్తు అన్నట్లుగా విరాట్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచిపోయింది. 711 ఈ ప్రపంచకప్‌లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 20 ఏళ్లుగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు సాధించాడు. 24 భారత్‌లో కోహ్లి చేసిన సెంచరీలు. ఒకే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ కోహ్లినే. ఈ జాబితాలో సచిన్ 20 సెంచరీలు (భారత్‌లో), పాంటింగ్ (ఆ్రస్టేలియా), ఆమ్లా (దక్షిణాఫ్రికా) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 1 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ (7/57) గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో మెక్‌గ్రాత్ (ఆ్రస్టేలియా; 7/15 నమీబియాపై 2003లో), బికెల్ (ఆస్ట్రేలియా; 7/20 ఇంగ్లండ్‌పై 2003లో), టిమ్ సౌతీ (న్యూజిలాండ్; 7/33 ఇంగ్లండ్‌పై 2015లో), విన్స్టన్ డేవిస్ (వెస్టిండీస్; 7/51 ఆ్రస్టేలియాపై 1983లో) ఉన్నారు. 1 వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు. స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు; 2014లో బంగ్లాదేశ్‌పై ) పేరిట ఉన్న రికార్డును షమీ అధిగమించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ (23 వికెట్లు) అవతరించాడు. జహీర్ ఖాన్ (21 వికెట్లు 2003లో) పేరిట ఉన్న రికార్డును షమీ సవరించాడు. నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో చెప్పలేకపోతున్నా. అంతా ఒక కలలా ఉంది. ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. సెమీఫైనల్లో ఇలా చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. నా హీరో సచిన్, నా జీవిత భాగస్వామి అంతా అక్కడ కూర్చున్నారు. ఇక అభిమానులంతా తోడుగా నిలిచారు. ఇంకా వివరంగా చెప్పలేకపోతున్నా కానీ నేను ఒక చిత్రాన్ని గీసే అవకాశం ఉంటే అది ఇదే చిత్రం కావాలని కోరుకుంటా. –విరాట్ కోహ్లి విలియమ్సన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసినప్పుడు చాలా బాధపడ్డా. అయితే బౌలింగ్‌తోనే వారిని పడగొట్టాలని భావించా. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భిన్నంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఈ ప్రదర్శనతో చాలా గొప్పగా అనిపిస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ ఓడాం. ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ అవకాశం చేజార్చుకోరాదని కోరుకుంటున్నాం. -షమీ ఈ మైదానంలో ఎంత స్కోరు చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడం ముఖ్యం. ఫీల్డింగ్‌లో కాస్త ఇబ్బంది పడ్డాం. సెమీస్ అంటే సహజంగానే అదనపు ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. మరో 30–40 పరుగులు తక్కువగా చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను. ఎందుకంటే వారూ జాగ్రత్తగానే ఆడేవారేమో. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టాప్–6 బ్యాటర్లంతా తమ పాత్రకు న్యాయం చేస్తున్నారు. చివరకు అన్నీ మాకు అనుకూలించాయి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 47; గిల్ (నాటౌట్) 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌతీ 117; అయ్యర్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 105; రాహుల్ (నాటౌట్) 39; సూర్యకుమార్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397. వికెట్ల పతనం: 1–71, 2–164, 3–381, 4–382. బౌలింగ్: బౌల్ట్ 10–0–86–1, సౌతీ 10–0–100–3, సాన్‌ట్నర్ 10–1–51–0, ఫెర్గూసన్ 8–0–65–0, రచిన్ 7–0–60–0, ఫిలిప్స్ 5–0–33–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రాహుల్ (బి) షమీ 13; రచిన్ (సి) రాహుల్ (బి) షమీ 13; విలియమ్సన్ (సి) సూర్యకుమార్ (బి) షమీ 69; మిచెల్ (సి) జడేజా (బి) షమీ 134; లాథమ్ (ఎల్బీ) (బి) షమీ 0; ఫిలిప్స్ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్మన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 2; సాన్‌ట్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 9; సౌతీ (సి) రాహుల్ (బి) షమీ 9; బౌల్ట్ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) రాహుల్ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 327. వికెట్ల పతనం: 1–30, 2–39, 3–220, 4–220, 5–295, 6–298, 7–306, 8–319, 9–321, 10–327. బౌలింగ్: బుమ్రా 10–1–64–1, సిరాజ్ 9–0–78–1, షమీ 9.5–0–57–7, జడేజా 10–0–63–0, కుల్దీప్ 10–0–56–1. -
ప్రపంచకప్‌లో నేడు రెండో సెమీఫైనల్.. ఆసీస్‌తో సౌతాఫ్రికా 'ఢీ'
కోల్‌కతా: ఫైనల్‌ను తలపించే సెమీఫైనల్ పోరుకు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సిద్ధమయ్యాయి. రెండు సమఉజ్జీ జట్ల మధ్య జరిగే ఈ రెండో సెమీఫైనల్ కడదాకా ఆసక్తికరంగా జరగడం ఖాయం. తరాలు మారినా హేమాహేమీలతో సరితూగిన సఫారీ జట్టు ప్రపంచకప్‌లో మాత్రం చోకర్స్గానే మిగిలింది. గతంలో దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్లో నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీఫైనల్లోకి ప్రవేశించి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఐదో ప్రయత్నంలోనైనా తొలిసారి ఫైనల్ చేరాలనే లక్ష్యంతో బవుమా సేన బరిలోకి దిగుతోంది. జట్టు కూడా జోరుమీదుంది. ఓపెనింగ్, మిడిలార్డర్ అందరూ భారీ స్కోర్లలో భాగమవుతున్నారు. పైగా ఈ టోర్నీలో గట్టి ప్రత్యర్థులపై ఐదుసార్లు 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా చేసిన జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే! ఒక్క భారత్ తప్ప సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలపై తమ భారీస్కోర్ల తడాఖా చూపింది. డికాక్, డసెన్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్ అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో రబడ కంటే కొయెట్జీ ప్రమాదకరంగా మారాడు. ఎన్గిడి, కేశవ్ మహరాజ్‌లతో దక్షిణాఫ్రికా పటిష్టంగా ఉంది. మరోవైపు ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను ఆరంభించిన తీరు, తర్వాత మారిన విధానం, దూసుకొచ్చి న వైనం ఈ ఈవెంట్లో ఏ జట్టుకు సాధ్యం కాదేమో! ప్రొఫెషనలిజానికి మారుపేరైన ఆసీస్ టోర్నీ సాగేకొద్దీ దుర్బేధ్యంగా మారింది. వార్నర్, మార్‡్ష, లబుషేన్, స్మిత్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అఫ్గానిస్తాన్‌తో వీరోచిత డబుల్ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్ గాయంతో తదుపరి బంగ్లాదేశ్‌లో ఆడలేకపోయాడు. అయితే కీలకమైన ఈ సెమీస్‌లో అతను బరిలోకి దిగుతాడని, ఫిట్నెస్తో ఉన్నాడని కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. గురువారం మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే శుక్రవారం కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఫలితం రాకపోతే టోర్నీ లీగ్దశలో మెరుగైన స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ కు మొదలైన కౌంట్ డౌన్
-
CWC 2023: నేడు భారత్‌తో న్యూజిలాండ్ సెమీస్ సమయం
9 మంది ప్రత్యర్థులు... 9 విజయాలు... అదిరిపోయే బ్యాటింగ్ బలగం... పేసర్ల అద్భుత ప్రదర్శన... స్పిన్నర్ల జోరు... ఫీల్డింగ్ మెరుపులు... వెరసి ఇప్పటివరకు టీమిండియా అజేయ యాత్ర సాగిపోయింది. ఏమాత్రం పోటీ, ఎదురన్నదే లేకుండా దూసుకుపోయి ప్రపంచకప్ లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ జట్టు అసలైన సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో చూపించిన జోరును మరో రెండు మ్యాచ్‌లలో కొనసాగిస్తే చాలు... భారత్ మూడోసారి వరల్డ్ కప్ సగర్వంగా గెలిచి కోట్లాది అభిమానుల కోరిక నెరవేరడం ఖాయం. అయితే ఇప్పుడు గత 9 మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేదు. మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. తీవ్ర ఒత్తిడి, ఒక్క క్షణం కూడా అలసత్వం ప్రదర్శించినా కోలుకునే అవకాశం ఉండని నాకౌట్ మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో సత్తా చాటాల్సిందే. ఎదురుగా ఉన్నది అణువణువూ పోరాటతత్వం నింపుకున్న న్యూజిలాండ్ జట్టు. ప్రత్యర్థి ఎవరైనా ఆఖరి బంతి వరకు పట్టు వీడని కివీస్‌తో పోరు అంత సులువు కాదు. నాలుగేళ్ల క్రితం సెమీఫైనల్లోనే కివీస్ కొట్టిన దెబ్బను సగటు భారత క్రికెట్ అభిమాని మరచిపోలేదు... ప్రత్యరి్థతో పోలిస్తే మన జట్టుదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తున్నా కీలక సమయంలో పట్టుదలగా నిలవడమే ప్రధానం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వరుసగా గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కే పరిమితమైన భారత్ ఈసారి ఈ అడ్డంకి దాటి ఫైనల్ చేరుతుందా లేక గత రెండు టోరీ్నల్లో ఫైనల్లోనే ఓడిన న్యూజిలాండ్ మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన 9 మ్యాచ్‌లలో కాస్త ఇబ్బంది పడిన, తడబాటుకు గురైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్‌తోనే. 274 పరుగుల లక్ష్యఛేదనలో చివరికి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి టీమిండియా గట్టెక్కింది. ఇప్పుడు అదే న్యూజిలాండ్‌తోనే రోహిత్ బృందం సెమీఫైనల్లో అమీతుమీకి సై అంటోంది. వాంఖెడే మైదానంలో నేడు జరిగే తొలి సెమీస్ పోరులో కివీస్‌తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ ఆరంభంలో అద్భుతంగా ఆడి ఆ తర్వాత వెనుకబడినా చివర్లో రాణించి టాప్–4లో చోటు దక్కించుకున్న న్యూజిలాండ్ మరోసారి సెమీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా నాకౌట్ మ్యాచ్ కావడంతో అంచనాలకు భిన్నంగానూ సాగే అవకాశం ఉంది. మార్పుల్లేకుండా... వరల్డ్‌కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల తర్వాత ధర్మశాలలో న్యూజిలాండ్ జరిగిన ఐదో మ్యాచ్ కోసం టీమిండియా స్వల్ప మార్పులు చేసింది. ఆ తర్వాతి నుంచి ఎలాంటి మార్పు లేకుండా అదే తుది జట్టును కొనసాగిస్తోంది. జట్టు ఫామ్‌ను బట్టి చూస్తే ఇప్పుడూ అదే కొనసాగించడం ఖాయం. టీమ్ మొత్తం తమదైన రీతిలో సత్తా చాటి జట్టును నడిపిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విషయంలోనూ లోపాలు లేకుండా జట్టు గొప్పగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి టోర్నీలో టాప్ స్కోరర్‌గా (594 పరుగులు) కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 503, శ్రేయస్ 421 పరుగులతో జట్టు బ్యాటింగ్‌ను నడిపిస్తున్నారు. గిల్, రాహుల్‌లకు కూడా విజయాల్లో ప్రధాన భాగస్వామ్యం ఉంది. మిడిలార్డర్లో సూర్యకుమార్, జడేజాల బ్యాటింగ్ భారత్‌కు అదనపు బలంగా మారింది. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు దాదాపు అసాధ్యంగా మారగా... కుల్దీప్, జడేజా స్పిన్‌ను కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో భారత్‌ను నిలువరించాలంటే ఏ జట్టయినా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంటుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో... న్యూజిలాండ్ కూడా అంచనాలకు మించి రాణించి భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. ఆటగాళ్లంతా పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర వరుసగా జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. రచిన్ 565 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, మిడిలార్డర్ బ్యాటర్ డరైల్ మిచెల్ కూడా 418 పరుగులు సాధించాడు. 359 పరుగులు చేసిన కాన్వే దూకుడుగా ఆడటంలో మేటి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను సమర్థంగా నడిపించగలడు. టామ్ లాథమ్ కూడా చక్కటి బ్యాటర్ కాగా... మెరుపు బ్యాటింగ్ చేయగల ఫిలిప్స్, చాప్మన్ ఆ జట్టు మిడిలార్డర్లో ఉండటం అదనపు బలం. స్పిన్నర్ సాన్‌ట్నర్‌పై భారత్‌పై మంచి రికార్డు ఉండగా... కివీస్ కూడా తమ పేస్ బలాన్ని నమ్ముకుంటోంది. ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో ట్రెంట్ బౌల్ట్ చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. ఫెర్గూసన్ కూడా ఫామ్‌లో ఉండగా సౌతీ అనుభవం జట్టుకు ఉపయోగపడగలదు. 4 నేడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో విరాట్ కోహ్లి అత్యధికంగా నాలుగుసార్లు (2011, 2015, 2019, 2023) వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్ (1996, 2003, 2011), ధోని (2011, 2015, 2019) మూడుసార్లు చొప్పున వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ ఆడారు. 8 వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టుకిది ఎనిమిదో సెమీఫైనల్ కానుంది. మూడుసార్లు (1983లో ఇంగ్లండ్‌పై; 2003లో కెన్యాపై; 2011లో పాకిస్తాన్‌పై) సెమీఫైనల్స్‌లో నెగ్గిన భారత్.... నాలుగుసార్లు (1987లో ఇంగ్లండ్ చేతిలో; 1996లో శ్రీలంక చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2019లో న్యూజిలాండ్ చేతిలో) సెమీఫైనల్లో ఓటమి పాలైంది. 11 మూడు వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. 2011 పాక్‌తో సెమీస్‌లో 9 పరుగులు... 2015 ఆ్రస్టేలియాతో సెమీస్‌లో 1 పరుగు... 2019 న్యూజిలాండ్‌తో సెమీస్‌లో 1 పరుగు చేశాడు. ఈ మూడు సెమీఫైనల్స్‌లో ఎడంచేతి వాటం పేస్ బౌలర్ల (వహాబ్ రియాజ్, మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్) చేతిలోనే కోహ్లి అవుట్ కావడం గమనార్హం. 9 వన్డే ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టుకిది తొమ్మిదో సెమీఫైనల్ కానుంది. రెండుసార్లు (2015లో దక్షిణాఫ్రికాపై, 2019లో భారత్‌పై) నెగ్గిన న్యూజిలాండ్... ఆరుసార్లు (1975లో వెస్టిండీస్ చేతిలో; 1979లో ఇంగ్లండ్ చేతిలో; 1992లో పాకిస్తాన్ చేతిలో; 1999లో పాకిస్తాన్ చేతిలో; 2007లో శ్రీలంక చేతిలో; 2011లో శ్రీలంక చేతిలో) పరాజయం పాలైంది. 117 భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు 117 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్... 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచ్ ‘టై’ అయింది. 7 మ్యాచ్‌లు రద్దయ్యాయి. 5 వాంఖెడే స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడింది. 3 మ్యాచ్‌ల్లో (1987లో జింబాబ్వేపై, 2011లో శ్రీలంకపై, 2023లో శ్రీలంకపై) నెగ్గి, 2 మ్యాచ్‌ల్లో (1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో ఆ్రస్టేలియా చేతిలో) ఓటమి పాలైంది. 9 వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 9 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్... 5 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించాయి. 1 వాంఖెడె స్టేడియంలో భారత్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో (2017లో) న్యూజిలాండ్ గెలిచింది. 21 వాంఖెడే స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పిచ్, వాతావరణం ఈ వరల్డ్ కప్‌లో వాంఖెడే మైదానంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో అన్ని జట్లూ భారీ స్కోర్లు చేశాయి. రెండో అర్ధభాగం ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలిస్తోంది. సెమీస్ ఒత్తిడిని కూడా దృష్టిలో ఉంచుకొని చూస్తే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. ఒకవేళ అవాంతరం ఎదురైనా సెమీస్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్మన్, సాన్‌ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్. -
ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్ 9/9
సంపూర్ణం... లీగ్ దశలో భారత్ జైత్రయాత్ర! నెదర్లాండ్స్ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్; కేఎల్ రాహుల్ సెంచరీలతో డచ్ బౌలర్లను నెట్ ప్రాక్టీస్‌లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9 మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్ శర్మ బృందం అజేయంగా లీగ్ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరుకు సై అంటోంది. బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. క్రికెట్ కూనపై టాస్ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీని సాధించారు. రోహిత్ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఐదుగురూ చితగ్గొట్టారు... ఓపెనర్లు రోహిత్ బౌండరీలతో... శుబ్‌మన్ సిక్సర్లతో భారత్ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్ రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. కోహ్లి, అయ్యర్ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాల బ్యాటింగ్‌ను చూపెట్టారు. 48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్ మూడు సిక్స్‌లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ స్కోరు 400 మార్క్ దాటింది. ఐదో బంతికి రాహుల్ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్ 208 పరుగులు జోడించి ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సృష్టించారు. కూన కుదేల్ లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్ ఒ డౌడ్ (30), అకెర్మన్ (35), సైబ్రాండ్ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డ తేజ నిడమనూరు మిడిలార్డర్లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్ రాహుల్ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్‌కు దిగారు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్ స్వయంగా బౌలింగ్ చేసి ముగింపు పలికాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్ (సి) తేజ (బి) మీకెరన్ 51; కోహ్లి (బి) మెర్వ్ 51; అయ్యర్ (నాటౌట్) 128; రాహుల్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 102; సూర్యకుమార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–52–0, వాన్ బిక్ 10–0–107–0, అకెర్మన్ 3–0–25–0, మీకెరన్ 10–0–90–1, వాన్‌డెర్ మెర్వ్ 10–0–53–1, బస్ డి లీడే 10–0–82–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; ఒ డౌడ్ (బి) జడేజా 30; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 35; సైబ్రాండ్ (బి) సిరాజ్ 45; ఎడ్వర్డ్స్ (సి) రాహుల్ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్ 54; వాన్ బిక్ (బి) కుల్దీప్ 16; మెర్వ్ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్ (బి) బుమ్రా 5; మీకెరన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 250. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. బౌలింగ్: బుమ్రా 9–1–33–2, సిరాజ్ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్ 2–0–11–0, సూర్యకుమార్ 2–0–17–0, రోహిత్ 0.5–0–7–1. 9: ఒకే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్‌లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. 7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్‌కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది. 9: ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలిసారి భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ వేయించింది. గతంలో ఇంగ్లండ్ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్ (1992లో పాకిస్తాన్‌పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది. 24: ఈ ఏడాది వన్డేల్లో భారత్ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది. 60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్‌లు కొట్టాడు. 215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్‌లు. 2019లో వెస్టిండీస్ అత్యధికంగా 209 సిక్స్‌లు కొట్టింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో?
ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలి యా జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. లీగ్ దశలో 40 మ్యాచ్‌లు ముగియగా... మరో 5 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో భారత్–నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా–బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదు. దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లు మాత్రమే రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఒక సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి. ‘టాప్’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్న భారత్ నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో మరో సెమీఫైనల్లో తలపడతుంది. ఒకవేళ పాకిస్తాన్ ముందంజ వేస్తే మాత్రం భారత్ 16న కోల్‌కతాలో పాక్‌తో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లలో ఒక జట్టు సెమీస్‌కు చేరితే భారత్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది. ప్రస్తుతం నాలుగో సెమీఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పోటీ ఉంది. మూడు జట్లకు ప్రస్తుతం సమాన పాయింట్లు (8) ఉన్నా... తక్కువ రన్‌రేట్‌తో (–0.338) అఫ్గానిస్తాన్ వెనుకబడి ఉంది. రేసులో కనీసం నిలవాలంటే శుక్రవారం తమ ఆఖరి పోరులో ఆ జట్టు భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. దానికి ముందు నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. పాకిస్తాన్ (0.036)కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం న్యూజిలాండ్ (0.398)కు సానుకూలాంశం. లంకపై గెలిస్తే చాలు కివీస్ ముందంజ వేసినట్లే. పాక్ శనివారం తమ చివరి పోరులో ఇంగ్లండ్‌పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ బలహీనంగా కనిపిస్తున్నా సరే... ఇది పాక్‌కు అంత సులువు కాదు. అయితే అందరికంటే చివరగా మ్యాచ్ ఆడనుండటంతో పాక్‌కు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. నేడు లంక చేతిలో కివీస్ ఓడినా...వర్షంతో మ్యాచ్ రద్దయినా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ఇంగ్లండ్‌పై పాక్ గెలిస్తే చాలు సెమీఫైనల్ చేరుతుంది. -
సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఆసీస్, న్యూజిలాండ్ రికార్డు సమం
వవన్డే ప్రపంచప్-2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రోహిత్ సేన అడగుపెట్టింది. దాంతో ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఆస్ట్రేలియా, కివీస్‌తో సంయుక్తంగా.. ఇక వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు టీమిండియా క్వాలిఫై కావడం ఎనిమిదో సారి. తద్వారా వరల్డ్‌కప్ సెమీఫైనల్స్‌కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సంయుక్తంగా భారత్ నిలిచింది. ఆసీస్, కివీస్ కూడా ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్‌కప్ టోర్నీల్లో సెమీస్‌లో అడుగుపెట్టాయి. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్‌గా.. 8 సార్లు ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టిన భారత్.. అందులో రెండు సార్లు భారత జట్టు వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచింది. 1983, 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్‌లను భారత్ సొంతం చేసుకుంది. 2003 వరల్డ్‌కప్ ఫైనల్‌కు భారత్ చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. 2003 వరల్డ్‌కప్ రన్నరప్‌గా గంగూలీ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. కాగా ముచ్చటగా మూడో సారి వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు. చదవండి: Rohit Sharma: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా.. మా జైత్రయాత్రకు కారణం అదే! -
రష్మిక అలవోక విజయం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోరీ ్న లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–1, 6–3తో నాలుగో సీడ్ హిరోకో కవాటా (జపాన్)పై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఎనిమిది ఏస్‌లు సంధించడం విశేషం. -
సెమీఫైనల్లో సింధు పరాజయం
వాంటా (ఫిన్లాండ్): ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 63 నిమిషాల్లో 12–21, 21–11, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. గతంలో వాంగ్ జి యితో ఆడిన రెండుసార్లూ గెలిచిన సింధు మూడోసారి మాత్రం పరాజయం చవిచూసింది. సెమీఫైనల్లో ఓడిన పీవీ సింధుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాదిలో సింధు ఇప్పటి వరకు 18 టోర్నమెంట్లు ఆడగా... స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి, మరో మూడు టోరీ్నల్లో సెమీఫైనల్ చేరింది. చదవండి: World Cup 2023: ఫ్యాన్ బాయ్.. బాబర్ ఆజంకు గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లి! వీడియో వైరల్ -
మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్‌ను ఉమెన్ ఇన్ బ్లూ ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్-1లో పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్‌గా వెనుదిరిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యాక షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. షఫాలీ వర్మ( 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోడ్రిగ్స్(47 నాటౌట్) పరుగులతో దుమ్మురేపింది. ఆఖరిలో రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిముగ్గరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. చదవండి: IND Vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే? చివరగా -
ప్రజ్ఞానంద తొలి గేమ్ ‘డ్రా’
బాకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ సెమీఫైనల్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఫాబియనో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీస్ తొలి గేమ్‌ను ప్రజ్ఞానంద 78 ఎత్తులో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రత్యర్థికి పలు మార్లు మెరుగైన అవకాశాలు వచ్చినా...చివరి వరకు పోరాడిన అతను ఓటమినుంచి తప్పించుకోగలిగాడు. శనివారం నల్లపావులతో ఆడి కరువానాను నిరోధించగలిగిన భారత కుర్రాడు ఆదివారం తెల్ల పావులతో ఆధిక్యం ప్రదర్శించగలిగితే ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరో సెమీస్‌లో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ తన స్థాయిని ప్రదర్శించాడు. స్థానిక ఆటగాడు నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో జరుగుతున్న ఈ పోరులో తొలి గేమ్‌ను అతను 43 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. శనివారం తన రెండో గేమ్‌ను కార్ల్సన్ ‘డ్రా’ చేసుకోగలిగినా ఫైనల్లోకి అడుగు పెడతాడు. -
అర్జున్ పరాజయం సెమీస్‌లో ప్రజ్ఞానంద
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రజ్ఞానంద 5–4తో గెలుపొందాడు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన తొలి భారత ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల అర్జున్ కడదాకా పోరాడినా చివరకు తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ప్రజ్ఞానంద ఎత్తులకు చేతులెత్తేశాడు. బుధవారం ఇద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు గురువారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు గేమ్‌లు ఆడించారు. ఈ రెండూ ‘డ్రా’ కావడంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 76 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో స్కోరు 3–3తో సమంగా నిలిచింది. ఈ దశలో 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. ఇందులో తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో అర్జున్ 36 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 4–4తో సమంగా నిలిచింది. దాంతో ‘సడన్ డెత్’ టైబ్రేక్ మొదలైంది. ‘సడన్‌డెత్’లో తొలుత నెగ్గిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటిస్తారు. ‘సడన్‌డెత్’ తొలి గేమ్‌లోనే ప్రజ్ఞానంద 72 ఎత్తుల్లో అర్జున్ను ఓడించి విజేతగా అవతరించాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్ తొలి గేముల్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)... కరువానా (అమెరికా)తో ప్రజ్ఞానంద తలపడతారు. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
చెన్నై: ఫైనల్ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందం జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు నాకౌట్ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్ ఫేవరెట్ కావడం ఖాయం. గతంలో జపాన్ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో టీమిండియా 6–0తో జపాన్ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది. ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి. -
సాత్విక్–చిరాగ్ సంచలనం
జకార్తా: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో సంచలన ప్రదర్శన చేసింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–13తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జోడీ, టాప్ సీడ్ ఫజర్ అల్ఫీయాన్–మొహమ్మద్ రియాన్ అర్దియాంతో (ఇండోనేసియా)లను బోల్తా కొట్టించింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆరంభ దశలో రెండు జోడీలు పాయింట్ల కోసం హోరాహోరీగా పోరాడాయి. అయితే మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ సాత్విక్–చిరాగ్ జోడీ పైచేయి సాధించింది. చివరిసారి 2019లో ఫజర్–అర్దియాంతోలతో తలపడిన సాత్విక్–చిరాగ్ నాడు వరుస గేముల్లో నెగ్గగా...ఈసారీ రెండు గేముల్లోనే గెలిచారు. నేడు జరిగే సెమీఫైనల్లో కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ సీజన్లో సాత్విక్–చిరాగ్ స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరారు. వరుసగా రెండో ఏడాది... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ వరుసగా రెండో ఏడాది ఈ టోరీ్నలో సెమీఫైనల్ చేరుకోగా... కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలుపొందాడు. గతంలో నరోకాతో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన ప్రణయ్ ఐదో ప్రయత్నంలో ఈ జపాన్ ప్లేయర్‌పై నెగ్గడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 2–5తో వెనుకంజలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 69 నిమిషాల్లో 14–21, 21–14, 12–21తో ప్రపంచ పదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
T20 WC 2023: ప్రతీకార పోరుకు సై... ఆసీస్‌తో అమీతుమీ
ICC Womens T20 World Cup 2023: ఆస్ట్రేలియా సొంతగడ్డపై గత మెగా ఈవెంట్ ఫైనల్లో మన ‘ప్రపంచకప్’ కలని కలగానే మిగిల్చింది. మళ్లీ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ‘స్వర్ణ’వకాశాన్ని ఎగరేసుకు పోయింది. ఈ రెండు ఫైనల్స్‌లో ఓడిన భారత్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడు కంగారూ అమ్మాయిల్ని తుదిపోరుకు చేరకుండా చేసే అవకాశం సెమీస్ మ్యాచ్ ద్వారా భారత్‌కు లభించింది. హర్మన్‌ప్రీత్ సేన సమష్టిగా రాణించి ఆసీస్‌ను దెబ్బకొట్టాల్సిన తరుణం వచ్చేసింది. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధిస్తుందా లేక మరోసారి ఓటమి మూటగట్టుకుంటుందా వేచి చూడాలి. కేప్‌టౌన్: భారత అమ్మాయిల ఆట నాకౌట్‌కు చేరింది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్ చేతికి అందుతుంది. ఇందులో మొదటి అడుగు వేసేందుకు భారత మహిళల జట్టు నేడు పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ‘కంగారూ’ జట్టు భారత్కెపుడూ మింగుడు పడని ప్రత్యర్థే! గత ప్రపంచకప్‌లోనే కాదు... తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రవేశ పెట్టిన క్రికెట్లోనూ చాంపియన్ కాకుండా అడ్డుకుంది. ఆఖరి పోరులో భారత్‌ను పరాజితగా నిలిపిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న హర్మన్‌ప్రీత్ సేనకు ఇదే సరైన సమయం. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటం, బౌలింగ్ నిలకడగా ఉండటం జట్టు అవకాశాల్ని మెరుగు పరుస్తోంది. అయితే ఆసీస్ ఆషామాషీ జట్టు కాదు. ఈ పొట్టి మెగా ఈవెంట్ ఏడుసార్లు జరిగితే ఇందులో ‘హ్యాట్రిక్’ సహా ఐదుసార్లు (2010, 2012, 2014, 2018, 2020) గెలిచిన గట్టి ప్రత్యర్థి . ఇలాంటి జట్టును ఓడించాలంటే ఒక్క ఫామ్ ఉంటే సరిపోదు! సర్వశక్తులు ఒడ్డితేనే అనుకున్న ఫలితం సాధించవచ్చు. కచ్చితంగా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే భారత్ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా తప్పకుండా బ్యాట్‌కు పని చెప్పాల్సిందే. మిడిలార్డర్‌ను హర్మన్, రిచా ఘోష్ నడిపిస్తే పరుగులు వేగంగా సాధించవచ్చు. బౌలింగ్‌లో రేణుక సింగ్ పదును చూపెట్టాలి. శిఖా పాండే, దీప్తి శర్మలు కూడా రాణించాలి. అజేయంగా ఆ్రస్టేలియా ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అజేయంగా సాగు తోంది. గ్రూప్–1లో ఎదురేలేని జట్టుగా నిలిచి సెమీస్ చేరింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి మెగా ఈవెంట్లో శుభారంభం చేసిన కంగారూ సేన ఇప్పటివరకు అన్నీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడని వికెట్ కీపర్ అలీసా హీలీ పూర్తి ఫిట్నెస్తో అందుబాటులోకి వచ్చింది. టాపార్డర్‌లో అమెతో పాటు బెత్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్ మెరుపులు మెరిపిస్తున్నారు. మిడిలార్డర్లో ఆష్లే గార్డ్నర్, ఎలీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, తాలియా మెక్‌గ్రాత్‌లు కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతుండటంతో ఏడో వరుస వరకు బ్యాటింగ్ ఆర్డర్‌కు ఢోకా లేదు. బౌలర్లలో మేగన్ షుట్, డార్సీ బ్రౌన్, అలానా కింగ్‌లు ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించగలరు. 30 అంతర్జాతీయ టి20ల్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు. ఇందులో భారత్ 6 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా 22 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... మరో మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్, మూడు మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్. రేణుక. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెపె్టన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. -
Asian Mixed Team Championships: భారత్‌కు కాంస్యం
దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్‌ను దెబ్బ తీసింది. తొలి మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ ప్రణయ్ 13–21, 15–21తో 121వ ర్యాంకర్ లె లాన్ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుబడింది. అయితే మూడో మ్యాచ్‌లో ధ్రువ్ కపిల–చిరాగ్ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ ద్వయంపై... నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్ షు–తాన్ నింగ్ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఇషాన్–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్ జాంగ్ బాంగ్–వె యా జిన్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్ కాంస్యంతో సంతృప్తి పడింది. -
ఫైనల్ పోరుకు చేరేదెవరు? న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్
ఈ టి20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగిశాయి. ఇప్పుడిక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. వర్షం కురిస్తే రిజర్వ్ డే ఉందేమో కానీ ఓడితే మాత్రం ఇంకో మ్యాచ్ ఉండదు. ఇంటిముఖం పట్టాల్సిందే! అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ టైటిల్ వేటలో తొలి అడుగు వేసేందుకు సై అంటుండగా... గత ప్రపంచకప్‌లో సెమీస్‌తో ముగిసిన తమ ప్రయాణాన్ని ఈసారి ఫైనల్ దాకా కొనసాగించాలని, 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది. సిడ్నీ: ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్లలో (వన్డే, టి20) ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టుకు గెలవడం అంత సులభం కాదేమో! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న కివీస్ విజయమే లక్ష్యంగా టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చి న బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో... ఈ టోర్నీ ఆరంభం నుంచి కూడా న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ వచ్చింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లోనూ పెద్ద తేడాతోనే నెగ్గుకొచ్చింది. ఆతిథ్య ఆసీస్నైతే 89 పరుగులతో ఓడించింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా... ఫిలిప్స్ ఒంటిచేత్తో శతక్కొట్టి గెలుపును ఖాయం చేశాడు. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇబ్బంది పెడుతున్నారు. బౌల్ట్ మినహా మిగతా నలుగురు బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొట్టారు. . ఒత్తిడిలో బాబర్ జట్టు పాకిస్తాన్ ఈ టోర్నీలో సాధారణ ప్రదర్శనతోనే నెట్టుకొచ్చింది. అదృష్టంతో ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ మాత్రం అదృష్టాన్ని నమ్ముకుంటే కుదరదు... మెరుపుల్లేని ఓపెనింగ్ జోడీ రిజ్వాన్, బాబర్ బ్యాట్ ఝుళిపించాల్సిందే. మిడిలార్డర్లో ఇఫ్తికార్, షాన్ మసూద్ ఆదుకుంటున్నారు. బౌలింగ్ కూడా రాటుదేలితేనే పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొట్టగలదు. లేదంటే ఇక్కడితోనే ఇంటిబాట ఖాయం! గత రికార్డులు.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో (1992, 1999 వన్డే వరల్డ్‌కప్, 2007 టి20 ప్రపంచకప్) పాకిస్తాన్ జట్టే గెలిచింది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఓవరాల్‌గా న్యూజిలాండ్, పాక్ జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. 17 మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. పిచ్, వాతావరణం సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో మెరుపులకు కొదవే ఉండదు. కివీస్, ఆసీస్‌ల మధ్య ‘సూపర్ 12’ తొలి మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పైనే తొలి సెమీస్‌ను ఆడిస్తున్నారు. దీంతో పాక్‌కంటే న్యూజిలాండ్‌కే కాస్త అనుకూలం ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 200 పరుగులు చేసింది. ఉదయం చినుకులు కురిసే అవకాశమున్నప్పటికీ మ్యాచ్ సమయానికి ఏ ఇబ్బంది ఉండదు. జట్లు (అంచనా) న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్. చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది' -
సెమీస్‌లో రుత్విక శివాని
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుత్విక 21–19, 21–9తో టాప్ సీడ్ ఐరా శర్మను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మాన్సి సింగ్‌తో రుత్విక ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో మాన్సి 21–13, 21–15తో హైదరాబాద్ ప్లేయర్ మేఘన రెడ్డిపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్; షేక్ గౌస్–మనీషా జోడీలు సెమీఫైనల్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి–రోహన్ ద్వయం 21–13, 21–17తో నితిన్–పూర్వీషా రామ్ జోడీపై... షేక్ గౌస్–మనీషా జంట 21–7, 21–17తో నజీర్ ఖాన్–నీలా వలువన్ జోడీపై విజయం సాధించాయి. -
కాంస్యంతో ముగింపు
టోక్యో: కెరీర్లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న సాత్విక్–చిరాగ్ జోడీ కాంస్య పతకంతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 22–20, 18–21, 16–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) చేతిలో పోరాడి ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సాత్విక్–చిరాగ్ ప్రదర్శనతో వరుసగా తొమ్మిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో పతకం చేరింది. 77 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో రెండు జోడీలు అద్భుతంగా ఆడినా కీలకదశలో ఆరోన్ చియా–సో వుయ్ యిక్ పైచేయి సాధించి విజయాన్ని అందుకున్నారు. ఆరోన్ చియా–సో వుయ్ యిక్ జోడీ చేతిలో సాత్విక్–చిరాగ్ శెట్టిలకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ‘ముఖ్యమైన మ్యాచ్‌లలో కీలకదశల్లో మాకు అదృష్టం కలిసి రావడంలేదు. కీలక సందర్భాల్లో అదృష్టం మావైపు ఉండాలంటే మేము మరిన్ని పూజలు చేసి దేవుడిని ప్రార్థించాలేమో. ఓవరాల్‌గా మా ప్రదర్శనపట్ల సంతృప్తిగా ఉన్నా సెమీఫైనల్ మ్యాచ్ ఫలితం మాత్రం నిరాశ కలిగించింది. తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌లో మేము మలేసియా జోడీపై మరింత ఒత్తిడి పెంచాల్సింది. పతకం సాధించాలనే లక్ష్యంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు వచ్చాం. పతకం గెలిచినందుకు సంతోషంగా ఉన్నా ఫైనల్ చేరితే మా ఆనందం రెట్టింపు అయ్యేది. భవిష్యత్‌లో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాం’ అని సాత్విక్ వ్యాఖ్యానించాడు. -
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సిందూ గెలుపొందింది. తొలి సెట్లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో 21-18తో ప్రత్యర్ధిని మట్టికరిపించి సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది. ఇక సెమీ ఫైనల్లో సింధు గెలిపొందితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా తొమ్మిదో రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. రెండు రజత పతకాలు భారత ఖాతాలో చేరాయి. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించగా, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ ఖాతాలో 28 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022 9th Day: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం -
సెమీస్‌లోనే ముగిసిన బోపన్న పోరాటం
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
భారత్ టైటిల్ ఆశలు గల్లంతు
మస్కట్: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఈసారి కాంస్య పతకం కోసం పోరాడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున వందన (28వ ని.లో), లాల్రెమ్సియమి (54వ ని.లో)... కొరియా తరఫున చియాన్ (31వ ని.లో), సంగ్ జు లీ (45వ ని.లో), హెయెన్ చో (47వ ని.లో) గోల్స్ కొట్టారు. రెండో సెమీఫైనల్లో జపాన్ 2–1తో చైనాను ఓడించింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో చైనాతో భారత్, స్వర్ణం కోసం జపాన్‌తో కొరియా ఆడతాయి. -
పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు
ఫ్రెంచ్ వెటరన్ టెన్నిస్ ప్లేయర్ అలిజె కార్నెట్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తన 17 ఏళ్ల కెరీర్లో ఒక గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అలిజె కార్నెట్‌కు.. డేనియల్ కాలిన్స్ చేతిలో భంగపాటు ఎదురైంది. అమెరికాకు చెందిన డేనియల్ కాలిన్స్.. కార్నెట్‌ను 7-5,6-1తో వరుస సెట్లలో ఖంగుతినిపించి సెమీఫైనల్లో అడుగపెట్టింది. చదవండి: Australian Open Grandslam 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన నాదల్, యాష్లే బార్టీ ఇగా స్వియాటెక్, కాయ కనేపిల మధ్య జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇగా స్వియాటెక్‌ను విజయం వరించింది. మ్యాచ్‌లో 4-6,7-6(7/2),6-3 తేడాతో స్వియాటెక్.. కనేపిపై విజయం సాధించిన తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. మొత్తం మూడు గంటల ఒక నిమిషం పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన స్వియాటెక్ రెండో సెట్లో ఫుంజుకుంది. ఇక ఆఖరిసెట్లో 6-3తో గెలిచి సెమీస్‌కు చేరింది. ఇక ఇగా స్వియాటెక్, డేనియల్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. తొలి సెమీఫైనల్లో యాష్లే బార్టీ, కీస్ మాడిసన్లు తలపడనున్నారు. చదవండి: తొందర పడ్డానేమో! రిటైర్మెంట్పై సానియా మీర్జా వ్యాఖ్య -
Under-19 Asia Cup: గుంటూరు కుర్రాడు అదుర్స్.. ఫైనల్లో టీమిండియా
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో భారత్ 103 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన షేర్ రషీద్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 38.2 ఓవర్లలో 140 పరుగలుకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లలో ఆరిఫుల్ ఇస్లామ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రాజ్‌వర్దన్, రవికుమార్, రాజ్ భవా, విక్కీ ఓస్తల్ తలా రెండు వికెట్లు తీయగా.. నిషాంత్ సింధు, కుషాల్ తంబే చెరో వికెట్ తీశారు. ఇక డిసెంబర్ 31న జరిగే ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో ఆడనుంది. -
Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు
Tamil Nadu Enters Final Beat Hyderabad By 8 Wickets.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఘోర ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.తనయ్ త్యాగరాజన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమ్యారు. తమిళనాడు బౌలర్ శరవణ కుమార్ 5 వికెట్లతో దుమ్మురేపగా.. ఎం అశ్విన్, మహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విజయ్‌శంకర్ 43 పరుగులు నాటౌట్.. సాయి సుదర్శన్ 34 నాటౌట్ గెలిపించారు. ఈ విజయంతో తమిళనాడు ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ, కర్ణాటక మధ్య జరగనున్న సెమీఫైనల్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: chris gayle: క్రిస్ గేల్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే.. -
PAK vs AUS: స్టోయినిస్, వేడ్ మెరుపులు.. ఫైనల్‌కు ఆస్ట్రేలియా
స్టోయినిస్, వేడ్ మెరుపులు.. ఫైనల్‌కు ఆస్ట్రేలియా; పాకిస్తాన్ ఓటమి సమయం:23:19.. టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు ప్రవేశించింది. పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది. కానీ మార్కస్ స్టోయినిస్(31 బంతుల్లో 40 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్సర్లు ), మాథ్యూ వేడ్(17 బంతుల్లో 41 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు వర్షం కురిపించడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు డేవిడ్ వార్నర్ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. ఇక నవంబర్ 14 న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక 2015 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అంతకముందు పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(67 పరుగులు) మరో అర్థశతకంతో మెరవగా.. ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 55 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 39 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు సమయం: 23:04.. పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ హోరాహోరిగా సాగుతుంది. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. స్టోయినిస్ 40, వేడ్ 21 పరుగులతో ఆడుతున్నారు. 13 ఓవర్లలో ఆస్ట్రేలియా 103/5 సమయం: 22:34.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వార్నర్ ఔటైన కాసేపటికే మ్యాక్స్‌వెల్(7)ను షాబాద్ బోల్తా కొట్టించాడు. షాబాద్‌కు ఇది నాలుగో వికెట్ కావడం విశేషం. ప్రస్తుతం 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. సమయం: 22:25.. డేవిడ్ వార్నర్(49) రూపంలో ఆస్ట్రేలియా బిగ్ వికెట్ కోల్పోయింది. పాక్ స్పిన్నర్ షాదబ్ ఖాన్ 3 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. స్మిత్ (5) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా సమయం: 22:17.. ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(5) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. వార్నర్ 48, మ్యాక్స్‌వెల్ 3 పరుగలుతో ఆడుతున్నారు. సమయం: 22:00.. నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్(28) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. వార్నర్ 24, స్మిత్ 0 పరుగులతో ఆడుతున్నారు. 5 ఓవర్లలో ఆస్ట్రేలియా 44/1 సమయం: 21:53.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. వార్నర్ 22, మార్ష్ 22 పరుగులతో ఆడుతున్నారు.ఫించ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన మార్ష్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఆరోన్ ఫించ్ గోల్డెన్ డక్ సమయం: 21:36.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. వార్నర్ 3, మిచెల్ మార్ష్ 3 పరుగులతో ఆడుతున్నారు. ఫఖర్ జమాన్ మెరుపులు.. పాకిస్తాన్ 20 ఓవర్లలో 176/4 ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(67 పరుగులు) మరో అర్థశతకంతో మెరవగా.. ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 55 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 39 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు. రిజ్వాన్(67) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(67) రూపంలో పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా షాట్ ఆడినప్పటికీ స్మిత్ క్యాచ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 40, ఆసిఫ్ అలీ 0 పరుగులతో ఆడుతున్నాడు. 10 ఓవర్లలో పాకిస్తాన్ 71/1 సమయం: 20:12.. పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్(39) రూపంలో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన బాబర్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 28 పరుగులతో ఆడుతున్నాడు. ధాటిగా ఆడుతున్న పాకిస్తాన్.. 5 ఓవర్లలో 38/0 సమయం: 19:50.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 21, మహ్మద్ రిజ్వాన్ 15 పరుగులతో ఆడుతున్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా గురువారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక సూపర్ 12 దశలో పాకిస్తాన్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి నాటౌట్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి.. ఒకటి ఓడి సెమీస్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్ జట్టులో ఉన్న 11 మంది సూపర్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఒకరు విఫలమైతే.. మరొకరు ఆడుతుండడం పాక్‌కు అదనపు బలం. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీలు అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మాత్రం బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. మిగిలిన బ్యాటర్స్‌లో మ్యాక్స్‌వెల్, స్మిత్, ఫించ్‌లు తమదైన ఆటతీరును ఇంకా చూపించలేదు. వీరు కూడా ఫామ్‌లోకి వస్తే పాకిస్తాన్‌కు కొంచెం కష్టమే. ఇక స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్, జంపా లాంటి బౌలర్లతో ఆసీస్ బౌలింగ్ పటిష్టంగానే కనిపిస్తుంది. ఓవరాల్‌గా పాకిస్తాన్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేము. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు టి20ల్లో 22 సార్లు తలపడగా.. 13 సార్లు పాకిస్తాన్.. 9 సార్లు ఆసీస్ గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు తలపడిన ఈ రెండు జట్లు చెరో మూడు విజయాలతో సమానంగా ఉన్నాయి. ఇంకో విశేషమేమిటంటే ఐసీసీ టోర్నీ నాకౌట్లలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక యూఏఈలో పాకిస్తాన్ 16 టి20 మ్యాచ్‌లు ఆడగా.. 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజమ్(కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిం, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
అమ్మాయిలు చరిత్ర సృష్టించేనా?
కొత్త చరిత్ర సృష్టించడానికి, చరిత్రలో నిలిచిపోవడానికి భారత మహిళల హాకీ జట్టు ఒకే ఒక్క విజయం దూరంలో ఉంది. ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై టీమిండియా మరింత దృష్టి పెట్టాలి. ఫినిషింగ్ లోపాలను సవరించుకోవాలి. క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళలు పట్టుదలతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడితే కాంస్య పతకం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఫైనల్‌కు చేరుకోకపోవడంతో బ్రిటన్ కనీసం కాంస్య పతకంతోనైనా తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. -
ఫ్రెంచ్ కోటలో కొత్త చరిత్ర
తొలి రౌండ్ నుంచి మొదలైన సంచలనాల మోత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇంకా కొనసాగుతోంది. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్లో ఎవ్వరూ ఊహించని విధంగా మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది. కెరీర్లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న అర్జెంటీనాకు చెందిన 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా ఈ ఘనత సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా పారిస్ వచ్చిన 23 ఏళ్ల నదియా తన జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినాను బోల్తా కొట్టించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. పారిస్: డిఫెండింగ్ చాంపియన్ వైదొలగడం... టైటిల్ ఫేవరెట్స్ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం ... వెరసి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్‌లో ఓ క్వాలిఫయర్ సెమీఫైనల్ దశకు అర్హత పొందింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) 79 నిమిషాల్లో 6–2, 6–4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్ ఈ ఘనత సాధించింది. పౌలా సురెజ్ కూడా ఫ్రెంచ్ ఓపెన్లోనే సెమీఫైనల్ చేరింది. ఇగా స్వియాటెక్ (పోలాండ్), క్వాలిఫయర్ మారి్టనా ట్రెవిసాన్ (ఇటలీ) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో పొడొరోస్కా ఆడుతుంది. ఆన్స్ జెబర్ (ట్యూనిషియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డానియెలా కొలిన్స్ (అమెరికా) 6–4, 4–6, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. తడబాటు... డిఫెండింగ్ చాంపియన్ యాష్లే బార్టీ ఈ టోర్నీకి దూరంగా ఉండటం... మాజీ చాంపియన్స్ సెరెనా, హలెప్, ముగురుజా... రెండో సీడ్ ప్లిస్కోవా ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ని్రష్కమించడంతో మూడో సీడ్ స్వితోలినాకు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్ కలను సాకారం చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది. కానీ పొడొరోస్కా రూపంలో స్వితోలినాకు దెబ్బ పడింది. తన క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి పొడొరోస్కా గురించి అంతగా వినలేదని... ఆమె ఆట గురించి కూడా తెలియదని వ్యాఖ్యానించిన స్వితోలినాకు కోర్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది. పొడొరోస్కా ఆటపై అవగాహన కలిగేలోపే స్వితోలినా తొలి సెట్‌ను కోల్పోయింది. 35 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో నాలుగుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన పొడొరోస్కా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. ఇక రెండో సెట్లో ఆరంభంలో ఇద్దరూ 1–1తో సమంగా నిలిచాక మూడుసార్లు చొప్పున తమ సర్వీస్‌లను నిలబెట్టుకోలేకపోయారు. దాంతో స్కోరు 4–4తో సమం అయ్యింది. ఆ తర్వాత పొడొరోస్కా తన సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో పొడొరోస్కా తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిది సార్లు బ్రేక్ చేసింది. స్వితోలినా 8 విన్నర్స్ కొట్టగా... పొడొరోస్కా ఏకంగా 30 విన్నర్స్ కొట్టింది. నెట్ వద్ద పొడొరోస్కా 17 సార్లు... స్వితోలినా ఏడుసార్లు పాయింట్లు సాధించారు. స్వితోలినా క్వాలిఫయర్ అంటే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో 128 మంది ఉంటారు. ఇందులో 104 మందికి ర్యాంకింగ్ ద్వారా నేరుగా చోటు కల్పిస్తారు. మిగిలిన 24 మందిలో 8 మందికి నిర్వాహకులు వైల్డ్ కార్డులు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మిగిలిన 16 బెర్త్‌లను క్వాలిఫయింగ్ నాకౌట్ టోర్నీ ద్వారా భర్తీ చేస్తారు. మూడు రౌండ్లపాటు జరిగే క్వాలిఫయింగ్ టోర్నిలో 128 మంది పాల్గొంటారు. క్వాలిఫయింగ్ టోర్నిలో మూడు మ్యాచ్‌లు నెగ్గి ముందంజ వేసినవారు (16 మంది) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతారు. ►ఈ టోర్నీకంటే ముందు పొడొరోస్కా తన కెరీర్లో ఏనాడూ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ గెలవలేదు. టాప్–50 ర్యాంకింగ్స్లోపు క్రీడాకారిణిని ఓడించలేదు. 2016లో ఆమె యూఎస్ ఓపెన్‌లో ఆడినా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. డబ్ల్యూటీఏ టూర్ టోర్నీలలో కూడా ఆమె ఏనాడూ వరుస రెండు మ్యాచ్‌ల్లో నెగ్గలేదు. థీమ్‌కు షాక్... పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 5 గంటల 8 నిమిషాలపాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (7/1), 5–7, 6–7 (6/8), 7–6 (7/5), 6–2తో గతేడాది రన్నరప్ థీమ్‌పై సంచలన విజయం సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో సెమీస్ చేరాడు. ►గ్రాండ్‌స్లామ్ టోర్నీల మహిళల సింగిల్స్‌లో పొడొరోస్కా కంటే ముందు క్వాలిఫయర్ హోదాలో 1978 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్రిస్టిన్ డొరీ (ఆ్రస్టేలియా)... 1999 వింబుల్డన్ టోర్నీలో అలెగ్జాండ్రా స్టీవెన్సన్ (అమెరికా) మాత్రమే సెమీస్ చేరారు. -
నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!
మహిళల టి20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత దాటాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్, టోర్నీలో అజేయ ప్రదర్శన అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఇది హర్మన్ సేనపై ఉన్న అంచనాలకు సంబంధించి ఒక పార్శ్వం. కానీ అటువైపు చూస్తే ప్రత్యర్థి ఇంగ్లండ్... టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్ ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా వేచి చూడాలి. సిడ్నీ: లీగ్ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్ మాత్రం ఫైనల్ చేరడంపై ఆశలు రేపుతోంది. హర్మన్ ఫామ్‌తో ఇబ్బంది! లీగ్ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. జెమీమా రోడ్రిగ్స్ (85 పరుగులు), దీప్తి శర్మ (83 పరుగులు) కొంత వరకు ఫర్వాలేదనిపించారు కానీ తొలి స్థానంలో ఉన్న షఫాలీకి వీరిద్దరికి మధ్య పరుగుల్లో చాలా అంతరం ఉంది. అయితే అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. ఇక హర్మన్ కౌర్ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్, లెఫ్టార్మ్ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఈ ఐదుగురు బౌలర్ల ఎకానమీ ప్రపంచకప్‌లో 6 దాటకపోవడం విశేషం. గాయాల సమస్య లేదు కాబట్టి శ్రీలంకతో చివరి లీగ్ ఆడిన తుది జట్టునే మార్పుల్లేకుండా భారత్ కొనసాగించనుంది. 2018 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిన జట్టులో ఆడిన ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడు భారత జట్టు తరఫున మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జోరు మీదున్న సివెర్.. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్ చేర్చడంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. నటాలీ సివెర్ 4 మ్యాచ్‌లలో కలిపి 202 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్ హెథర్ నైట్ (193)నుంచి మంచి సహకారం లభించింది. నైట్ ఖాతాలో ఒక శతకం కూడా ఉండటం విశేషం. మరోసారి ఇంగ్లండ్ జట్టు ఈ ఇద్దరి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. వీరిని నిలువరించగలిగితేనే ప్రత్యర్థి పని సులువవుతుంది. అమీ జోన్స్, డానియెలా వ్యాట్ వరుసగా విఫలమవుతున్నారు. అయితే ఇంగ్లండ్ కూడా తమ బౌలింగ్‌ను బాగా నమ్ముకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఎకెల్‌స్టోన్ పాత్ర మరోసారి కీలకం కానుంది. ఈ బౌలర్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3.23 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. ష్రబ్సోల్ కూడా 8 వికెట్లతో అండగా నిలవగా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సారా గ్లెన్ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో సెమీస్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. వర్షం పడితే ఫైనల్‌కు భారత్.. రిజర్వ్ డే అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే ఉంచాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసి పుచ్చింది. స్థానిక వాతావరణ శాఖ సూచన ప్రకారం గురువారం రోజంతా వర్ష సూచన ఉంది. దాంతో కీలకమైన పోరు కాబట్టి రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సీఏ భావించింది. ‘టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు కుదరదు’ అని ఐసీసీ తేల్చి చెప్పింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్ రద్దయినట్లే. ఇదే జరిగితే గ్రూప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండో సెమీస్ కూడా.. తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది. గ్రూప్ ‘బి’లో సఫారీ జట్టు అజేయంగా నిలవగా... ఆసీస్ మాత్రం భారత్ చేతిలో ఓడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), షఫాలీ, స్మృతి, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖా పాండే, రాధ, పూనమ్, రాజేశ్వరి. ఇంగ్లండ్: హెథర్ నైట్ (కెప్టెన్), వ్యాట్, బీమాంట్, సివెర్, విల్సన్, అమీ జోన్స్, బ్రంట్, ష్రబ్సోల్, మ్యాడీ విలియర్స్, ఎకెల్‌స్టోన్, సారా గ్లెన్. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షం పడితే పిచ్ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం. 4 - భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా, ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి. -
టీ20 ప్రపంచకప్: సెమీస్ బెర్తులు ఖరారు
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలింది. గ్రూప్ ఏలో టాపర్‌గా ఉన్న భారత్ గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంగళవారం గ్రూప్ బిలో టాపర్‌ను డిసైడ్ చేసే వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్ బిలో అత్యధిక పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్-2014 తర్వాత సెమీస్‌లో అడుగుపెట్టింది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి. ఇప్పటివరకు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు సెమీస్ వెళ్లిన భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. అయితే ఈ సారి ఫైనల్‌కు వెళ్లడంతో పాటు కప్‌ను గెలుచుకోవాలని హర్మన్ సేన ఆరాటపడుతోంది. సీనియర్లు, జూనియర్లతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉందని, ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంటుందని ఆసీస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. చదవండి: మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు కోహ్లికి సూచనలివ్వడానికి మీరెవరు? -
శ్రీజ తడాఖా
కటక్: స్వదేశంలో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అదరగొట్టే ప్రదర్శన చేసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో సెమీఫైనల్ చేరి కనీసం రెండు కాంస్య పతకాలను ఖాయం చేసుకున్న శ్రీజ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన శ్రీజ క్వార్టర్ ఫైనల్లో 11–5, 11–6, 11–9, 17–19, 6–11, 17–15తో సుతీర్థ ముఖర్జీ (భారత్)పై అద్భుత విజయం సాధించింది. అంతకుముందు శ్రీజ తొలి రౌండ్లో 11–6, 11–5, 6–11, 12–10, 11–7తో సాగరిక ముఖర్జీ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–11, 15–13, 13–11, 11–3, 11–8తో చార్లోటి క్యారీ (వేల్స్)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో మధురిక పాట్కర్ (భారత్)తో శ్రీజ ఆడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్ (భారత్) జంట 11–4, 11–8, 7–11, 11–8తో జాంగ్ వాన్ లింగ్–తాన్ లిలిన్ జాసీ (సింగపూర్) జోడీపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట 11–13, 11–8, 11–6, 8–11, 4–11తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీ చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్–అర్చన కామత్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో సత్యన్–అర్చన జంట 11–1, 11–7, 11–4తో పాంగ్ యు ఎన్ కొయెన్–గోయ్ రుయ్ జువాన్ (సింగపూర్) జోడీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, హర్మీత్ దేశాయ్ (భారత్) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. -
రష్యా ఓపెన్: సెమీస్‌లో మేఘన జంట
వ్లాదివోస్తోక్(రష్యా): తెలుగు అమ్మాయి జక్కంపూడి మేఘన రష్యా ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల, మిక్స్డ్ డబుల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ మేఘన–ధ్రువ్ కపిల(భారత్) ద్వయం 21–3, 21–12తో స్థానిక జోడీ మస్కిమ్ మకలోవ్–ఎక్తరినా రియాజన్చెవాను చిత్తు చేసింది. తదుపరి రౌండ్లో ఏడో సీడ్ అద్నాన్ మౌలానా–మిచెల్ క్రిస్టీన్ బందాసో (ఇండోనేషియా) జోడీతో తలపడుతుంది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ మేఘన– పూర్వీషా రామ్(భారత్) జోడీ 21–19, 21–11తో విక్టోరియా కొజిరెవా–మారియా సుఖోవా(రష్యా) జంట పై నెగ్గి తుది నాలుగులోకి చేరింది. తదుపరి రౌండ్లో నాలుగో సీడ్ మికి కషిహర– మియుకి కటో(జపాన్) జంటతో తలపడుతుంది. కాగా, మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ దాస్10–21, 21–16, 16–21తో టాప్ సీడ్ క్రిస్టీ గిల్మోర్(స్కాట్లాండ్), పురుషుల సింగిల్స్‌లో సిరిల్ వర్మ 11–21, 27–29తో ఇషాన్ మౌలానా ముస్తఫా (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడారు. దీంతో ఈ రెండు విభాగాల్లో భారత్ ప్రస్థానం ముగిసింది. -
సెమీ ఫైనల్:భారత్VSన్యూజిలాండ్
-
సెమీస్ చేరిన టీమిండియా
-
కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ
మహిళల కాంపౌండ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ విశేషంగా రాణించింది. ఆమె రెండు కాంస్య పతకాల కోసం పోటీపడనుంది. జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్‌లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు సెమీఫైనల్లో 226–227తో అమెరికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో బై పొందిన భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 236–226తో ఫ్రాన్స్‌పై... క్వార్టర్ ఫైనల్లో 219–213తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో టర్కీతో భారత్ ఆడుతుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ కాంస్యం కోసం బరిలో ఉంది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 140–143తో పియర్స్ పైజి (అమెరికా) చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో యాసిమ్ బోస్టాన్ (టర్కీ)తో సురేఖ ఆడుతుంది. సురేఖ క్వార్టర్ ఫైనల్లో 147–141తో సారా ప్రీల్స్ (బెల్జియం)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో తాంజా జెన్సన్ (డెన్మార్క్)పై, మూడో రౌండ్లో 146–143తో బోమిన్ చోయ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. -
సెమీస్‌లో ప్రసాద్
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల 52 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌కు చెందిన తేజ్ బహదూర్ దేబాపై ప్రసాద్ విజయం సాధించాడు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన ఆసియా చాంపియన్ అమిత్ ఫంగల్, సచిన్ సివాచ్, గౌరవ్ సోలంకి కూడా సెమీఫైనల్‌కు చేరారు. దాంతో ఈ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్ ఖాతాలోకే చేరనున్నాయి. -
సెమీఫైనల్‌కు యు ముంబా
చెన్నై: ప్రొ వాలీబాల్ లీగ్‌లో యు ముంబా వాలీ జట్టు సెమీఫైనల్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. చెన్నైలో సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 10–15, 15–12, 15–13, 15–12, 15–8తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టుపై గెలిచింది. కాలికట్, కొచ్చి జట్లు గతంలోనే సెమీఫైనల్ బెర్త్‌లు ఖాయం చేసుకోగా... చెన్నై, యు ముంబా, బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన సెట్ల స్కోరు ఆధారంగా చెన్నై (+1), యు ముంబా (–1) ముందంజ వేయగా... బ్లాక్ హాక్స్ హైదరాబాద్ (–3) నిష్క్రమించింది. లీగ్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టు పాయింట్ల ఖాతానే తెరువలేదు. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో కాలికట్ హీరోస్తో యు ముంబా తలపడుతుంది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ ఆడుతుంది. గురువారం విశ్రాంతి దినం తర్వాత... శుక్రవారం ఫైనల్ పోరు జరుగుతుంది. -
సెమీస్‌లో అవధ్ వారియర్స్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్– 4)లో అవధ్ వారియర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 4–3తో చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో లీ యంగ్–క్రిస్టియన్సెన్ ద్వయం 15–8, 15–6తో క్రిస్ అడ్కాక్–సుమిత్ రెడ్డి (చెన్నై) జంటపై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్ అవధ్‌కు ‘ట్రంప్’ కావడంతో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో లీ డాంగ్ క్యున్ (వారియర్స్) 15–7, 15–13తో వీ ఫెంగ్ చోంగ్ (చెన్నై)పై గెలుపొందగా, చెన్నైకి ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హ్యున్ 15–13, 15–8తో బీవెన్ జాంగ్ (వారియర్స్)ను ఓడించింది. దీంతో అవధ్ ఆధిక్యం 3–2కు తగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–గ్యాబ్రియెల్ అడ్కాక్ (చెన్నై)జోడీ 15–13, 9–15, 15–14తో క్రిస్టియన్సెన్–అశ్విని పొన్నప్ప (వారియర్స్) జంటపై నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. నిర్ణాయక పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో సన్ వాన్ హో (వారియర్స్) 15–6, 15–6తో రాజీవ్ ఉసెఫ్ (చెన్నై)పై గెలిచి అవధ్‌కు విజయాన్నందించాడు. ఇప్పటికే ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్ సెమీస్ బెర్తులు సాధించాయి. నేడు బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
సెమీస్‌లో నిఖత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. కర్ణాటకలోని విజయనగరలో జరుగుతోన్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్ 5–0తో మాన్సీ శర్మ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. 81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో తెలంగాణకే చెందిన సారా ఖురేషి మహారాష్ట్ర బాక్సర్ మోహిని చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
కాచుకో ఇంగ్లండ్!
నార్త్ సాండ్ (అంటిగ్వా): వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు భారత మహిళల జట్టుకు సరైన అవకాశం. టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గతేడాది జూన్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆ ఓటమి అనంతరం రాటుదేలిన టీమిండియా ఇంటాబయటా వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యే సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి తొలిసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్ చేరగా... ఇంగ్లండ్ మాత్రం కిందామీద పడుతూ ఇక్కడి వరకు వచ్చింది. ఆ ఇద్దరే బలంగా... టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో పటిష్ట న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిచింది. ఆ తర్వాత బాదే బాధ్యతను వెటరన్ మిథాలీ రాజ్ తీసుకుంది. వరుస అర్ధసెంచరీలతో పాకిస్తాన్, ఐర్లాండ్ల పనిపట్టింది. చివరిలీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన, హర్మన్ విజృంభించడంతో టోర్నీ ఫేవరెట్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇప్పటివరకు 167 పరుగులతో హర్మన్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలవగా... స్మృతి 144 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. టాపార్డర్‌లో యువ జెమీమా రోడ్రిగ్స్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంది. వీరంతా ఇదే ప్రదర్శనను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్లో దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తాన్యా భాటియా కూడా తలా ఓ చేయివేస్తే టీమిండియాకు తిరుగుండదు. నలుగురు స్పిన్నర్లతో భారత బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. స్పిన్ చతుష్టయం సత్తా చాటుతుండటంతో కోచ్ రమేశ్ పవార్ ఏకైక పేసర్ వ్యూహాన్నే అనుసరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్రత్యర్థి భరతం పడుతుండగా... ఆమెకు రాధ, దీప్తి, హేమలత చక్కటి సహకారం అందిస్తున్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఇంగ్లండ్ సెమీస్‌లోనైనా జోరు కనబర్చాలని చూస్తోంది. కెప్టెన్ హీథర్ నైట్, వ్యాట్, బ్యూమౌంట్, స్కీవర్, అమీ జోన్స్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. పేసర్లు స్కీవర్, ష్రబ్సోల్ మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కంటే ముందు గురువారం అర్ధరాత్రి గం.1.20 నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది. ► ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు 13 టి20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. మూడింటిలో భారత్ గెలుపొందగా... పది మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ► శుక్రవారం ఉదయం గం. 5.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సాకేత్ సంచలనం
బెంగళూరు: తన విజయ పరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ నాగల్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) నుంచి ప్రజ్నేశ్‌కు ‘వాకోవర్’ లభించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 2–6, 8–10తో పురవ్ రాజా (భారత్)–సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది. -
సింగిల్స్ సెమీస్‌లో శుభాంకర్ డే
సార్లార్లక్స్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు శుభాంకర్ డే సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుభాంకర్ 21–16, 21–9తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ 16–21, 18–21తో టోమా జూనియర్ పపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శైలి రాణే (భారత్) 14–21, 9–21తో లైన్ హోమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. -
తుది పోరుకు భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా హాకీ చాంపి యన్స్ ట్రోఫీలో నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (19వ ని.లో), చింగ్లేన్‌సనా (44వ ని.లో), దిల్‌ప్రీత్‌సింగ్ (55వ ని.లో).... జపాన్ తరఫున వకురి (22వ ని.లో), జెన్దాన (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించింది. నేడు జరిగే టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గతంలో భారత్ 2011, 2016లలో ఫైనల్లో పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. -
మహిళా రెజ్లర్లకు నిరాశ
బుడాపెస్ట్ (హంగేరి): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు నిరాశపరిచారు. ఆరు వెయిట్ కేటగిరీల్లో ఒక్కరు కూడా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయారు. సీమ (55 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (68 కేజీలు), రజని (72 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో... సరిత (59 కేజీలు), రీతూ (65 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. సీమ 0–11తో దావాచిమెగ్ (మంగోలియా) చేతిలో... నవ్‌జ్యోత్ 0–4తో కుంబా ఫాంటా సెలెన్ (ఫ్రాన్స్) చేతిలో... రజని 0–2తో మార్టినా క్యునెజ్ (ఆస్ట్రియా) చేతిలో... కిరణ్ 2–12తో ఎల్మీరా సిజ్దికోవా (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. షూవ్‌డోర్ బతర్జావ్ (మంగో లియా) 10–0తో సరితపై, పెట్రా మారిట్ (ఫిన్లాండ్) 6–2తో రీతూపై గెలిచారు. నవ్‌జ్యోత్ కౌర్‌పై గెలిచిన సెలెన్... రీతూపై నెగ్గిన పెట్రా మారిట్ ఫైనల్‌కు చేరుకోవడం తో వీరిద్దరికి బుధవారం కాంస్యం గెలిచేందుకు రెప్‌చేజ్ బౌట్లలో అవకాశం దక్కింది. -
గంభీర్ సెంచరీ సెమీస్‌లో ఢిల్లీ
బెంగళూరు: తన 37వ పుట్టిన రోజున అద్భుత సెంచరీతో అలరించిన గౌతమ్ గంభీర్ (72 బంతుల్లో 104; 16 ఫోర్లు)... విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఢిల్లీ జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. హరియాణాతో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హరియాణా 49.1 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్ కుల్వంత్ ఖెజ్రోలియా (6/31) ‘హ్యాట్రిక్’ సహా ఆరు వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కుల్వంత్ వరుస బంతుల్లో చైతన్య బిష్ణోయ్, ప్రమోద్ చండీలా, అమిత్ మిశ్రాలను ఔట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించాడు. గంభీర్ చెలరేగడంతో 230 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 39.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రతో హైదరాబాద్ తలపడనుంది. -
ఫైనల్లో యువ భారత్
జొహర్ బారు (మలేసియా): వరుసగా నాలుగో విజయంతో భారత యువ జట్టు సుల్తాన్ జొహర్ కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో సంచలన విజయం సాధించింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే అగ్రస్థానంలో నిలిచింది. ఆట మొదలైందో లేదో అప్పుడే ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది భారత్. ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ... ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. గుర్సాహిబ్జిత్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 4–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. హస్‌ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), మన్దీప్ మోర్ (14వ ని.), విష్ణుకాంత్ సింగ్ (15వ ని.), శిలానంద్ లక్రా (43వ ని.) తలా ఒక గోల్ చేశారు. రెండో క్వార్టర్లో భారత డిఫెన్స్ వైఫల్యంతో డామన్ స్టీఫెన్స్ (18వ ని.) ఆస్ట్రేలియాకు తొలి గోల్ అందించాడు. అతనే మళ్లీ 35వ, 59వ, 60వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసినా ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్... బ్రిటన్‌తో తలపడుతుంది. 13న ఫైనల్ జరుగుతుంది. -
6 గంటల 35 నిమిషాలు...
లండన్: కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని జాన్ ఇస్నెర్ (అమెరికా)... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)... ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. చివరకు అండర్సన్ గెలుపొందగా... ఓడినా జాన్ ఇస్నెర్ తన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. 6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ అండర్సన్ 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో తొమ్మిదో సీడ్ ఇస్నెర్‌పై గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడతాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు, ప్రతీ గేమ్‌కు కొదమ సింహాల్లా పోరాడారు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు క్లెమెంట్ (ఫ్రాన్స్), సాంతోరో (ఫ్రాన్స్) పేరిట (ఫ్రెంచ్ ఓపెన్–2004 తొలి రౌండ్; 6 గంటల 33 నిమిషాలు) ఉంది. ఇక టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ కూడా వింబుల్డన్‌లోనే నమోదైంది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది. ఆ మ్యాచ్‌లో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో గెలిచాడు. ప్రస్తుత సెమీస్‌లో ఇద్దరూ చెరో రెండో సెట్లు గెలిచాక నిర్ణాయక ఐదో సెట్లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని గెలిచాడు. -
సెమీస్‌లో సైనా, ప్రణయ్
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, మూడో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సైనా 21–15, 21–13తో లీ జాంగ్ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19–21, 10–21తో సుంగ్ జీ హున్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా సెమీస్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 23–21, 21–12తో ప్రపంచ రెండో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు. తద్వారా 2007లో అనూప్ శ్రీధర్ తర్వాత ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా ప్రణయ్ గుర్తింపు పొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 12–21, 15–21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సైనా; ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ తలపడతారు. ఈ మ్యాచ్‌లు ఉదయం 11.30 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. -
తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీఫైనల్లోకి