
భువనేశ్వర్: లీగ్ మ్యాచ్‌ల్లో నిలకడలేమి ఆటతో నిరాశపరిచిన భారత జట్టు నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం అద్భుతం చేసింది. హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియంతో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో గెలిచింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 3–3తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్‌లో భారత గోల్‌కీపర్ ఆకాశ్ చిక్టే బెల్జియం ఆటగాళ్లకు అడ్డుగోడలా నిలబడి జట్టును గెలిపించాడు.
షూటౌట్‌లో భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్, రూపిందర్, హర్మన్‌ప్రీత్ గోల్స్ చేయగా... బెల్జియం జట్టు తరఫున ఫ్లోరెంట్, ఆర్థర్ సఫలమయ్యారు. నిర్ణీత సమయంలో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (31వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (35వ ని.లో), రూపిందర్ పాల్ (46వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... బెల్జియం జట్టుకు లుపేర్ట్ (39వ, 46వ .లో) రెండు గోల్స్, కెయుస్టర్స్ (53వ ని.లో) ఒక గోల్ అందించారు.