
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా హాకీ చాంపి యన్స్ ట్రోఫీలో నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (19వ ని.లో), చింగ్లేన్‌సనా (44వ ని.లో), దిల్‌ప్రీత్‌సింగ్ (55వ ని.లో).... జపాన్ తరఫున వకురి (22వ ని.లో), జెన్‌దాన (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘షూటౌట్’లో 3–1తో మలేసియాను ఓడించింది. నేడు జరిగే టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గతంలో భారత్ 2011, 2016లలో ఫైనల్లో పాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.