సెమీఫైనల్లో పేస్‌ జోడీ | semifinal match the pace | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో పేస్‌ జోడీ

Published Fri, Mar 3 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

సెమీఫైనల్లో పేస్‌ జోడీ

సెమీఫైనల్లో పేస్‌ జోడీ

దుబాయ్‌: భారత అగ్రశ్రేణి డబుల్స్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పేస్‌–గార్షియల్‌ లోపెజ్‌ (స్పెయిన్‌) ద్వయం 7–6(3), 7–6(6) స్కోరుతో డానియెల్‌ నెస్టర్‌ (కెనడా)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌ గంటా 50 నిమిషాలపాటు సాగింది. సెమీ ఫైనల్లో బోపన్న –మార్సిన్‌ జోడీతో పేస్‌ జంట తలపడుతుంది.

ఫెడరర్‌కు షాక్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి జోరుమీదున్న రోజర్‌ ఫెడరర్‌కు ఇదే టోర్నీ సింగిల్స్‌ విభాగంలో షాక్‌ తగిలింది. రష్యన్‌ క్వాలిఫయర్‌ సంచలన ప్రదర్శనతో ఫెడరర్‌ను ఓడించాడు. రెండో రౌండ్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–7 (7/9), 6–7 (5/8)తో ప్రపంచ 116వ ర్యాంకర్‌ ఎవ్‌గెని డన్‌స్కొయ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement