లండన్: కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని జాన్ ఇస్నెర్ (అమెరికా)... కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)... ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. చివరకు అండర్సన్ గెలుపొందగా... ఓడినా జాన్ ఇస్నెర్ తన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. 6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ అండర్సన్ 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో తొమ్మిదో సీడ్ ఇస్నెర్‌పై గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడతాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు, ప్రతీ గేమ్‌కు కొదమ సింహాల్లా పోరాడారు.
ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు క్లెమెంట్ (ఫ్రాన్స్), సాంతోరో (ఫ్రాన్స్) పేరిట (ఫ్రెంచ్ ఓపెన్–2004 తొలి రౌండ్; 6 గంటల 33 నిమిషాలు) ఉంది. ఇక టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ కూడా వింబుల్డన్‌లోనే నమోదైంది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది. ఆ మ్యాచ్‌లో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో గెలిచాడు. ప్రస్తుత సెమీస్‌లో ఇద్దరూ చెరో రెండో సెట్‌లు గెలిచాక నిర్ణాయక ఐదో సెట్‌లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని గెలిచాడు.
6 గంటల 35 నిమిషాలు...
Published Sat, Jul 14 2018 1:20 AM | Last Updated on Sat, Jul 14 2018 1:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment