john
-
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్
స్టాక్ హోం: వైద్య శాస్త్రం మాదిరిగానే ఫిజిక్స్‌లో కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు ఇద్దరు సైంటిస్టులను వరించింది. మెషీన్ లెరి్నంగ్‌ను కొత్త పుంతలు తొక్కించి.. కృత్రిమ మేధ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్ నోబెల్‌ను ముగ్గురు సైంటిస్టులకు అందించడం తెలిసిందే. హింటన్.. ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ ఫాదర్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)గా ప్రసిద్ధుడు. కెనడా, బ్రిటన్ పౌరసత్వమున్న ఆయన టొరంటో వర్సిటీలో పని చేస్తున్నారు. హాప్‌ఫీల్డ్‌ది అమెరికా. ప్రిన్స్టన్ వర్సిటీలో పని చేస్తున్నారు. వారు రూపొందించి, అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తిమంతమైన మెషీన్ లెర్నింగ్‌కు పునాదులని నోబెల్ కమిటీ కొనియాడింది. ‘వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్స్ సహాయక మెమరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి.ఫేషియల్ రికగ్నిషన్ మొదలుకుని, యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి‘ అని ప్రశంసించింది. అయితే, ఈ సాంకేతిక ప్రగతి మన భవిష్యత్తుపై ఎన్నో సందేహాలను లేవనెత్తిందని అభిప్రాయపడింది. మానవాళికి మేలు జరిగేలా దీన్ని సురక్షిత, నైతిక పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ ఆందోళనలు సహేతుకమేనని హింటన్ తరచూ చెబుతుంటారు. వీటిపై మరింత స్వేచ్చగా మాట్లాడేందుకు వీలుగా ఆయన గూగుల్‌లో ఉన్నతోద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ నేపథ్యం దృష్ట్యా తనకు అత్యున్నత పురస్కారం రావడం నమ్మశక్యంగా లేదని చెప్పారాయన. మానవాళిని ఏఐ కనీవినీ ఎరగని రీతిలో ప్రభావితం చేయడం ఖాయమని ఆయన ఇప్పటికే జోస్యం చెప్పారు. దీన్ని ఏకంగా పారిశ్రామిక విప్లవంతో పోల్చారు. -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
నా మొగుడు ఏం చేసినా పర్లేదు.. అమ్మాయిలతో తిరిగినా నాకు కావాల్సింది అదే!
వాషింగ్టన్: భార్యాభర్తల బంధం అన్నింటికంటే దృఢమైంది అంటారు. పెళ్లయ్యాక పతియే తన సర్వస్వంగా భావిస్తుంటారు మహిళలు. ఒకరిపైఒకరు ప్రేమానురాగాలు చూపుతూ ఆనందంగా జీవిస్తారు. వైవాహిక బంధంలో నిజాయితీ, విధేయతతో ఉండాలనుకుంటారు. అలాంటిది తన భర్త మరో మహిళలో సన్నిహితంగా మెలిగితే? మరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటే? ఏ భార్య అయినా భరిస్తుందా? ఆమె కోపం ఎలా ఉంటుందో కూడా ఉహించుకోలేం.. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తన భర్తను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉండమని ఆమే ప్రోత్సహిస్తోంది. వాళ్లతో శారీరకంగా కలిసినా పర్వాలేదు అంటోంది. ఆయన ఎవరితో వెళ్లినా, ఏం చేసినా సరే.. సంతోషంగా ఉంటే చాలట. ఆయన హ్యాపీగా ఉంటే తనకు అదే చాలు అని ఆనందంగా చెబుతోంది. ఇది భార్యగా తన బాధ్యత అంటోంది. ఈ మాటలు విన్నాక ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి. ఈరోజుల్లో ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అని అనుకుంటారు కదా.. భర్తకు ఇంత ఫ్రీడం ఇచ్చి ఈమె పేరు మోనికా హల్ట్. వయసు 37 ఏళ్లు. భర్త పేరు జాన్. పెళ్లయ్యాక ఇంటికే పరిమితమైంది. రోజంతా ఇంటిపనులే చేస్తూ తీరకలేకుండా ఉంటోంది. జాన్‌కు ఇష్టమైన వంటలు చేసిపెట్టడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇతర పనులు చేసుకోవడమే ఈమె దినచర్య. అందుకే జాన్‌తో బయటకు వెళ్లే సమయం కూడా ఉండదు. ఈ కారణంగానే భర్తను ఇష్టమైన వారితో గడపమని ఆమే స్వయంగా చెబుతోంది. జాన్‌కు ఏదీ సంతోషం అయితే అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ప్రోత్సహిస్తోంది. అతను ఇతర మహిళలతో శృంగారంలో పాల్గొన్నా తాను అసలు బాధపడనని అంటోంది. అలాగే తాను రోజు ఏ దుస్తులు ధరించాలో కూడా భర్తే డిసైడ్ చేస్తాడని, ఆయన చెప్పింది తూచ తప్పకుండా పాటిస్తాని మోనికా పేర్కొంది. సెక్సీ, స్పోర్టీ డ్రస్సులంటే తన భర్తకు ఇష్టమని తాను ఇంట్లో అవే ధరిస్తానని వివరించింది. తాను మేకప్ వేసుకుంటే జాన్‌కు అస్సలు నచ్చదని, అందుకే నేచురల్‌గానే ఉంటానంటోంది. భర్తలు వేరే వాళ్లతో మాట్లాడితేనే ఊరుకోని మహిళలు ఉన్న ఈరోజుల్లో ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..! -
గోవా డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి జాన్ డిసౌజా అరెస్ట్
-
హాంకాంగ్ పాలకునిగా జాన్ లీ ఎన్నిక
హాంకాంగ్: హాంకాంగ్ పాలకునిగా చైనా అనుకూల జాన్ లీ ఆదివారం ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్ 1న కేరీ లామ్ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు. హాంకాంగ్ సెక్యూరిటీ చీఫ్‌గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్‌ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
తీపి కబురు
అభిమానులకు ప్రభాస్ ఓ తీపి కబురు చెప్పారు. తన తాజా చిత్రం ఫస్ట్ లుక్‌ను రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ‘ఓ డియర్’, ‘జాన్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు టైటిల్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నటుడు జాన్ ఆకస్మిక మరణం..
టాలీవుడ్ నటుడు, రచయిత జాన్ కొట్టోలీ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మంగళవారం మృతిచెందారు. మను, ఫలక్‌నుమా దాస్, సమ్మోహనం, రక్తం వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. మను చిత్రంలో నటనకు జాన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సైన్మా, మిస్టర్ అమాయకుడు, కళాకారుడు వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా జాన్ యాక్ట్ చేశారు. జాన్ మరణవార్తను దర్శకుడు సాయి రాజేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. జాన్ చాలా గొప్ప నటుడని.. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. జాన్ ఆకస్మిక మరణం దురదృష్టకరమని ప్రముఖ హీరో సుధీర్ బాబు అన్నారు. అతని నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సుధీర్ బాబు సంతాపం తెలిపారు. జాన్ మరణవార్త షాక్ గురిచేసినట్టు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా పేర్కొన్నారు. -
జాన్ నుంచి జాన్
‘సాహో’ రిలీజ్ తర్వాత బ్రేక్‌లో ఉన్నారు ప్రభాస్. జనవరి నుంచి మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతున్నారని తెలిసింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ‘సాహో’ చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ‘సాహో’ రిలీజ్ అప్పుడు ఈ సినిమా చిత్రీకరణకు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి పండగ తర్వాత తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. సో.. జాన్ (జనవరి) నుంచి ‘జాన్’తో ప్రభాస్ బిజీగా ఉంటారు. ఈ సినిమాకు సంబంధించిన ఆరు సెట్లను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పురాతన వాహనాల దొంగ పాత్రలో కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు అమితి త్రివేది సంగీత దర్శకుడు. -
జాన్‌కి అతిథి
‘జాన్’కి అతిథి కాబోతున్నారట కాజల్ అగర్వాల్. ప్రభాస్ హీరోగా ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. 1970 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అతిథి పాత్రలో నటించబోతున్నారని తాజా సమాచారం. ఇంతకుముందు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (2011) సినిమాలో ప్రభాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. తొలిసారి పోలీస్ పాత్రలో...? కెరీర్లో యాభై సినిమాల మైలురాయిని చేరుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు తెలుగులో పోలీస్ పాత్ర చేయలేదు. అయితే త్వరలో కాజల్ పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఓ కొరియన్ మూవీ తెలుగు రీమేక్‌లో ఆమె పోలీసాఫీసర్‌గా నటించబోతున్నారట. ఈ సినిమాకు హీరో రానా నిర్మాతగా వ్యహహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2017లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా, కాజల్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
బ్రేక్ తర్వాత జాన్
‘సాహో’ వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). 1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల నాలుగో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఎమోషన్, సెంటిమెంట్ అంశాలకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథను సిద్ధం చేశారట రాధాకృష్ణ. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. హాలిడేలో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ప్యారిస్‌లో ఉన్నారని తెలిసింది. -
నంబర్ 20
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్‌ల హడావిడి జోరుగా జరుగుతోంది. ప్లేయర్స్ అందరూ వారి వారి ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా కొందరు తారలు కెరీర్లో ట్వంటీ ట్వంటీ వెండితెర మ్యాచ్‌లకు రెడీ అవుతున్నారు. అదేనండీ.. కెరీర్ పరంగా ‘20’ నంబర్ని టచ్ చేసిన స్టార్స్ కొందరు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం. అటు క్లాసు... ఇటు మాసు ‘సాహో’ మ్యాచ్ కోసం మాస్ యాక్షన్ ప్లే ఆడుతున్న ప్రభాస్, ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) మ్యాచ్ కోసం క్లాస్ ప్లేయర్‌గా మారిపోయారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ కెరీర్లో 20వ సినిమా. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970 నేపథ్యంలోని ప్రేమకథ ఇది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇక సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. అదిరిపోయే స్ట్రాటజీ మూడు సినిమాలను లైన్లో పెట్టి...ఫామ్ కోల్పోలేదు బాసూ.. సూపర్ ఇన్నింగ్ ఆడేందుకు మంచి స్ట్రాటజీ రెడీ చేస్తున్నానంటూ చెప్పకనే చెప్పారు స్టైలిష్ బ్యాట్స్‌మెన్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న సినిమా శనివారం ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు అల్లు అర్జున్–త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నారు. ఇది అల్లుఅర్జున్ కెరీర్లో 20వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోగా నటించనున్నారు. షూటింగ్ ఈ ఏడాది సెకండాఫ్‌లో స్టార్ట్ కానుంది. ఇదే అల్లు అర్జున్ కెరీర్లో ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్ అవుతుంది. ఆ నెక్ట్స్ ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్: కనపడుటలేదు’ అనే సినిమా షూటింగ్లో పాల్గొంటారు అల్లు అర్జున్. ఇలా ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పుడు బిజీ బిజీగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కీర్తీ కా ఖేల్ ‘మహానటి’ సినిమాతో అమాంతం స్టార్ లేడీ బ్యాట్స్‌మెన్ జాబితాలో తన పేరును ఆడియన్స్ చేత రాయించుకున్నారు కీర్తీ సురేశ్. ప్రస్తుతం నరేంద్రనాథ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నారు కీర్తీ సురేశ్. ఇది ఆమె కెరీర్లో ఆడుతున్న ట్వంటీ.. ట్వంటీ మ్యాచ్. అదేనండీ.. ఆమె కెరీర్లో 20వ సినిమా అని చెబుతున్నాం. ఇందులో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా, కమల్ కామరాజు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ టీమ్ త్వరలో ఫారిన్ షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాదే కీర్తీ బాలీవుడ్ గ్రౌండ్లో తొలి మ్యాచ్ ఆడటానికి రెడీ అవుతున్నారు. పుట్‌బాల్ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందనున్న సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఇందులో సయ్యద్ పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తారు. ఒకప్పుటి స్టార్స్ కెరీర్ ఆరంభించిన రెండు మూడేళ్లకే 20 నంబర్ని టచ్ చేసేవారు. ఇప్పుడు ఆ నంబర్ చేరాలంటే ఏళ్లు పడుతోంది. ఒకప్పటిలా ‘సెంచరీ’ అనేది ఇప్పుడు కలగానే మిగిలిపోయే పరిస్థితి ఉంది. అయితే ‘హాఫ్ సెంచరీ’ కష్టం కాదు. 20 అడుగులేశారు. ఇంకో 30 అడుగులు వీజీగా వేసేస్తారు. -
మళ్లీ పనిలో పడ్డా
న్యూ ఇయర్ బ్రేక్‌ను పూర్తి చేసి మళ్లీ షూటింగ్స్ బిజీలో పడిపోయారు పూజా హెగ్డే. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం ఈ బ్యూటీ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు పనికి ఫుల్స్టాప్ పెట్టి హాలిడేస్‌ను ఎంజాయ్ చేశారు. హాలీవుడ్, హ్యారీపోటర్ షూటింగ్ చేసిన ప్రదేశాలన్నీ చుట్టేశారు. రీసెంట్గా హాలిడేస్‌ను పూర్తి చేసిన పూజ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్‌తో చేస్తోన్న లవ్‌స్టోరీ సెట్లో జాయిన్ అయ్యారామె. ‘‘లాంగ్ హాలిడే తర్వాత ఈ ఏడాది మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. హాలిడే మూడ్ వదిలేసి మళ్లీ పనిలో పడ్డా’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 1920ల కాలంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరుపుకోనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది. -
ప్రభాస్‌లా ఉన్నావన్నారు
హారర్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రం ‘అదృశ్యం’. జాన్ హీరోగా, ప్రియాంక, హర్షద, తేజారెడ్డి, జయవాణి హీరోయిన్లుగా నటించారు. రవిప్రకాష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత రవిప్రకాష్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్ కె.విశ్వనాథ్‌గారి దగ్గర మొదలైంది. తర్వాత సింగీతం శ్రీనివాస్‌గారి దగ్గర 14 సినిమాలు పని చేశా. వాళ్ల దగ్గర పని చేయడం నా అదృష్టం. నేను రూపొందించిన ‘బంటీ ది బ్యాడ్‌బాయ్’కు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘అదృశ్యం’ ఒక థ్రిల్లర్. టీమ్ అందరి కృషి వల్లే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఇది నా 3వ సినిమా. విశ్వనాథ్‌గారు నన్ను ప్రభాస్‌లా ఉన్నావు అన్నారు. మా సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు జాన్. ఈ చిత్రానికి సంగీతం : ఆల్డ్రిన్, కెమెరా: రామ్ పినిశెట్టి. -
ఎవరీ మిల్మన్?
యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఎనిమిది మందిలో 29 ఏళ్ల జాన్ మిల్మన్ ఒక్కడే అన్‌సీడెడ్. కెరీర్లో ఒక్కసారి కూడా టాప్–10 ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్లని ఓడించలేకపోయిన మిల్మన్ ఈసారి ఏకంగా ఫెడరర్‌నే ఇంటిదారి పట్టించాడు. వింబుల్డన్‌కు ముందు కొన్ని నెలల పాటు ఫెడెక్స్ ఆహ్వానంపైనే స్విట్జర్లాండ్‌కు వెళ్లి అతనికి ప్రాక్టీస్ పార్ట్నర్గా మిల్మన్ కలిసి ఆడటం విశేషం. ఇప్పటి వరకు ఒక్క ఏటీపీ టైటిల్ కూడా నెగ్గని అతనికి గత ఏప్రిల్‌లో హంగేరి ఓపెన్ ఫైనల్ చేరడమే సర్క్యూట్లో అత్యుత్తమ ప్రదర్శన. కెరీర్లో ఎక్కువ భాగం గాయాలతోనే ఇబ్బంది పడ్డాడు. 2013లో భుజానికి పెద్ద శస్త్రచికిత్స జరగడంతో తర్వాతి ఏడాది ర్యాంకుల్లో 1,193కి పడిపోయాడు. ఆ తర్వాత నిలకడగా రాణిస్తున్న దశలో తుంటి గాయానికి మరో సర్జరీ జరిగింది. ఈ దశలో ఆటనుంచి దాదాపుగా తప్పుకోవాలని నిర్ణయించుకున్న అతను ఒక ఆఫీసులో 9–5 ఉద్యోగంలో కూడా చేరిపోయాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా ఆ సమయంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్నాడు. అయితే పోరాటం విడవకుండా మళ్లీ ఆటలోకి అడుగు పెట్టాడు. అతని స్వస్థలం బ్రిస్బేన్. ఐదుగురు సభ్యుల కుటుంబంలో మిగతా నలుగురు అమ్మాయిలే. ఏడాది క్రితం 235వ ర్యాంక్‌లో ఉన్న మిల్మన్ ఇప్పుడు మరో సంచలనంపై దృష్టి పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో మిల్మన్ మరో దిగ్గజం జొకోవిచ్‌తో తలపడనున్నాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వచ్చే సోమవారం అతను కెరీర్లో అత్యుత్తమంగా 37వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. కనీసం 6 లక్షల 60 వేల డాలర్లు (దాదాపు రూ. 4 కోట్ల 72 లక్షలు) అతని ఖాతాలో చేరుతాయి. నా విజయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఫెడరర్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. నా హీరో అతను. ఈ రోజు అతనిది కాకపోవచ్చు. అంతే! కానీ అలాంటి అవకాశం నాకు కలిసొచ్చింది. దానిని ఒడిసి పట్టుకున్నాను. ఈ క్షణాన్ని చిరకాలం గుర్తుంచుకుంటాను. – జాన్ మిల్మన్ ఈ రాత్రి చాలా చాలా వేడిగా ఉంది. కొన్ని సార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా నాకు కష్టంగా అనిపించింది. అందుకే చాలా శ్రమించాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ ఉక్కపోత ఉండే బ్రిస్బేన్నుంచి రావడం వల్ల కావచ్చు మిల్మన్కు సమస్య కాలేదు. నాకు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ఉదయం పూట నేను ఆడాను. కొన్నిసార్లు మన శరీరం సహకరించకపోవచ్చు. మ్యాచ్ ముగిసినందుకు ఒకింత సంతోషించాను కూడా. మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. రెండో సెట్ కూడా గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. జాన్ చాలా అద్భుతంగా ఆడాడు. – రోజర్ ఫెడరర్ -
6 గంటల 35 నిమిషాలు...
లండన్: కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని జాన్ ఇస్నెర్ (అమెరికా)... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవాలని కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)... ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. చివరకు అండర్సన్ గెలుపొందగా... ఓడినా జాన్ ఇస్నెర్ తన పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. 6 గంటల 35 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ అండర్సన్ 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో తొమ్మిదో సీడ్ ఇస్నెర్‌పై గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నాదల్ (స్పెయిన్), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అండర్సన్ తలపడతాడు. మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణం నుంచి చివరి క్షణం వరకూ ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు, ప్రతీ గేమ్‌కు కొదమ సింహాల్లా పోరాడారు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు క్లెమెంట్ (ఫ్రాన్స్), సాంతోరో (ఫ్రాన్స్) పేరిట (ఫ్రెంచ్ ఓపెన్–2004 తొలి రౌండ్; 6 గంటల 33 నిమిషాలు) ఉంది. ఇక టెన్నిస్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ కూడా వింబుల్డన్‌లోనే నమోదైంది. 2010 టోర్నీలో జాన్ ఇస్నెర్, మహుత్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ఏకంగా 11 గంటల 5 నిమిషాలు సాగింది. ఆ మ్యాచ్‌లో ఇస్నెర్ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో గెలిచాడు. ప్రస్తుత సెమీస్‌లో ఇద్దరూ చెరో రెండో సెట్లు గెలిచాక నిర్ణాయక ఐదో సెట్లో ఎవరూ వెనక్కి తగ్గకుండా ఆడటంతో ఎలాంటి బ్రేక్ పాయింట్లు లేకుండా సెట్ సాగుతూపోయింది. చివరకు 49వ గేమ్‌లో ఇస్నెర్ సర్వీస్‌లో అండర్సన్ బ్రేక్ పాయింట్ సంపాదించి, తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని గెలిచాడు. -
ప్రాణాలు కాపాడుకునేందుకు...
కష్టాలు ఎదురైనప్పుడే మనలోని శక్తిసామర్థ్యాలు బయటకొస్తాయనే విషయాన్ని పెద్దలు చెబుతారు. జాన్ క్రెయిగ్ విషయంలోనూ అదే జరిగింది. అసలు సంగతేంటంటే... ఆస్ట్రేలియా కు చెందిన డ్రైవర్ ఓ చిన్న బోటును తీసుకొని సముద్రంలోకి వెళ్లాడు. అలా కొంతదూరం వెళ్లాక ఆ బోటు ఆగిపోయింది. అసలేం జరిగిందో చూద్దామని తలను నీళ్లలో ముంచి బోటు అడుగు భాగాన్ని పరిశీలిస్తున్నాడు. అంతలోనే దాదాపు 13 అడుగులున్న ఓ షార్క్ తనవైపు రావడాన్ని జాన్ గమనించాడు. అక్కడే ఉంటే దానికి బ్రేక్‌ఫాస్ట్ అయిపోవడం ఖాయమనుకున్నాడు. వెంటనే నీళ్లలోకి దూకి.. స్విమ్ చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూస్తే షార్క్ తనను వెంబడించడాన్ని గమనించాడు. దీంతో మరింత వేగంగా స్విమ్ చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అలా దాదాపు నాలుగు నాటికల్ మైళ్లు ఈదుకుంటూ వెళ్లిపోయాడు. హమ్మయ్య.. ప్రాణాలతో బయటపడ్డాననుకొని ఊపిరి పీల్చుకునేలోపే షార్క్ అతనికి నాలుగైదడుగుల దూరంలో దర్శనమిచ్చింది. ఇక అదే తన చివరిరోజు అనుకొని, జేబులో నుంచి స్ప్రే గన్ బయటకు తీసి, వెనక్కు కాలుస్తూ ముందుకు స్విమ్ చేయడం కొనసాగించాడు. అలా ఓ గుర్తుతెలియని ద్వీపం చేరుకొని, అక్కడి నుంచి ఇతరుల సాయంతో మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని ఎవరికి చెప్పినా నమ్మరని, అయితే తాను మాత్రం ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు జాన్. -
మనమడిగింది కాదు...దేవుడిచ్చేదే ఆశీర్వాదం!
యేసుక్రీస్తు శిష్యుల్లోని యాకోబు, యోహానుల తల్లి ఒకసారి ప్రభువును కలుసుకొని నా కుమారులిద్దరినీ నీ రాజ్యంలో నీ కుడి ఎడమ పక్కన కూర్చోబెట్టుకోమని అర్థించింది. తాను పొందిన శ్రమలన్నీ వాళ్లు కూడా పొందాలనడానికి సాదృశ్యంగా, నేను తాగిన గిన్నెలోది వారు తాగగలరా? అని ప్రభువు ప్రశ్నించి, ఆమె అభ్యర్థన తన తండ్రి వశంలోనిది తప్ప తన వశంలోనిది కాదని జవాబిచ్చాడు. ప్రతి విశ్వాసి పట్లా దేవునికి అత్యంత నిర్దిష్టమైన సంకల్పాలున్నాయి. దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసే పరిణామాలే విశ్వాసి జీవితంలో సంభవిస్తుంటాయి. తన రాజ్యంలో యాకోబు, యోహానుల స్థానమేమిటో దేవుడు నిశ్చయించాడు. అందువల్ల ఆ విషయంలో దేవుని సంకల్పమే నెరవేరుతుంది తప్ప, వారి తల్లి ప్రార్థన ఫలించదు. యేసుకు కుడి ఎడమల స్థానాల్లో కూర్చోవడం గొప్ప విషయమనుకుంటుంది వారి తల్లి. కాని అంతకన్నా ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన స్థానాలను దేవుడు వారికివ్వదలచుకున్నాడు (మత్త 21–24). ఎంతో లోతైన, మర్మయుక్తమైన భావాలున్న సంఘటన ఇది. అదే మత్తయి సువార్తలో ‘అడగండి మీకిస్తాను’ అన్నాడు యేసు (మత్తయి 7:7). ఇప్పుడేమో నీవడిగింది నేనివ్వలేనంటున్నాడు ఆ శిష్యుల తల్లితో యేసు. దేవుడు ఏదడిగినా ఇస్తాడు. ఆయన్నడగటం మన హక్కు, మనం పిల్లలం గనక మనమేదడిగితే అదివ్వవలసిన బాధ్యత దేవునిది అన్న ధోరణిలో సాగుతున్న కొందరి ప్రసంగాలు ఈనాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సువార్త సంపదలు సాధించి పెట్టే సాధనమన్నది వారి సిద్ధాంతం (ప్రాస్పరిటీ గాస్పెల్). బైబిలులోని కొన్ని వాక్యాలను వాటి నేపథ్యం నుండి విడదీసి వాటికి చెప్పే వక్రభాష్యం వల్ల వచ్చే చిక్కు ఇది. విశ్వాసి ప్రార్థనలు దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసేవిగా ఉంటే ఆయన అవి తప్పక ఆలకిస్తాడు. ఎందుకంటే, విశ్వాసికి అత్యంత శ్రేష్టమైన, పర సంబంధమైన వరాలనివ్వాలని ఆశిస్తాడు (యాకోబు 1:17). తాను అత్యుత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, విశ్వాసి అంతకన్నా తక్కువది ఆశించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన తప్పక విఫలమవుతుంది. మనం దుర్బుద్ధితో అడిగినా, అజ్ఞానం వల్ల శ్రేష్టమైనవి కానివి అడిగినా దేవుడివ్వడానికి ఇష్టపడడు. మన జీవితాల్లో చాలా ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణం అదే. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఫలించని ఆ ప్రార్థనల వల్ల కురిసిన ఆశీర్వాదాలూ అర్థమవుతాయి. మనమడిగింది ఇవ్వాలా వద్దా అన్న దేవుని ‘విచక్షణ’ వెనుక మన క్షేమం, దేవుని ఆశీర్వాదం ఉంటాయి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
చత్తీస్‌గఢ్‌లో అమెరికా వాసి అదృశ్యం
హైదరాబాద్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అమెరికా పౌరుడు కనిపించకుండాపోయాడు. ఇమిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్, కెనడా(ఐఆర్సీసీ)కు చెందిన అమెరికా పౌరుడు జాన్ ఈ నెల 14వ తేదీన ముంబై నుంచి బైక్‌పై చత్తీస్‌గఢ్‌కు ప్రయాణం ప్రారంభించాడు. సాయంత్రానికి సుక్మా జిల్లా సింగమడుగు గ్రామ సమీపంలో వద్ద కనిపించకుండాపోయాడు. మావోయిస్టులు పట్టుకలిగిన జిల్లా కావడంతో జాన్‌ను మావోయిస్టులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జాన్‌కు సంబంధించిన వివరాలను ముంబైలోని ఆయన ట్రావెల్ ఏజెంట్ వద్ద నుంచి సేకరిస్తున్నారు. అయితే, జాన్ అపహరణపై పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. -
క్రియలు లేని విశ్వాసం మృతం
దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). నీకిష్టమైతే నన్ను బాగుచేయమంటూ ఒక కుష్ఠురోగి యేసుక్రీస్తును ప్రాధేయపడ్డాడు. దానికిష్టమేనంటూ ప్రభువతన్ని బాగుచేశాడు. ఎన్నో ఏళ్ల అతని శాపగ్రస్థమైన జీవితానికి దేవుని కృపవల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది. అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభువు జారీ చేశాడు. ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కానీ సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపర్చుకొని మోషే నియమించిన కానుక చెల్లించు’ అన్నాడు యేసుప్రభువు (మత్తయి 8:1-4). దేవుని అద్భుతాన్ని చవిచూసినవాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో యేసు తెలిపిన ఉదంతమిది. దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకోవాలనుకోవడం సహజమే! కాని ఆ ‘కృతజ్ఞతాభావం’ విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెల్లడి కావాలన్నది ప్రభువు మాటల తాత్పర్యం. కుష్ఠురోగం అంతకాలంగా అతన్ని లోకానికి, దేవునికి కూడా దూరంగా ఉంచింది. కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్లి, యాజకునికి కనబర్చుకొని దేవుని ఆరాధించాలి. ఆ తర్వాతే సమాజంలోకి వెళ్లాలి. దేవుడు అద్భుతం చేసి గండం గట్టెక్కించే వరకూ దేవుని ప్రాధేయపడటం, ఉపవాస ప్రార్థనలు చేయడం షరా మామూలే! అద్భుతం జరిగి గండం గడిచాక దేవుని మాటల్లో స్తుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకపోవడం విషాదకరం. మార్పు లేకుండా జీవించే వాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు. మన పెదాలు దేవుని స్తుతిస్తుంటే, మన జీవితం నిండా దైవవ్యతిరేకత అనే దుర్గంధముంటే, అది దేవునికెంత అవమానకరం? జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత! మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో టన్నులకొద్దీ కుమ్మరిస్తున్నాం కానీ చేతల్లో అణుమాత్రం కూడా చూపడం లేదు. దేవుని పట్ల కృతజ్ఞతతో మనం మారితే ఆ మార్పును లోకం స్తుతిస్తుంది. ఆ పెనుమార్పుకు కారణమేమిటో, దేవుడు చేసిన అద్భుతమేంటో దేవుడెవరో అలా మనం చెప్పకుండానే లోకం తెలుసుకుంటుంది. అందుకే ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు’ అన్నది ప్రభువు అతనికిచ్చిన ఆజ్ఞ. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపర్చబడతాడన్నాడొకసారి యేసుప్రభువు (యోహాను 15:8). చెట్టెప్పుడూ తన గొప్పదనాన్ని చెప్పుకోదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు. లోకానికి తియ్యటి తన ఫలాలనిస్తుందంతే! దేవునికోసం ఫలించడమంటే లోక కల్యాణార్థం, దీనుల సహాయార్థం మౌనంగా సత్కార్యాలు చేయడమే! తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజంగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి, తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు. దేవునికోసం నేనేం మాట్లాడాలి? అని కాక దేవుని పేరిట దీనులకోసం నేనేం చేయాలి? అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరం రగిలిపోవాలి. అయితే దేవునికోసం ఏదైనా చేయమని హృదయం చెబుతుంటే, అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంటుంది. సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది. మండుటెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్లిచ్చినా అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభువు (మత్తయి 10:42). ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనమిచ్చే గిన్నెడు చల్లనీళ్లే, సముద్రమంత దేవుని ప్రేమను పరిచయం చేస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
మరో యువకుడితో పబ్‌కి వెళ్లిందని...
తిరువొత్తియూరు: ప్రియురాలిని కత్తితో గాయపరచిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పల్లవం తాంగల్ భక్తవశ్చలం నగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ యువకుడు జాన్ (19). ఇతను చెన్నైలోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. ఇలాగే ఫరంగిమలైకు చెందిన సోబియా (18) అదే కళాశాలలో చదువుతోంది. వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోబియా మరో యువకుడితో పబ్‌కు వెళ్లి నృత్యం చేసినట్టు తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న జాన్ సోబియా ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. స్నేహితుడు అని అతనితో నృత్యం చేశానని సోబియా తెలిపింది. దీంతో ఆగ్రహం చెందిన జాన్ కత్తితో పొడుస్తానని బెదిరిస్తుండగా దీన్ని అడ్డుకున్న సమయంలో సోబియాకు మెడపై కత్తి తగిలి గాయమైంది. ఇది చూసిన బంధువులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫరంగిమలై పోలీసు నిలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి జాన్‌ను అరెస్టు చేశారు. -
శవాలకు పూసిన పూలు!
ఫొటో స్టోరీ ప్రముఖ ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్... 1993లో ఓసారి కంబోడియా వెళ్లారు. అక్కడ ఆయనను ఓ దృశ్యం ఆకర్షించింది. ఓ పేద అమ్మాయి... ఒక కొలనులో దిగి, కలువ పూలను ఏరుకుంటోంది. పువ్వును కోసిన ప్రతిసారీ ఆ చిన్నారి ముఖం సంతోషంతో విచ్చుకుంటోంది. అది చూసి ముచ్చటపడిన ఐజక్... ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ ఫొటో వెనుక... పెద్ద కథే ఉంది! కలువపూలతో కళకళలాడుతోన్న ఈ కొలను... కేవలం కొలను కాదు. ఓ పెద్ద శ్మశానవాటిక! అవును. హింస, భయానక వ్యాధులు, ఆకలి మంటల కారణంగా కంబోడియాలో ఎప్పుడూ మృత్యుదేవత స్వైరవిహారం చేస్తూనే ఉంటుంది. ఎందరినో కర్కశంగా కబళిస్తూ ఉంటుంది. వాళ్లందరికీ అంత్యక్రియలు చేయడం పెద్ద పని. కాబట్టి ఆ మృతదేహాలను తీసుకెళ్లి కొలనుల్లో పారేస్తుంటారు. అలాంటి కొలనుల్లో ఇదీ ఒకటి. పైకి పూల అందాలతో అలరిస్తోన్నా... అడుగున శవాల గుట్టలను తనలో దాచుకుందీ కొలను. అది తెలియని ఈ చిట్టితల్లి... చక్కగా కొలనులోకి దిగి, ఆనందంగా కలువపూలను రోజూ కోసుకుంటుంది. వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటుంది. పాపం తనకి మాత్రం ఏం తెలుసు... ఆ పూలు కొన్ని వందల విగత జీవుల మీద వికసించాయని, కొన్ని అభాగ్య జీవితాల ఆనవాళ్లను తమలో దాచుకున్నాయని! -
ముంచెత్తిన మునేరు
ఒక్కసారిగా వచ్చిపడ్డ వరద నీరు లంకల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు, 38 గొర్రెలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు మునేరు గేట్లు ఎత్తివేత నందిగామ రూరల్/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి : తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ కృష్ణలోని మునేరు వాగు ఉగ్రరూపం దాల్చి లంకలను ముంచెత్తింది. శనివారం ఉదయం ఒక్కసారిగా వచ్చి పడిన వరద నీరు సమీప ప్రాంత వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నందిగామ మండలం రాఘవాపురం సమీపంలో మునేటి మధ్యలోనున్న లంకలో చిక్కుకుపోయిన ముగ్గురు గొర్రెల కాపర్లు, 38 గొర్రెలను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు తీసు కొచ్చారు. అలాగే పశువులను మేపడానికి వెళ్లి లంకలో చిక్కుకున్న కంచికచర్ల మండలంలోని మోగులూరుకు చెందిన దున్నా జాన్ అనే వ్యక్తిని స్థానిక అధికారులు నాటుపడవ సాయంతో రక్షించారు. వరద ప్రవాహానికి పెనుగంచి ప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద మునేరులో వ్యాపారులు వేసుకున్న పాకలు కొట్టుకుపోయాయి. మునేరు కాజ్వే వద్ద వరద నీరు దాదాపు 8 అడుగుల పైన ప్రవహిస్తోంది. వరదనీరు ఎక్కువ కావడంతో వత్సవాయి మండల పరిధిలో ఉన్న మునేరు కాలువ గేట్లను ఎత్తివేశారు. గొర్రెల కాపర్లు సురక్షితం... నందిగామ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మంచ్యాల వెంకటేశ్వరరావు, మంచ్యాల పవన్, యరగొర్ల శ్రీను తెల్లవారు జామున 4.40గంటలకు 38 గొర్రెలు, మేకలు వాటి పిల్లలను నందిగామలో జరిగే సంతలో విక్రయించేందుకు మునేటి మార్గం ద్వారా కాలినడకన బయల్దేరారు. మునేటిలో కొంత దూరం వచ్చిన తరువాత ఒకేసారి సుమారు 5అడుగుల ఎత్తున మునేరుకు వరద నీరు వచ్చింది. దీంతో వారు సమీపంలోని లంక వద్దకు చేరుకుని బంధువులకు సమాచారమిచ్చారు. స్థానిక అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు డీఎస్పీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది సహాయంతో ఎయిర్‌బోట్ ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకు రాగలిగారు. అయితే మునేరులో వరదనీరు తాగడం వల్ల 38 గొర్రెలలో రెండు మృతి చెందాయి. కాగా మునేరుకు వరద నీటిని కాలువలకు వదలడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, కూలీలు పొలాల బాట పట్టారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు, సీఐ భాస్కరరావు, ఎస్ఐ ఏసుబాబు, ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సహాయక చర్యలు పూర్తయ్యేంతవరకు మునేటి వద్దే ఉండి పర్యవేక్షించారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సందర్శన... రాఘవాపురం సమీపంలో మునేటి లంక వద్ద వరద నీటిలో గొర్రెలు, మేకలతో పాటు వాటి యజమానులు చిక్కుకున్నారనే సమాచారం తెలియగానే వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు రాఘవాపురం గ్రామానికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలికి బలమైన గాయాలైనప్పటికీ ఆపదలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు చాలా సేపు మునేటి వద్దే ఉండిపోయారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పెసరమల్లి సురేష్, మంచ్యాల చంద్రశేఖర్, రామకృష్ణ, పరిమికిషోర్ ఉన్నారు. -
అమ్మల వేదన.. అరణ్య రోదన
నరసరావుపేటటౌన్ : బిడ్డల జాడ తెలియక ఆ తల్లులు తల్లడిల్లిపోతున్నారు. నవమాసాలు మోసి కన్న చిన్నారులు అపహరణకు గురికావడం వారికి గుండెకోత మిగిల్చింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డల కోసం ఆ తల్లులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పిల్లల అదృశ్యంపై నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నమోదైన రెండు కేసుల విషయంలో నేటికీ ప్రగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వారం రోజుల వయసు పసికందు అపహరణకు గురై 16 నెలలు గడిచింది. వారం కిందట ఎనిమిదేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ రెండు కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ చిన్నారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన గల్లా శారమ్మ, మరియబాబు దంపతులు వారం రోజుల పసికందుతో గతేడాది ఏప్రిల్ 15వ తేదీన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో జననీ సురక్ష యోజన కింద బాలింతలకు ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయల ఆర్థిక సాయం పొందేందుకు వచ్చారు. అక్కడ ఓ మహిళ చెప్పిన మాయమాటలకు మోసపోయారు. తమ బిడ్డను చూస్తూ ఉండమని అప్పగించడంతో ఆమె ఆ బిడ్డతో పరారైంది. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు అపహరణకు గురైన పాప కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. సంఘటన జరిగినప్పటి నుంచి అనేక మార్లు శారమ్మ దంపతులు పోలీస్‌స్టేషన్ వద్దకు రావడం, అయ్యా మా పాప ఆచూకీ లభించిందా.. అంటూ అధికారులను వేడుకోవడం, వారు చెప్పే సమాధానం విని తిరిగి నిరాశతో స్వగ్రామానికి చేరుకోవడం అలవాటైపోయింది. ఆడుకుంటున్న బాలుడి అపహరణ.. తాజాగా వారం రోజుల కిందట ఎన్జీవో కాలనీకి చెందిన గారపాటి జోసఫ్, మేరీల కుమారుడు ఎనిమిదేళ్ల జాన్ ఇంటి సమీపంలో ఆరుబయట ఆడుకుంటుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆ తర్వాత రోజు ఆగంతకులు ఫోన్ చేసి ‘మీ బిడ్డను కిడ్నాప్ చేశాం. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తాం..’ అంటూ కుటుంబసభ్యులకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. దీంతో జాన్ నాయనమ్మ సుశీల టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ పట్టణంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కిడ్నాప్ కేసుపై సమీక్ష నిర్వహించారు. కేసు ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గతంలో కిడ్నాప్ కేసుల్లో ఉన్న నిందితులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయినప్పటికీ చిన్న క్లూ కూడా దొరకకపోవడం విశేషం. జాన్ కుటుంబ సభ్యులు మాత్రం రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్దనే ఉంటూ తమ బిడ్డ కోసం పోలీసు అధికారులను అడుగుతూ కనిపిస్తున్నారు. మీ బిడ్డ ఆచూకీఏమైనా దొరికిందా అంటూ ఎవరైనా అడిగితే వారు కన్నీరుమున్నీరవుతున్నారు. మిస్టరీగా మారిన రెండు కిడ్నాప్ కేసుల్లో ఎలాంటి పురోగతి లభిస్తుందో వేచి చూడాల్సి ఉంది.