కష్టాలు ఎదురైనప్పుడే మనలోని శక్తిసామర్థ్యాలు బయటకొస్తాయనే విషయాన్ని పెద్దలు చెబుతారు. జాన్ క్రెయిగ్ విషయంలోనూ అదే జరిగింది. అసలు సంగతేంటంటే... ఆస్ట్రేలియా కు చెందిన డ్రైవర్ ఓ చిన్న బోటును తీసుకొని సముద్రంలోకి వెళ్లాడు. అలా కొంతదూరం వెళ్లాక ఆ బోటు ఆగిపోయింది. అసలేం జరిగిందో చూద్దామని తలను నీళ్లలో ముంచి బోటు అడుగు భాగాన్ని పరిశీలిస్తున్నాడు.
అంతలోనే దాదాపు 13 అడుగులున్న ఓ షార్క్ తనవైపు రావడాన్ని జాన్ గమనించాడు. అక్కడే ఉంటే దానికి బ్రేక్‌ఫాస్ట్ అయిపోవడం ఖాయమనుకున్నాడు. వెంటనే నీళ్లలోకి దూకి.. స్విమ్ చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూస్తే షార్క్ తనను వెంబడించడాన్ని గమనించాడు. దీంతో మరింత వేగంగా స్విమ్ చేస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు.
అలా దాదాపు నాలుగు నాటికల్ మైళ్లు ఈదుకుంటూ వెళ్లిపోయాడు. హమ్మయ్య.. ప్రాణాలతో బయటపడ్డాననుకొని ఊపిరి పీల్చుకునేలోపే షార్క్ అతనికి నాలుగైదడుగుల దూరంలో దర్శనమిచ్చింది. ఇక అదే తన చివరిరోజు అనుకొని, జేబులో నుంచి స్ప్రే గన్ బయటకు తీసి, వెనక్కు కాలుస్తూ ముందుకు స్విమ్ చేయడం కొనసాగించాడు.
అలా ఓ గుర్తుతెలియని ద్వీపం చేరుకొని, అక్కడి నుంచి ఇతరుల సాయంతో మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని ఎవరికి చెప్పినా నమ్మరని, అయితే తాను మాత్రం ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు జాన్.
Comments
Please login to add a commentAdd a comment