సలార్‌ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్‌ పోస్ట్‌ వైరల్! | Chinmayi shares screenshots of Actor John Vijay accused of misconduct With Women | Sakshi
Sakshi News home page

Chinmayi: సలార్‌ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్‌ ట్వీట్‌!

Published Fri, Jul 26 2024 8:24 PM | Last Updated on Fri, Jul 26 2024 8:39 PM

 Chinmayi shares screenshots of Actor John Vijay accused of misconduct With Women

సింగర్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.

తాజాగా నటుడు జాన్‌ విజయ్‌ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్  మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్‌ఫైర్‌' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్‌ నటించిన సలార్‌ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement