జాన్‌కి అతిథి | Kajal Aggarwal Guest role in Prabhas New Film | Sakshi
Sakshi News home page

జాన్‌కి అతిథి

Dec 3 2019 12:11 AM | Updated on Dec 3 2019 12:11 AM

Kajal Aggarwal Guest role in Prabhas New Film - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

‘జాన్‌’కి అతిథి కాబోతున్నారట కాజల్‌ అగర్వాల్‌. ప్రభాస్‌ హీరోగా ఎస్‌. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. 1970 పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ అతిథి పాత్రలో నటించబోతున్నారని తాజా సమాచారం. ఇంతకుముందు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ (2011) సినిమాలో ప్రభాస్, కాజల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

తొలిసారి పోలీస్‌ పాత్రలో...? కెరీర్‌లో యాభై సినిమాల మైలురాయిని చేరుకున్న కాజల్‌ అగర్వాల్‌ ఇప్పటివరకు తెలుగులో పోలీస్‌ పాత్ర చేయలేదు. అయితే త్వరలో కాజల్‌ పోలీసాఫీసర్‌గా చార్జ్‌ తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓ కొరియన్‌ మూవీ తెలుగు రీమేక్‌లో ఆమె పోలీసాఫీసర్‌గా నటించబోతున్నారట. ఈ సినిమాకు హీరో రానా నిర్మాతగా వ్యహహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 2017లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో రానా, కాజల్‌ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement