సెరెనా మళ్లీ సెమీస్‌లోనే...
మోకాలి గాయంతో బాధపడుతూనే సెమీఫైనల్లో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్‌కు ప్లిస్కోవా ‘చెక్’ పెట్టింది. దాంతో వరుసగా రెండో ఏడాది సెరెనా యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఓడిపోయింది. సెరెనా ఫిట్‌నెస్ సరిగ్గా లేదని తెలుసుకున్న ప్లిస్కోవా వ్యూహాత్మకంగా ఆడుతూ తన కెరీర్‌లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి సెట్‌లో సెరెనా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన ప్లిస్కోవా అదే జోరులో కేవలం 26 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో ఇద్దరూ ప్రతి పారుుంట్‌కు పోరాడినా తుదకు టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేరుు సాధించింది.
ఏడు ఏస్‌లు సంధించిన ప్లిస్కోవా 19 విన్నర్స్ కొట్టింది. సెరెనా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. ‘సెరెనాను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరానంటే నమ్మశక్యంగా లేదు. నా సహజశైలిలో ఆడితే ఎవరిపైనైనా గెలిచే సత్తా ఉందని తెలుసు’ అని ప్లిస్కోవా వ్యాఖ్యానించింది.
22 టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్‌స (1975లో) ప్రవేశపెట్టిన తర్వాత నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న 22వ క్రీడాకారిణిగా కెర్బర్ గుర్తింపు పొందనుంది.
19 మహిళల సింగిల్స్‌లో టాప్ ర్యాంక్ పొందనున్న రెండో జర్మనీ ప్లేయర్‌గా కెర్బర్ నిలువనుంది. జర్మనీ తరఫున చివరిసారి 1997లో స్టెఫీ గ్రాఫ్ ఈ గౌరవం దక్కించుకుంది.
1 పెద్ద వయస్సులో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ పొందనున్న క్రీడాకారిణిగా కెర్బర్ (28 ఏళ్లు) గుర్తింపు పొందనుంది. ఇప్పటిదాకా అమెరికా అమ్మారుు జెన్నిఫర్ కాప్రియాటి (25 ఏళ్ల 200 రోజులు-2001 అక్టోబరులో) పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలు కానుంది.
2 స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న రెండో జర్మనీ క్రీడాకారిణి కెర్బర్.
3 మార్టినా నవ్రతిలోవా (అమెరికా/చెకొస్లవేకియా), మోనికా సెలెస్ (అమెరికా/యుగొస్లేవియా)ల తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న మూడో ఎడంచేతి వాటం ప్లేయర్ కెర్బర్.
4 ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనాలను ఓడించిన నాలుగో ప్లేయర్ ప్లిస్కోవా. గతంలో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్, కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) మాత్రమే ఈ ఘనత సాధించారు.