Pliskova
-
షరపోవా జోరు...
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతోన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం అదరగొడుతోంది. రెండుసార్లు ఈ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ఆమె అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆరో సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 6–2, 6–1తో ఘనవిజయం సాధించింది. తొలి గేమ్‌లోనే తన సర్వీస్ కోల్పోయిన షరపోవా వెంటనే తేరుకొని వరుస పాయింట్లతో కేవలం 59 నిమిషాల్లో ప్లిస్కోవా ఆట కట్టించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో షరపోవా ఆడనుంది. మూడో రౌండ్లో సెరెనా 6–3, 6–4తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచింది. మరోవైపు ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కొంటావీట్ (ఎస్తోనియా) 7–6 (8/6), 7–6 (7/4)తో క్విటోవాను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. హలెప్ ముందంజ టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో హలెప్ 7–5, 6–0తో పెట్కోవిక్ (జర్మనీ)పై, ముగురుజా 6–0, 6–2తో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 4–6, 6–1, 8–6తో గియోర్గి (ఇటలీ)పై, ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–1, 6–3తో ఇరీనా బెగూ (రొమేనియా)పై గెలుపొందారు. నాదల్ దూకుడు... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–2, 6–2తో రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నాదల్ నెట్ వద్ద 12 పాయింట్లు సాధించడంతోపాటు గాస్కే సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–2, 6–4తో జాన్సన్ (అమెరికా)పై, ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–5, 6–4, 6–1తో రామోస్ (స్పెయిన్)పై, ఆరో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–1, 6–7 (3/7), 6–3, 7–6 (7/4)తో మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–7 (6/8), 6–3, 4–6, 7–5, 6–3తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం సంచలనం సృష్టించింది. బోపన్న–వాసెలిన్ జంట 6–4, 7–6 (7/1)తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–లుకాజ్ కుబోట్ (పోలాండ్) జోడీని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
సెరెనా తొలి రౌండ్ ప్రత్యర్థి ప్లిస్కోవా
టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదలైంది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్లో క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్లో కొజ్లోవా (ఉక్రెయిన్)తో ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ మొదటి రౌండ్లో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో పోటీపడతాడు. -
యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్
-
కెర్బర్... నంబర్ 1
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించాక... ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిపోవడంతో ఆమెను ‘వన్ హిట్ వండర్’ అని టెన్నిస్ పండితులు అభివర్ణించారు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా భావించలేదు. తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకొని వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత అదే జోరును సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొనసాగించింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంది. నిలకడగా ఆడుతూ అందరి అంచనాలను తారుమారు చేసిన ఆ జర్మనీ అమ్మాయి పేరు ఎంజెలిక్ కెర్బర్. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన కెర్బర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి కరోలినా ప్లిస్కోవాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన ప్లిస్కోవా ఫైనల్లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ఫైనల్లో ఎవరు గెలిచినా తొలిసారి యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరిస్తారు. * యూఎస్ ఓపెన్‌లో ఫైనల్లోకి * తొలిసారి టాప్ ర్యాంక్ సొంతం * సెమీస్‌లో వొజ్నియాకిపై గెలుపు * సెరెనాకు ప్లిస్కోవా షాక్ * నేడు కెర్బర్తో టైటిల్ పోరు న్యూయార్క్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), పదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కెర్బర్ 6-4, 6-3తో రెండు సార్లు రన్నరప్, మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలుపొందగా... ప్లిస్కోవా 6-2, 7-6 (7/5)తో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. ప్లిస్కోవాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కాగా, కెర్బర్‌కు మూడోది. ముఖాముఖి రికార్డులో కెర్బర్ 4-3తో ఆధిక్యంలో ఉంది. కెర్బర్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా, రొబెర్టా విన్సీ తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరగా... పెనెట్టా టైటిల్ సాధించాక టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. సెరెనా చేజారిన రికార్డు మరో సెమీస్‌లో సెరెనా ఓడిపోవడం, కెర్బర్ ఫైనల్‌కు చేరుకోవడంతో... అంతిమ సమరం ఫలితంతో సంబంధం లేకుండా సోమవారం మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) విడుదల చేసే తాజా ప్రపంచ ర్యాంకింగ్‌సలో కెర్బర్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా ఆవిర్భవించనుంది. ఒకవేళ సెరెనా ఫైనల్‌కు చేరుకున్నా కచ్చితంగా టైటిల్ గెలిస్తేనే ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకునేది. సెమీస్‌లో సెరెనా ఓటమితో వరుసగా 187 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశాన్ని ఈ అమెరికా స్టార్ కోల్పోరుుంది. వరుసగా 186 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన స్టెఫీ గ్రాఫ్ రికార్డును సెరెనా సమం చేయగలిగింది కానీ అధిగమించలేకపోయింది. అదే జోరు... సెమీస్ చేరే వరకు ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా ఇవ్వని కెర్బర్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో రెండుసార్లు వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ జర్మన్ స్టార్ 15 నిమిషాల్లోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వొజ్నియాకి ఒక బ్రేక్ పారుుంట్ సంపాదించి కోలుకునేందకు ప్రయత్నించినా కెర్బర్ తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ మొదట్లోనే వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసిన కెర్బర్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో కెర్బర్ నెట్ వద్దకు ఎనిమిదిసార్లు దూసుకొచ్చి ఏడుసార్లు పారుుంట్లు సాధించింది. 19 విన్నర్స్ కొట్టిన ఆమె 16 అనవసర తప్పిదాలు చేసింది. సర్వీస్‌లో తడబడిన వొజ్నియాకి 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నా కెరీర్లో ఈ రోజు గొప్ప దినం. ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది. మహిళల సింగిల్స్ ఫైనల్ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్షప్రసారం -
సెరెనా మళ్లీ సెమీస్‌లోనే...
మోకాలి గాయంతో బాధపడుతూనే సెమీఫైనల్లో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్‌కు ప్లిస్కోవా ‘చెక్’ పెట్టింది. దాంతో వరుసగా రెండో ఏడాది సెరెనా యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోనే ఓడిపోయింది. సెరెనా ఫిట్నెస్ సరిగ్గా లేదని తెలుసుకున్న ప్లిస్కోవా వ్యూహాత్మకంగా ఆడుతూ తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి సెట్లో సెరెనా సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన ప్లిస్కోవా అదే జోరులో కేవలం 26 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో ఇద్దరూ ప్రతి పారుుంట్కు పోరాడినా తుదకు టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేరుు సాధించింది. ఏడు ఏస్‌లు సంధించిన ప్లిస్కోవా 19 విన్నర్స్ కొట్టింది. సెరెనా ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. ‘సెరెనాను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరానంటే నమ్మశక్యంగా లేదు. నా సహజశైలిలో ఆడితే ఎవరిపైనైనా గెలిచే సత్తా ఉందని తెలుసు’ అని ప్లిస్కోవా వ్యాఖ్యానించింది. 22 టెన్నిస్‌లో కంప్యూటర్ ర్యాంకింగ్స (1975లో) ప్రవేశపెట్టిన తర్వాత నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న 22వ క్రీడాకారిణిగా కెర్బర్ గుర్తింపు పొందనుంది. 19 మహిళల సింగిల్స్‌లో టాప్ ర్యాంక్ పొందనున్న రెండో జర్మనీ ప్లేయర్‌గా కెర్బర్ నిలువనుంది. జర్మనీ తరఫున చివరిసారి 1997లో స్టెఫీ గ్రాఫ్ ఈ గౌరవం దక్కించుకుంది. 1 పెద్ద వయస్సులో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ పొందనున్న క్రీడాకారిణిగా కెర్బర్ (28 ఏళ్లు) గుర్తింపు పొందనుంది. ఇప్పటిదాకా అమెరికా అమ్మారుు జెన్నిఫర్ కాప్రియాటి (25 ఏళ్ల 200 రోజులు-2001 అక్టోబరులో) పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలు కానుంది. 2 స్టెఫీ గ్రాఫ్ (1996లో) తర్వాత యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న రెండో జర్మనీ క్రీడాకారిణి కెర్బర్. 3 మార్టినా నవ్రతిలోవా (అమెరికా/చెకొస్లవేకియా), మోనికా సెలెస్ (అమెరికా/యుగొస్లేవియా)ల తర్వాత ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోనున్న మూడో ఎడంచేతి వాటం ప్లేయర్ కెర్బర్. 4 ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనాలను ఓడించిన నాలుగో ప్లేయర్ ప్లిస్కోవా. గతంలో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్, కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) మాత్రమే ఈ ఘనత సాధించారు.