
టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదలైంది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్‌లో క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది.
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్‌లో కొజ్లోవా (ఉక్రెయిన్)తో ఆడనుంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ మొదటి రౌండ్‌లో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో పోటీపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment