సెరెనా విలియమ్స్
పారిస్/రొనాల్డ్ గారోస్ : బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట అని, ఉమెన్స్ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్ డే అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్‌లో భాగంగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, రష్యా స్టార్ మారియా షరపోవాల మధ్య ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ జరగనేలేదు. సెరెనా భుజ కండరాల గాయంతో మ్యాచ్‌కు ముందే తప్పుకోవడంతో షరపోవా ఆడకుండానే గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రష్యా స్టార్ ముగురుజ(స్పెయిన్), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో ఒకరితో తలపడనుంది.
సెరెనా ఆవేదన..
‘దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఆడలేను. ఇది చాలా కష్టంగా ఉంది. మారియాతో పోటీని ఎప్పుడు ఇష్టపడుతాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధేస్తుంది. నా కూతురు, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశాను. ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉంది.’అని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆదివారం జరిగిన ఉమెన్ డబుల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment