File photo
చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్‌ను ఉమెన్ ఇన్ బ్లూ ఖారారు చేసుకుంది.
సెప్టెంబర్ 24న సెమీఫైనల్-1లో పాకిస్తాన్‌తో తలపడే అవకాశం ఉంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్‌గా వెనుదిరిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్‌లు మ్యాచ్‌ను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యాక షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.
షఫాలీ వర్మ( 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోడ్రిగ్స్(47 నాటౌట్) పరుగులతో దుమ్మురేపింది. ఆఖరిలో రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిముగ్గరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
చదవండి: IND Vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే? చివరగా
Comments
Please login to add a commentAdd a comment