ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బారత్.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. దీంతో భారత్‌కు పతకం ఖాయమైంది.
97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(55 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్(40 నాటౌట్) అదరగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 96 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్, షాబాజ్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో జాకీర్ అలీ(24 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
#TeamIndia's skipper wants this done in a jiffy - takes the attack to 🇧🇩 with 2️⃣0️⃣ runs off the 3rd over!
— Sony LIV (@SonyLIV) October 6, 2023
Which of these Ruturaj Gaikwad shots was your favourite? 💬⤵️#Cheer4India #INDvBAN #Cricket #HangzhouAsianGames #AsianGames2023 #SonyLIV pic.twitter.com/z0qHDw4aF1
A stroke-filled half-century for Tilak Varma & a heart-warming celebration for his mom follows ♥️#TeamIndia beat Bangladesh by 9 wickets in the Semi FINALS#Cheer4India #HangzhouAsianGames #AsianGames2023 #ShubmanGill #Ahmedabad #INDvsBAN #Archery #AssassinsCreedMirage… pic.twitter.com/jiX4v6wGLy
— Abdul (@RolexbhaisirSir) October 6, 2023
Comments
Please login to add a commentAdd a comment