
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 26న తిరువనంతపురం వేదికగా రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. తొలి టీ20 జోరునే రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించి సిరీస్ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న యువ భారత జట్టు ప్రాక్టీస్‌లో బీజీబీజీగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో అవేష్ ఖాన్‌కు అవకాశమివ్వాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా తిలక్ వర్మ స్ధానంలో ఆల్‌రౌండర్ శివమ్ దుబేను తుది జట్టులోకి తీసుకురానున్నట్లు వినికిడి. ఎందుకంటే దుబేకు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. కాబట్టి అతడి సేవలను ఉపయోగించుకోవాలని కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు హెడ్‌కోచ్ వీవియస్ లక్ష్మణ్ కూడా యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులతో బరిలోకే దిగే అవకాశముంది. ఈ మ్యాచ్‌కు ట్రావిడ్ హెడ్‌తో పాటు గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా
చదవండి: U19 Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment