Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ | Tilak Varma Named Captain As BCCI Announces India A Squad For Emerging Asia Cup 2024, Check Names Inside | Sakshi
Sakshi News home page

Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

Published Mon, Oct 14 2024 9:06 AM | Last Updated on Mon, Oct 14 2024 10:27 AM

Tilak Varma Named Captain As BCCI Announces India A Squad For Emerging Asia Cup 2024

ఒమన్ వేదికగా జ‌ర‌గ‌నున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు రైజింగ్ స్టార్‌, ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. అదేవిధంగా ఈ జ‌ట్టులో యువ సంచ‌ల‌నం  అభిషేక్ శర్మ, స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్‌ భాగమయ్యారు. 

ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన యువ ఆట‌గాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ)ల‌కు చోటు ద‌క్కింది. అండర్-19 వరల్డ్‌కప్‌-2022లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు అవకాశం లభించింది. ఇక ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది.

కాగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి.  గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.

ఎమర్జింగ్ ఆసియా కప్‌నకు భారత్-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement