ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం(జనవరి 22) నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అన్ని విధాల సిద్దమైంది.
వరల్డ్ రికార్డుపై కన్నేసిన తిలక్..
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ(Tilak varma)ను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ సాధిస్తే.. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌లలో సెంచరీలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 22 ఏళ్ల తిలక్ వర్మ గత నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలతో మెరిశాడు.
ఆ తర్వాత తిలక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం మరోసారి మూడంకెల స్కోరును అందుకోగల్గితే క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌లలో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.
సంజూ శాంసన్, రూసో, ఫిల్ సాల్ట్ వంటి క్రికెటర్లు వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసినప్పటికి.. మూడో సెంచరీని మాత్రం సాధించలేకపోయారు. ఇప్పుడు ఈ రేర్ ఫీట్ సాధించే అవకాశం తిలక్‌కు లభించింది. తిలక్ ఉన్న అద్భుతమైన ఫామ్‌లో ఈ అరుదైన రికార్డు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
అతడు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. గత సిరీస్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ పొజిషేన్(ఫస్ట్ డౌన్)ను తిలక్‌కు త్యాగం చేశాడు. ఆ పొజిషేన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలతో మెరిశాడు తిలక్. ఆ సిరీస్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఈ హైదరాబాదీ సత్తాచాటాడు. ఇప్పటివరకు భారత్ తరపున 20 టీ20లు ఆడిన వర్మ..51.33 సగటుతో 616 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: IND vs ENG: భారత్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! విధ్వంసకర వీరులకు చోటు
Comments
Please login to add a commentAdd a comment