భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్దమైంది. బుధవారం(జనవరి 22) ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా టీ20కు ఇంగ్లండ్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. మొదటి టీ20లో ఇంగ్లండ్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. పేస్ బౌలర్లలో కోటాలో మార్క్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్‌టన్, గుస్ అట్కిన్సన్‌లకు చోటు దక్కింది.
శ్రీలంకతో మాంచెస్టర్ టెస్టు సందర్భంగా గాయపడిన మార్క్‌వుడ్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ లైనప్‌లోకి తిరిగి వచ్చాడు. అదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కెప్టెన్ జోస్ బట్లర్ బదులుగా ఫిల్ సాల్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
మరోవైపు భారత్ తొలి టీ20లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశముంది. మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లగా ఉండగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వీరిద్దరితో పాటు బంతిని పంచుకోనున్నాడు. స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
Firepower with bat and ball 💥
Brendon McCullum has named the first white-ball team of his reign for tomorrow's opening IT20 v India 💪 pic.twitter.com/DSFdaWVPrB— England Cricket (@englandcricket) January 21, 2025
ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
బెంచ్: వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి.
చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment