భార‌త్‌-ఇంగ్లండ్ సెమీఫైన‌ల్‌.. అంపైర్‌లు వీరే! ఐరెన్ లెగ్ లేడు | ICC names Chris Gaffaney and Rod Tucker as umpires for India vs England semifinal | Sakshi
Sakshi News home page

T20 WC 2024: భార‌త్‌-ఇంగ్లండ్ సెమీఫైన‌ల్‌.. అంపైర్‌లు వీరే! ఐరెన్ లెగ్ లేడు

Published Wed, Jun 26 2024 7:33 AM | Last Updated on Fri, Jun 28 2024 9:48 PM

ICC names Chris Gaffaney and Rod Tucker as umpires for India vs England semifinal

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఆసాధరణ ప్రదర్శన  క‌న‌బ‌రుస్తున్న టీమిండియా.. ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం(జూన్ 27) గయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్‌కప్‌లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్‌లు జాబితాను ప్రకటించింది. భారత్‌-ఇంగ్లండ్ సెమీఫైనల్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. 

అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రోవ్ వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్  రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. మరోవైపు అఫ్గానిస్తాన్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నితిన్ మీనన్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. 

అయితే రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం తొలి సెమీఫైనల్‌లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా కెటిల్‌బరో  పనిచేయనున్నాడు. అహ్సన్ రజా నాల్గవ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement