టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమవుతోంది. జూన్ 29(శనివారం) బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అంపైర్‌ల జాబితాను ప్రకటించింది.
ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా థర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అయితే ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్‌లు రిచర్డ్ కెటిల్‌బరో, ఇల్లింగ్‌వర్త్ ఉండటం భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ టోర్నీల్లో వీరు అంపైర్‌లుగా వ్యవహరించిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది.
2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.
అనంతరం 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఇదే జరిగింది. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక చివరగా వన్డే వరల్డ్‌కప్-2023లో కూడా వీరిద్దరూ ఆన్-ఫీల్డ్ అంపైర్లగా వ్యహరించారు. మరి ఈసారి వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ అంపైర్‌ల జాబితాలో ఉండడంతో ఏమి జరుగుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment