Umpires
-
అందరూ మహిళలే...
నారీ లోకం ప్రపంచకప్ కార్యసిద్ధికి సర్వసైన్యంతో నడుంబిగిస్తోంది. ఆ మెగా ఈవెంట్‌ను అంతా అతివలే చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. టాస్ వేయడం, బ్రాడ్‌కాస్టర్ మైక్‌తో కెప్టెన్ నిర్ణయమెంటో తెలుసుకోవడం, వ్యాఖ్యతలు, ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ ఇలా ఆది అంతం అంతా మహిళలే చూసుకుంటారు. యూఏఈలో ఇంకొన్ని రోజుల్లోనే జరిగే మహిళల టి20 ప్రపంచకప్ అంతా అతివల మయం కానుంది. దుబాయ్: ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు 11+11 మంది ప్లేయర్లు సరిపోతారు. కానీ ఆటకు ముందు, ఆట నిర్వహణ, ఆట తర్వాత ‘ప్రత్యక్ష ప్రసారాని’కి కంటబడని పనెంతో ఉంటుంది. దీన్ని పదులు, వందల సంఖ్యలో సిబ్బంది కంటికి రెప్పలా కనిపెట్టుకొని మరీ పనిచేస్తారు. టాస్ ప్రతినిధి, పిచ్ వద్ద బ్రాడ్‌కాస్టర్ తొలి వ్యాఖ్యానం, టీవీ వ్యాఖ్యాతల వాక్చాతుర్యం, అంపైర్లు బంతిని పట్టుకొని మైదానంలోకి దిగడం. తర్వాత ఫీల్డింగ్ జట్టు గుండ్రంగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని చేసే ప్రతిజ్ఞ... అనంతరం మెల్లిగా ఓపెనర్ల ఆగమనం, సెకన్ల కౌంట్‌డౌన్‌తో మ్యాచ్ షురూ! మధ్యలో విరామం... గ్రౌండ్సిబ్బంది పిచ్‌ను చదును చేయడం, ఆకస్మికంగా వర్షం పడితే కవర్లు పట్టుకొని పదుల సంఖ్యలో మైదానాన్ని కవర్ చేయడం, మ్యాచ్ రిఫరీ పర్యవేక్షణ ఇలా ఓ పెద్ద బృందమే మ్యాచ్‌ను మనముందుకు తెస్తుంది. క్రికెట్ అంటే ఫోర్, సిక్సర్, అవుట్, డకౌట్, ఎల్బీడబ్ల్యూ మాత్రమే కాదు... అంతకుమించిన శ్రమ, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఉంటాయి. ఇదివరకే గత టి20 ప్రపంచకప్ బాధ్యతల్ని మహిళల బృందమే నిర్వహించడంతో ఇకపై కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. మొత్తం మీద ఐసీసీ అతివలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... గురుతర బాధ్యతలను కూడా పెట్టింది. తద్వారా ప్రపంచానికి ప్రపంచకప్‌తో నారీశక్తిని చాటే అవకాశమిచ్చింది. అంపైర్ల జాబితాలో వృందా రాఠి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యూఏఈలో జరిగే మెగా ఈవెంట్ కోసం 13 మంది సభ్యులు గల అధికారిణిల బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు మ్యాచ్ రిఫరీలుండగా, 10 మంది అంపైర్లున్నారు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవమున్న ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ రిఫరీ మెగా ఈవెంట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురు రిఫరీల్లో చోటు దక్కడం గొప్ప విశేషం. ఈ బృందంలో జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా) ఇతర సభ్యులుగా ఉన్నారు. మరో భారత అధికారిణి వృందా రాఠికి పదిమంది సభ్యులు గల ఐసీసీ ఎమిరేట్స్ అంపైర్ల బృందంలో స్థానం లభించింది. ముక్కోణపు, ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్ అధికారులు చూపిన నైపుణ్యం, కనబరిచిన ప్రదర్శన ఆధారంగా అర్హతగల అధికారులనే ప్రపంచకప్ నిర్వహణ బృందానికి ఎంపిక చేశాం. వాళ్లంతా తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాను’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ (అంపైర్లు–రిఫరీలు) సియాన్ ఈసే తెలిపారు.మొత్తం పది జట్లు పోటీపడే ఈ మెగా టోరీ్నలో 23 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ల మధ్య షార్జాలో జరిగే పోరుతో టోర్నీ షురూ అవుతుంది.ప్ర«దాన టోర్నీకి ముందు ప్రతీ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 28 నుంచి సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయి. అంపైర్ల బృందం: లౌరెన్ అగెన్‌బ్యాగ్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), సారా దంబయెవానా (జింబాబ్వే), అనా హారిస్ (ఇంగ్లండ్), నిమాలి పెరీరా (శ్రీలంక), క్లెయిర్ పొలోసాక్ (ఆ్రస్టేలియా), వృందా రాఠి (భారత్), స్యు రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్), ఎలోయిస్ షెరిడాన్ (ఆ్రస్టేలియా), జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్). మ్యాచ్ రిఫరీలు: జీఎస్ లక్ష్మి (భారత్), జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా). -
భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్లకు చోటు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమవుతోంది. జూన్ 29(శనివారం) బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అంపైర్ల జాబితాను ప్రకటించింది.ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గాఫ్నీ, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా థర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్‌గా రోడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అయితే ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, ఇల్లింగ్‌వర్త్ ఉండటం భారత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ టోర్నీల్లో వీరు అంపైర్లుగా వ్యవహరించిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో ఇల్లింగ్‌వర్త్, కెటిల్‌బరో ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఆ తర్వాత 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో, ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉండగా, కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. అనంతరం 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఇదే జరిగింది. ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఇక చివరగా వన్డే వరల్డ్‌కప్-2023లో కూడా వీరిద్దరూ ఆన్-ఫీల్డ్ అంపైర్లగా వ్యహరించారు. మరి ఈసారి వీరిద్దరూ ఫైనల్ మ్యాచ్ అంపైర్ల జాబితాలో ఉండడంతో ఏమి జరుగుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. -
భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆసాధరణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం(జూన్ 27) గయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్‌కప్‌లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్లు జాబితాను ప్రకటించింది. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రోవ్ వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్‌బరోను ఐరెన్ లెగ్ అంపైర్‌గా పిలుస్తుంటారు. మరోవైపు అఫ్గానిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, నితిన్ మీనన్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్‌బరో మాత్రం తొలి సెమీఫైనల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా కెటిల్‌బరో పనిచేయనున్నాడు. అహ్సన్ రజా నాల్గవ అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. -
T20 Worldcup 2024: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. భారత తమ తొలి మ్యాచ్‌లో జూన్5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.అనంతరం టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈ క్రమంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అంపైర్ల జాబితాను ఐసీసీ బుధవారం ప్రకటించింది. ఈ దాయాదుల పోరులో రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అదే విధంగా టీవీ అంపైర్‌గా క్రిస్ గఫానీ బాధ్యతలు నిర్విర్తించనున్నారు. వీరితో పాటు డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. కాగా ఈ మెగా టోర్నీ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇంకా తమ జట్టను ఎంపిక చేయలేదు.టీ20 వరల్డ్‌కప్-2024కు అంపైర్లు వీరే: క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రీఫెల్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్ -
టీ20 వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఇద్దరు
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా-వెస్టిండీస్‌లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది.ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని నలుగురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్‌కు చోటు దక్కింది. కాగా మదనగోపాల్‌కు ఐసీసీ ఈవెంట్లో అంపైరింగ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. అతడితో పాటు సామ్ నోగాజ్స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్, ఆసిఫ్ యాకూబ్‌లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే విధంగా 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్‌లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది. వరల్డ్‌కప్‌కు అంపైర్లు వీరే..క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్. The ICC announced the group of officials for the first round of the T20 World Cup 2024 in the USA and West Indies. The squad includes 20 umpires and 6 match referees.#T20WorldCup2024 pic.twitter.com/lvH9P4trg1— CricTracker (@Cricketracker) May 3, 2024 -
నితిన్ మీనన్ కొనసాగింపు
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది. ఓవరాల్‌గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్‌లు ఎలైట్ క్లబ్లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్‌లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్‌కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను తొలగించారు. 2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది. -
అంపైర్లపై సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారి.. తాగొచ్చేవారంటూ కామెంట్స్..!
టీమిండియా మాజీ క్రికెటర్, ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి దేశవాలీ అంపైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం జరిగిన కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఆటగాళ్లు డోప్ పరీక్షలకు వెళ్లవలసి వస్తే, దానిని దేశీయ అంపైర్లకు కూడా విస్తరించాలి. నేను చాలాసార్లు అంపైర్లు నిద్రపోతున్నట్లు చూశాను. అలా అంపైర్లను చూసిన సందర్భాల్లో.. సార్ నిన్న రాత్రి మీరు ఏమి తాగారని వారిని అడిగేవాడిని. అందుకు వాళ్లు నవ్వుతూ.. నేను విస్కీని ఇష్టపడతానంటూ సమాధానం ఇచ్చేవారు. అలా జరగకుండా దేశీయ అంపైర్లలో సీరియస్‌నెస్ రావాలంటే బీసీసీఐ తగిన చర్యలు తీసుకుని, వారికి కూడా డోప్ పరీక్షలు నిర్వహించాలని తివారి అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేయకముందు తివారి దేశవాలీ క్రికెట్‌పై, ముఖ్యంగా రంజీలపై, టీమిండియాలో తన కెరీర్ అర్దంతరంగా ముగియడంపై, ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాగా రాణిస్తున్నా టీమిండియాలో తనను తొక్కేశారంటూ ధోనిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత క్రికెటర్ల మాదిరి తనకూ ప్రోత్సాహం లభించి ఉంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలా ఉన్నత శిఖరాలకు చేరుకునేవాడినని అన్నాడు. కాగా, రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తివారి తన 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 148 మ్యాచ్‌లు ఆడిన తివారి.. 10,195 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 45 అర్ధ శతకాలు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్ లో 169 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 5581 రన్స్ చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 183 టీ20ల్లో 3436 పరుగులు సాధించిన తివారి.. 2008-2015 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడి 287, 15 పరుగులు చేశాడు. వన్డేల్లో తివారి అత్యధిక స్కోరు 104 నాటౌట్‌గా ఉంది. -
వరల్డ్‌కప్‌కు అంపైర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కడే
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం 16 మంది అంపైర్ల జాబితాను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 25) ప్రకటించింది. మెగా టోర్నీ కోసం నలుగురు రిఫరీల లిస్ట్‌ను కూడా ఐసీసీ ఇవాళే రిలీజ్ చేసింది. అంపైర్ల జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్ ఒక్కడికే ప్రాతినిథ్యం లభించగా.. రిఫరీల్లో సైతం భారత్ నుంచి జవగల్ శ్రీనాథ్ ఒక్కడికే అవకాశం దక్కింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు భారత అంపైర్ నితిన్ మీనన్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార ధర్మసేన ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ పేర్కొంది. అక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు, రిఫరీల వివరాలను సైతం ఐసీసీ ఇవాళే వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, మరియాస్ ఎరాస్మస్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. రిచర్డ్ కెటిల్‌బోరో థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా ఉంటారు. అంపైర్ల వివరాలు.. క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) కుమార ధర్మసేన (శ్రీలంక) మరియాస్ ఎరాస్మస్ (సౌతాఫ్రికా) క్రిస్టోఫర్ గఫ్ఫానీ (న్యూజిలాండ్) మైఖేల్ గాఫ్ (ఇంగ్లండ్) అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (సౌతాఫ్రికా) రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) రిచర్డ్ కెటిల్‌బోరో (ఇంగ్లండ్) నితిన్ మీనన్ (ఇండియా) ఎహసాన్ రజా (పాకిస్తాన్) పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా) షర్ఫుద్దౌలా ఇబ్నే షహీద్ (బంగ్లాదేశ్) రాడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా) అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్) జోయెల్ విల్సన్ (వెస్టిండీస్) పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా) రిఫరీల జాబితా.. జెఫ్ క్రో (న్యూజిలాండ్) ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) రిచీ రిచర్డ్సన్ (వెస్టిండీస్) జవగల్ శ్రీనాథ్ (ఇండియా) -
వైడ్ ఇవ్వలేదని అంపైర్ మీదకు వెళ్లిన షకీబ్.. ఇదేమి బుద్దిరా బాబు!
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్‌బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి షకీబ్ దిగాడు. బీపీఎల్-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? బీపీఎల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్ 16 ఓవర్లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్ షకీబ్ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దాన్ని తొలి బౌన్సర్‌గా సిగ్నిల్ ఇచ్చాడు. షకీబ్ మాత్రం అది ఎలా బౌన్సర్ అవుతుందని లెగ్ అంపైర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అతడు లెగ్ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్‌లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్ క్షమాపణలు కూడా తెలిపాడు. Shakib Al Hasan - the man the myth the umpire’s nightmare pic.twitter.com/wKQnb3wNUH — adi ✨🇧🇩 (@notanotheradi) January 7, 2023 చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ! -
BCCI: జనని, గాయత్రి, వ్రిందా... రంజీ చరిత్రలో తొలిసారి!
BCCI- Ranji Trophy- ముంబై: భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి మహిళా అంపైర్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు మహిళా అంపైర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత క్రికెట్లో ఇది కొత్త మలుపు కానుందని బోర్డు అభిప్రాయ పడింది. వ్రిందా రాఠి (ముంబై), జనని నారాయణ్ (చెన్నై), గాయత్రి వేణుగోపాలన్ (ఢిల్లీ)లకు ఈ అవకాశం దక్కింది. డిసెంబర్ 13న ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లకు వీరు అంపైర్లుగా వ్యవహరిస్తారు. 32 ఏళ్ల వ్రిందా ముంబైలో చిన్న స్థాయి క్లబ్ మ్యాచ్‌ల నుంచి మొదలు పెట్టి బీసీసీఐ అంపైర్‌గా ఎదగగా, 43 ఏళ్ల గాయత్రి బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై 2019 నుంచి అంపైరింగ్ చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన 36 ఏళ్ల జనని క్రికెట్‌పై ఆసక్తితో ఉద్యోగం వదిలి అంపైరింగ్ వైపు వెళ్లింది. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ -
అంపైర్లకు ప్రమోషన్.. బీసీసీఐతో అట్లుంటది మరి
క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) అంపైర్ల విషయంలో కొత్త పంథాను అనుసరించింది. ఇన్నాళ్లు ఆటగాళ్లకు మాత్రమే ఉన్న ఏ-ప్లస్ గ్రేడ్‌ను అంపైర్లకు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మెంబర్ అయిన నితిన్ మీనన్ సహా మరో నలుగురు అంతర్జాతీయ అంపైర్లకు ఏ ప్లస్ కేటగిరిలో చోటు కల్పించింది. అనిల్ చౌదరీ, మదన్‌గోపాల్ జయరామన్, వీరేంద్ర కుమార్ శర్మ, కెఎన్ అనంతపద్మనాభన్ ఈ జాబితాలో ఉన్నారు. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ అంతర్జాతీయ అంపైర్లు కె. హరిహరన్, సుదీర్ అనానీ, అమీష్ సాహెబా, బీసీసీఐ అంపైర్స్ సబ్ కమిటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా ఇచ్చిన రిపోర్టు మేరకు బీసీసీఐ ఏ-ప్లస్ కేటగిరిని కొత్తగా సృష్టించింది. ఇంతవరకు అంపైర్ల గ్రేడ్ కాంట్రాక్ట్ విషయంలో ఏ, బి, సి, డి కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా చేర్చిన ఏ-ప్లస్, ఏ కేటగిరిలో ఉన్న అంపైర్లకు ఒక్కో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు రూ.40 వేలు.. బి, సి కేటగిరిల్లో ఉన్న అంపైర్లకు రూ.30వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఏ-ప్లస్‌లో ఐదుగురు ఉండగా.. ఏ-కేటగిరిలో 20 మంది అంపైర్లు, బి-కేటగిరిలో 60 మంది అంపైర్లు, సి-కేటగిరిలో 46 మంది అంపైర్లు ఉన్నారు.కమిటీ బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో ఏ ప్లస్ కేటగిరీ ప్రతిపాదనను ‘గ్రేడేషన్ ఆఫ్ అంపైర్లు’గా పేర్కొంది. అయితే బోర్డు స్వయంగా ఆ కేటగిరీని సృష్టించిందని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇవి ఏ-ప్లస్ కొత్త కేటగిరీతో కూడిన సమూహాలు. ఏ-ప్లస్‌తో పాటు ఏ- గ్రేడ్ భారతీయ అంపైర్ల క్రీమ్‌ను కలిగి ఉంటాయి. ఇక అంపైర్లకు విధులనేవి కేటగిరీ వారిగా నిర్ణయిస్తారని.. రంజీ ట్రోఫీ సహా మిగిలిన దేశవాలీ క్రికెట్ టోర్నీలకు ఇదే పంథాను అనుసరిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి -
మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ..
మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్ మహిళలు) అంపైర్ల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. దాదాపు 900 మంది సిబ్బంది ఈ ప్రయోజనాన్ని పొందుతారు ఇందులో 75శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు 100% పెన్షన్ పెంపు అందుకోనున్నారు అని జై షా ట్విటర్లో పేర్కొన్నారు. ఇక రూ. 15,000 చెల్లించే ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లకు ఇప్పుడు రూ. 30,000 అందజేయగా, రూ.22,500 పెన్షన్ అందుకునేవారికి రూ.45,000, రూ.30వేల పెన్షన్ అందుకునేవారికి రూ.52,500 లభించనుంది. చదవండి: India Vs South Africa: ఇక గెలవాల్సిందే! NEWS 🚨- BCCI announces increase in monthly pensions of former cricketers, umpires. READ -https://t.co/wmjylA1sb4 — BCCI (@BCCI) June 13, 2022 -
అంపైర్లు లేరు.. వన్డే మ్యాచ్ రద్దు
Umpires Not Available For IRE vs USA 1st ODI.. అంపైర్ టీమ్‌లో కరోనా కలకలం రేపడంతో ఐర్లాండ్, యూఎస్ఏ మధ్య జరగాల్సిన తొలి వన్డేను రద్దు చేశారు. అంపైర్ టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకడంతో మిగతా ముగ్గురు అంపైర్లకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలోల నెగెటివ్ అని తేలినప్పటికి.. పాజటివ్ వచ్చిన వ్యక్తితో మిగతా ముగ్గురికి క్లోజ్ కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉంచారు. మ్యాచ్ నిర్వహించాలని అనుకున్నప్పటికి అంపైర్లు అందుబాటులో లేకపోవడంతో ఇరుజట్ల బోర్డుల అంగీకారంతో మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపింది. కాగా డిసెంబర్ 26న ఈ వన్డే జరగాల్సింది. అయితే మిగతా రెండు వన్డేలు మాత్రం డిసెంబర్ 28, 30వ తేదీల్లో యధావిధిగా జరుగుతున్నాయని ఇరుబోర్డులు ప్రకటించాయి. ఇక అంతకముందు ఐర్లాండ్, యూఎస్ఏల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. -
మా ఆయన్ని విలన్‌గా భలే చూపిస్తున్నారు: షకీబ్ భార్య
ఢాకా ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ అల్ హసన్ వ్యవహార శైలి విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. వికెట్లు తన్ని, పీకిపాడేసిన ఘటనలపై షకీబ్ క్షమాపణలు కూడా చెప్పాడు. ఇది జరిగి కొద్ది గంటలు కూడా గడవకముందే షకీబ్ భార్య ఉమ్మె అల్ హసన్ మరోలా స్పందించింది. ఈ వ్యవహారంలో నా భర్తను విలన్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మీడియాతో పాటే నేనూ ఆ కథనాల్ని ఎంజాయ్ చేశా. కేవలం ఆయన కోపాన్నే చూపించారే తప్ప.. అసలు విషయాన్ని మీడియా కప్పిపెట్టే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో అంపైర్లు అలా ఎలా నిర్ణయం ప్రకటిస్తారు? ఈ వ్యవహారంలో అంపైర్ల తీరుపైనా నాకు అనుమానాలున్నాయి. అయితే ఇంత వ్యతిరేకత ప్రచారంలోనూ నా భర్తకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లకు థ్యాంక్స్ అంటూ ఫేస్బుక్లో ఓ పోస్ట్చేసిందామె. కాగా, డీపీఎల్ టోర్నీలో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్, అబహాని లిమిటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముష్పికర్ రహీం ప్యాడ్‌కు బంతి తగిలాక అవుట్ అప్పీల్ చేసిన షకీబ్.. అంపైర్ స్పందించకపోవడంతో వికెట్లను కాలితో తన్నేశాడు. ఆ తర్వాత ఏకంగా వికెట్లనే పెకిలించాడు. అయితే వివాదాలు 34 ఏళ్ల షకీబ్‌కు కొత్తేం కాదు. ఇదే డీపీఎల్ టోర్నీ టైంలో బయో బబుల్ ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసి విమర్శల పాలయ్యాడు. చదవండి: అవసరమా ఇలాంటి ప్లేయర్స్ చదవండి: షకీబ్‌కు ఊరట -
27 ఏళ్ల తర్వాత తొలి సారిగా..
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్.నరసింహన్, వీకే రామస్వామిలు ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరీలు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్ మీనన్, అనిల్ చౌదరీతో పాటు వీరేందర్ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్రయాణ అంక్షల కారణంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్కు స్థానిక అంపైర్లనే నియమించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
అటు ధోని... ఇటు అంపైర్లు!
భారత జట్టును నడిపించేటప్పుడు ‘కెప్టెన్ కూల్’గానే కనిపించిన ధోని పసుపు రంగు దుస్తుల్లో ‘హాట్’గా మారిపోతాడేమో? గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనే మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగిన ధోని మంగళవారం కూడా అదే తరహాలో ప్రవర్తించాడు. దీపక్ చహర్ వేసిన రాయల్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఐదో బంతికి టామ్ కరన్‌ను అంపైర్ షంషుద్దీన్ అవుట్ (కీపర్ క్యాచ్)గా ప్రకటించాడు. అయితే కరన్ మాత్రం కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. తన నిర్ణయంపై సందేహం వచ్చిన షంషుద్దీన్ మరో అంపైర్ వినీత్ కులకర్ణితో చర్చించి థర్డ్ అంపైర్‌గా నివేదించగా అది నాటౌట్‌గా తేలింది. బంతి కరన్ బ్యాట్‌కు తగలకపోగా... ధోని కూడా బంతి నేలను తాకిన తర్వాతే అందుకున్నాడు. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై మళ్లీ చర్చ ఏమిటంటూ ధోని అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ తప్పు చేయడం వాస్తవమే అయినా... తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించే అధికారం నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్లకు ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అంచనా తప్పని ధోని... క్యాచ్ కాని క్యాచ్ కోసం ఇంతగా వాదించడం ఆశ్చర్యకరంగా అనిపించింది! -
అరుదైన అవకాశం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో అరుదుగా కనిపించే వ్యక్తులు మహిళా అంపైర్లు. మహిళలు జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించడమే గగనంగా కనిపించే ఈ రోజుల్లో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానెల్లో భారత మహిళా అంపైర్లు తమ సంఖ్య పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసీసీ రిఫరీస్ ప్యానల్లో చోటు దక్కించుకోగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు. చెన్నైకి చెందిన జననీ నారాయణ్, నవీ ముంబైకి చెందిన వృందా రాఠి ‘ఐసీసీ డెవలప్మెంట్ అంపైర్స్’ అంతర్జాతీయ ప్యానల్‌కు ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ప్యానల్లో భారత మహిళా అధికారుల సంఖ్య మూడుకు చేరింది. ఈ డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానల్ అనేది పలు రీజియన్లకు చెందిన అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుంది. అత్యంత కఠినంగా ఉండే బీసీసీఐ లెవల్–2 అంపైరింగ్ పరీక్షను పాసైన మహిళా అధికారులుగా గతంలోనే గుర్తింపు తెచ్చుకొని.... ప్రస్తుతం అత్యున్నత స్థాయి అంపైరింగ్ ప్యానల్లో చోటు దక్కించుకున్న జనని, వృందా గురించి చూస్తే... జననీ నారాయణ్: 34 ఏళ్ల జనని 2018 నుంచి దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్ వీరాభిమాని అయిన జనని ఇంగ్లండ్ అంపైర్ డేవిడ్ షెఫర్డ్, ఎస్. వెంకటరాఘవన్ (భారత్)లను ఆదర్శంగా తీసుకుంది. 2015లోనే తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోకల్ డివిజన్ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరించింది. ఎంసీసీ నిబంధనలపై మంచి పట్టు ఉన్న ఆమె... ఎంతో కష్టపడి బీసీసీఐ లెవల్–1 కోర్సును కూడా పూర్తిచేసింది. తర్వాత థియరీ, ప్రాక్టికల్స్‌తో కూడిన కఠినమైన లెవల్–2 పరీక్షలోనూ మెరుగ్గా రాణించి.. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. వృందా రాఠీ: మాజీ క్రికెటర్, స్కోరర్ అయిన వృందాకు క్రికెట్‌తో మంచి అనుబంధముంది. స్వతహగా మీడియం పేసర్ అయిన వృందా కాలేజీ స్థాయిలో 2007 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ముంబై యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. 2008–09 ఆలిండియా చాంపియన్‌గా నిలిచిన ముంబై యూనివర్సిటీ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. అదే ఏడాది నుంచి బీసీసీఐ స్కోరర్‌గా కెరీర్ ప్రారంభించిన వృందా... 2013 మహిళల ప్రపంచ కప్‌లోనూ ఆమె స్కోరర్‌గా పనిచేసింది. న్యూజిలాండ్ అంపైర్ క్యాతీ క్రాస్‌ను చూసి స్ఫూర్తి పొంది అంపైరింగ్ వైపు మొగ్గు చూపింది. 2014లో రాష్ట్ర స్థాయిలో అంపైరింగ్ పరీక్ష పాసైన వృందా వివిధ స్థాయి టోర్నీల్లో 150 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. తర్వాత 2016లో బీసీసీఐ లెవల్–1 పరీక్షలో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి 2017లో లెవల్–1 కోర్సును పూర్తిచేసింది. 2018లో లెవల్–2ను ముగించి ‘బీసీసీఐ దేశవాళీ అంపైర్ల ప్యానల్’లో చోటు దక్కించుకుంది. -
అంపైరింగ్ వరల్డ్ రికార్డు సమం!
లండన్: పాకిస్తాన్‌కు చెందిన క్రికెట్ అంపైర్ అలీమ్ దార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన అలీమ్ దార్.. స్టీవ్ బక్నర్(వెస్టిండీస్) రికార్డును సమం చేశారు. ఇప్పటివరకూ స్టీవ్ బక్నర్ 128 టెస్టు మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి టాప్‌లో ఉండగా, ఇప్పుడు అతని సరసన 51 ఏళ్ల అలీమ్ దార్ నిలిచారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో అలీమ్ దార్ ఈ మార్కును చేరారు. దీనిపై అలీమ్ దార్ మాట్లాడుతూ.. ఇదొక అతి పెద్ద ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అందులోనూ తన రోల్ మోడల్ బక్నర్ సరసన నిలవడం ఇంకా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఘనత సాధించడానికి ఆ దేవుడి సాయంతో పాటు ఐసీసీ, పీసీబీల సహకారం కూడా మరువలేనిదన్నారు. తన సహచరులకు, తన కోచ్‌లకు అలీమ్ దార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల సహకారం వెలకట్టలేనిదని, వారు నుంచి తనకు సహకారం అందకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. 2003లో ఢాకాలో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన టెస్టు ఫార్మాట్లో అంపైర్‌గా అరంగేట్రం చేసిన అలీమ్ దార్.. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 376 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. -
‘ఫైనల్’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్
లండన్: విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్‌కు కుమార ధర్మసేన (శ్రీలంక), మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) థర్డ్ అంపైర్ కాగా, అలీమ్ దార్ (పాకిస్తాన్) నాలుగో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే బృందం గురువారం నాటి ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌కూ పనిచేసింది. అయితే, ధర్మసేన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. యూకేలో ఫైనల్ ఉచిత ప్రసారం సొంతగడ్డపై టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఆదివారం జరుగబోయే ప్రపంచ కప్ ఫైనల్‌ను ఉచిత ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుత కప్‌కు సంబంధించి యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్‌తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 మెత్తబడి మెట్టుదిగింది. -
ధోని దాదాగిరి
క్రికెట్లో అంపైరింగ్ పొరపాట్లు మొదటి సారేమీ కాదు... అంపైర్లు చేసిన తప్పుల వల్లే మ్యాచ్ ఫలితాలు తారుమారైన ఘటనలు కోకొల్లలు... అంపైర్ల నిర్ణయాలు కొన్ని సార్లు తమకు అనుకూలంగా, మరికొన్ని ప్రత్యర్థి జట్ల పక్షాన రావడం దేశవాళీనుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ప్రతీ జట్టుకు అనుభవమే. సాధారణంగానైతే ఆటగాళ్లు లేదా కెప్టెన్లు ‘తప్పులు మానవ సహజం’ అని లేదంటే ‘ఇదంతా ఆటలో భాగమే’ అని దానిని వదిలేస్తుంటారు. కాస్త ఆవేశపరులైతే తమ అసహనాన్ని, కోపాన్ని బయటకు ప్రదర్శిస్తారు. అంతే తప్ప ఔటై బౌండరీ బయట కూర్చున్న వ్యక్తి లోపలికి దూసుకుపోయి అంపైర్లతో గొడవ పెట్టుకోడు. కానీ దిగ్గజ క్రికెటర్, రెండు వరల్డ్ కప్‌లలో జట్టును విజేతగా నిలిపిన వ్యక్తి ఆ పని చేశాడు. కేవలం ఒక నోబాల్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయే రీతిలో అతను ప్రవర్తించాడు. సాక్షి క్రీడా విభాగం సరిగ్గా రెండు వారాల క్రితం మలింగ వేసిన నోబాల్‌ను గుర్తించలేకపోయినందుకు ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి. మేం ఆడుతోంది ఐపీఎల్. క్లబ్ క్రికెట్ కాదు’... అని విరాట్ కోహ్లి అంపైర్లపై విరుచుకు పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అంపైర్లపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదు. కానీ కోహ్లికి ఐపీఎల్ నిర్వాహకులు కనీసం హెచ్చరిక కూడా జారీ చేయలేదు. ఇప్పుడు తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్లుగా ధోని అంపైర్లపై చెలరేగిపోయాడు. ఘటన జరిగిన తీరును చూస్తే కెప్టెన్‌గా అతను అసంతృప్తి చెందడం సహజమే అయినా దానిని వ్యక్తీకరించే విషయంలో ధోని గీత దాటాడనేది వాస్తవం. కోచ్ సమర్థన! నిబంధనల ప్రకారం అయితే ‘హైట్ నోబాల్’ను ఖరారు చేయాల్సింది లెగ్ అంపైర్ మాత్రమే. కానీ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఉల్హాస్ గంధే నోబాల్‌గా ప్రకటించాడు. విదర్భ తరఫున దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీ క్రికెట్ ఆడిన 44 ఏళ్ల ఉల్హాస్ దేశవాళీ అంపైర్ మాత్రమే. పెద్ద అనుభవం లేని అతను నోబాల్ ఇవ్వడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ సాంట్నర్ షాట్ ఆడేందుకు ముందుకు రావడం, ఆడేటప్పుడు గాల్లోకి ఎగరడం వల్ల లెగ్ అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ దీనిని నోబాల్‌గా గుర్తించలేదు. దాంతో ఉల్హాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో ధోని మైదానంలోకి దూసుకుపోయి వాదనకు దిగాడు. అది నోబాల్ కాదంటూ చెప్పి ధోనిని సముదాయించి బయటకు పంపేందుకు ఆక్సెన్ఫోర్డ్కు తల ప్రాణం తోకకు వచ్చింది. మ్యాచ్ అనంతరం ధోని అయితే దీనిపై ఏం మాట్లాడలేదు కానీ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేలవ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘నోబాల్‌పై నిర్ణయం తీసుకునే విషయంలో అంపైర్లు వ్యవహరించిన తీరుపై ధోనికి కోపం వచ్చింది. ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది అతనికి అర్థం కాలేదు. దాంతో మరింత స్పష్టత కోరేందుకే అతను మైదానంలోకి వెళ్లాడు. నిజానికి అతను చాలా సంయమనంతో ఉంటాడు. ఇది అసాధారణం. ఈ ఘటన గురించి రాబోయే రోజుల్లో అతడిని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తారని నాకు తెలుసు’ అని ఫ్లెమింగ్ అన్నాడు. లెక్కలేనితనమా... ధోని వీరాభిమానులు కూడా అతను చేసిన పనిని నమ్మలేకపోతున్నారు. నిజంగా నోబాల్‌పై అసంతృప్తి ఉంటే అన్ని తెలిసిన అతను నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సింది. అదేమీ జట్టు కోసం నిలబడాల్సినంత పెద్ద ఘటన కాదు. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీకి ఫిర్యాదు చేసే అవకాశం అతనికి ఉంది. లేదా టీమ్ మేనేజ్మెంట్ తరఫున ఘాటైన నివేదిక తయారు చేసి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అందజేస్తే వారే అంపైర్‌పై చర్య తీసుకుంటారు. కానీ అంపైర్ల అధికారాన్ని సవాల్ చేస్తూ వారిని బహిరంగంగా అవమానించాడు. ఒక రకంగా చూస్తే చొక్కా చేతులను పైకి మడిచి గొడవకు దిగే వ్యక్తుల తరహాలో ప్రవర్తించాడు. భారత క్రికెట్లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు. ఇకపై ప్రతీ క్రికెటర్ ఔటై బయట కూర్చొని కూడా అంపైరింగ్ నిర్ణయం తప్పని అనిపిస్తే అప్పటికప్పుడు ప్రశ్నించేందుకు సిద్ధమైపోతాడు. ఇటీవలి చెన్నై టీమ్ డాక్యుమెంటరీ ‘రోర్ ఆఫ్ ద లయన్’ తరహాలో కొన్నేళ్లకు మళ్లీ ఏమైనా ప్రత్యేక వీడియోను ధోని స్వయంగా నిర్మించి అందులో ఈ ఘటనపై తన ‘వివరణ’ ఇస్తే తప్ప ధోని స్పందన ఇప్పట్లో ఉండదు. కానీ తన ప్రవర్తనతో అతను కొంత మంది అభిమానులకైనా దూరమయ్యాడనేది వాస్తవం. జరిమానాతో సరి... ఒక వైపు ధోని చేసిన పనిపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తూ కనీసం మ్యాచ్ నిషేధమైనా ఉండాలని వినిపిస్తుండగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అతి స్వల్ప శిక్షతో సరిపెట్టింది. లెవల్ 2 తప్పిదం కింద గుర్తిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఐపీఎల్లో ఒక మ్యాచ్‌కు ధోని ఫీజు ఎంతనేదే స్పష్టత లేదు. ఎంత మొత్తమైనా ఎలాగూ ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది కాబట్టి ధోనికి శిక్ష పడనట్లే! -
అంపైర్లపై చర్యలుండవ్!
న్యూఢిల్లీ: నోబాల్ గుర్తించని అంపైర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో సత్వర చర్యలకు బీసీసీఐ వెనుకంజ వేస్తోంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సివుండగా... మలింగ నోబాల్ వేశాడు. కానీ ఫీల్డు అంపైర్ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. అతనితో పాటు నందన్ ఆ మ్యాచ్‌కు అంపైరింగ్ చేశారు. దీనిపై మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరు సారథి కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ల పొరపాట్లపై ఆక్షేపించాడు. అయితే తాజా ఐపీఎల్లో కేవలం 11 మంది భారత అంపైర్లు, ఆరుగురు విదేశీ అంపైర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు కానీ... మ్యాచ్ రిఫరీ మను నాయర్ అంపైర్ రవికి నెగెటివ్ మార్క్‌ను వేశారు. -
సెరెనా మ్యాచ్‌ల బహిష్కరణ!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో చైర్ అంపైర్ కార్లొస్ రామోస్ పట్ల సెరెనా విలియమ్స్ దురుసు ప్రవర్తన మరింత వివాదాస్పదం అవుతోంది. రామోస్‌ను ‘దొంగ, అబద్ధాల కోరు’గా సెరెనా దూషించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఓ వర్గం అంపైర్లు... క్షమాపణ చెప్పేవరకు ఆమె పాల్గొనే మ్యాచ్‌లను బహిష్కరించే ఆలోచన చేస్తున్నారు. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు సంఘంగా ఏర్పడాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు 47 ఏళ్ల రామోస్ విశేష అనుభవజ్ఞుడు. పోర్చుగల్‌కు చెందిన ఇతడు పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు, మహిళల విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు అంపైరింగ్ చేశాడు. తాజా వివాదాస్పద యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ రామోస్ నిబంధనలకు కట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) కితాబిచ్చింది. వరుస వివాదాల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని సమీక్షించాలని అమెరికన్ టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) భావిస్తోంది. -
సెలక్టర్లు, అంపైర్ల జీతాల పెంపు!
న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ జట్టు సెలక్టర్లు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల జీతాలు భారీగా పెరగనున్నాయి. క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ)తో పాటు సాబా కరీమ్ ఆధ్వర్యంలోని బీసీసీఐ క్రికెట్ పర్యవేక్షణ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్, సెలక్టర్లు దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్ సేవలకు ప్రతిఫలంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌కు ఏడాదికి రూ.80 లక్షలు, మిగతా ఇద్దరికి రూ.60 లక్షల చొప్పున వేతనం ఇస్తున్నారు. ఇకపై ఈ మొత్తం వరుసగా రూ.కోటి, రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షలు కానుంది. దీంతోపాటు ఆరేళ్ల తర్వాత రిఫరీలు, అంపైర్లు, స్కోరర్లు, వీడియో విశ్లేషకుల దేశవాళీ మ్యాచ్ ఫీజులను పెంచారు. ఫస్ట్‌క్లాస్, మూడు రోజుల, 50 ఓవర్ల మ్యాచ్‌కు ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా దానిని రెట్టింపు చేశారు. టి20 మ్యాచ్ ఫీజు రూ.10 వేలు ఉండగా రూ.20 వేలు ఇవ్వనున్నారు. రిఫరీలకు నాలుగు రోజుల మ్యాచ్‌కు రూ.30 వేలు, మూడు రోజుల, ఒక రోజు మ్యాచ్‌కు రూ.15 వేలు అందజేస్తారు. స్కోరర్లకు రూ.10 వేలు, వీడియో విశ్లేషకులకు ఇతర మ్యాచ్‌లకు రూ.15 వేలు, టి20లకు రూ.7,500 ఇస్తారు. అయితే... జీతాల పెంపు అంశంలో బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌధరిని పరిగణనలోకి తీసుకోకపోవడం బోర్డు పెద్దలు, సీవోఏ మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది. -
అంపైర్లు అప్రమత్తంగా ఉండాలి: ఐపీఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : మైదానంలో అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సూచించారు. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఓవర్లో 7 బంతులు వేయించడం.. ఉప్పల్‌లో చెన్నై-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో స్పష్టమైన నోబాల్‌ను ఇవ్వకపోవడంతో అంపైర్ల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ పంజాబ్ మ్యాచ్‌కు హజరైన శుక్లా.. అంపైర్ల తప్పిదాలపై స్పందించారు. ‘ఇలాంటి తప్పిదాలు కొన్ని సార్లు జరుగుతుంటాయి. అంపైర్లు అప్రమత్తంగా వ్యవహరించేలా మ్యాచ్ రిఫరీలు వారితో చర్చించాలని’ పేర్కొన్నారు. ఇలాంటి చిన్న తప్పిదాలు జరగకుండా అంపైర్లు అవసరమైతే టెక్నాలజీ సాయం తీసుకోవాలని మరో ఐపీఎల్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎవరు కావాలని తప్పిదాలు చేయరని ఆయన పేర్కొన్నారు. ఇక చెన్నై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమికి అంపైర్ నిర్ణయమే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్-రాజస్తాన్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం పాండ్యా నాటౌట్..! చిర్రెత్తిన కోహ్లీ ‘అంపైర్ వల్లే సన్‌రైజర్స్ ఓటమి’ -
ఇది నా రాజ్యం
క్రికెట్ మ్యాచ్‌లకు జంతువులు, పక్షులు అంతరాయం కలిగించడం కొత్తేం కాదు. గతంలో అనేకసార్లు మైదానంలోకి కుక్కలు వచ్చి మ్యాచ్‌కు ఆటంకం కలిగించాయి. తొలి రోజు వైజాగ్‌లో కూడా ఓ కుక్క సందడి చేసింది. టీ విరామానికి ముందు బ్రాడ్ ఓవర్లో రెండు బంతులు వేశాక కుక్క మైదానంలోకి వచ్చింది. మైదానం సిబ్బంది వచ్చి దానిని బయటకు పంపారు. కానీ ఒక్క నిమిషంలోపే మళ్లీ అది తిరిగి మైదానంలోకి వచ్చింది. ఇది నా రాజ్యం... మీరెవరూ అనే తరహాలో అక్కడే కాలకృత్యాలు తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో దానిని తరుముతున్న సిబ్బందిలో ఒకరు షూ తీసి విసిరేసి దాని వెంటపడ్డాడు. మైదానం అంతా పరుగులు పెట్టించిన తర్వాత గానీ అది బయటకు వెళ్లలేదు. ఈ ఆలస్యంతో అంపైర్లు కాస్త ముందుగానే టీ విరామం ప్రకటించాల్సి వచ్చింది. బహుశా ఇలా మాత్రం గతంలో ఎప్పుడూ జరిగినట్లు లేదు!