బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షకీబ్ దురుసు ప్రవర్తను ప్రదర్శించాడు. వైడ్‌బాల్ విషయంలో అంపైర్‌తో వాగ్వాదానికి షకీబ్ దిగాడు. బీపీఎల్-2023లో భాగంగా శనివారం ఫార్చ్యూన్ బరిషల్, సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
బీపీఎల్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌కు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫార్చ్యూన్ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో రెహమాన్ రాజా వేసిన ఒక షార్ట్ బాల్ షకీబ్ పై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దాన్ని తొలి బౌన్సర్‌గా సిగ్నిల్ ఇచ్చాడు. షకీబ్ మాత్రం అది ఎలా బౌన్సర్ అవుతుందని లెగ్ అంపైర్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో అతడు లెగ్ అంపైర్‌పై గట్టిగా అరుస్తూ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అయితే అంపైర్ సరైన వివరణ ఇవ్వడంతో చేసేదేమీ లేక మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకు ముందు 2021లో ఢాకా ప్రీమియర్‌లో కూడా ఈ విధంగానే ప్రవర్తించాడు. అప్పటిల్లో అది తీవ్ర వివాదాస్పదకావడంతో షకీబ్ క్షమాపణలు కూడా తెలిపాడు.
Shakib Al Hasan - the man the myth the umpire’s nightmare pic.twitter.com/wKQnb3wNUH
— adi ✨🇧🇩 (@notanotheradi) January 7, 2023
చదవండి: Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్ క్రికెట్ ఆడకపోయినా ఫుల్ సాలరీ!
Comments
Please login to add a commentAdd a comment