
Umpires Not Available For IRE vs USA 1st ODI.. అంపైర్ టీమ్‌లో కరోనా కలకలం రేపడంతో ఐర్లాండ్, యూఎస్‌ఏ మధ్య జరగాల్సిన తొలి వన్డేను రద్దు చేశారు. అంపైర్ టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకడంతో మిగతా ముగ్గురు అంపైర్లకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలోల నెగెటివ్ అని తేలినప్పటికి.. పాజటివ్ వచ్చిన వ్యక్తితో మిగతా ముగ్గురికి క్లోజ్ కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉంచారు.
మ్యాచ్ నిర్వహించాలని అనుకున్నప్పటికి అంపైర్లు అందుబాటులో లేకపోవడంతో ఇరుజట్ల బోర్డుల అంగీకారంతో మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపింది. కాగా డిసెంబర్ 26న ఈ వన్డే జరగాల్సింది. అయితే మిగతా రెండు వన్డేలు మాత్రం డిసెంబర్ 28, 30వ తేదీల్లో యధావిధిగా జరుగుతున్నాయని ఇరుబోర్డులు ప్రకటించాయి. ఇక అంతకముందు ఐర్లాండ్, యూఎస్‌ఏల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment