match canceled
-
భారత్ పోరు వర్షార్పణం
లాడర్‌హిల్: టి20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రను వరుణుడు అడ్డుకున్నాడు. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత కాలమానం ప్రకారం ముందుగా రాత్రి 7.30 గంటలకు తొలిసారి మైదానాన్ని పరిశీలించారు. మైదానం సిద్ధం కాకపోవడంతో టాస్ ఆలస్యమైంది. అయితే ఆ తర్వాతా పరిస్థితి మెరుగుపడలేదు. చివరి సారిగా రాత్రి 9 గంటలకు పిచ్, అవుట్ ఫీల్డ్‌ను పూర్తి స్థాయిలో సమీక్షించిన ఫీల్డు అంపైర్లు ఇక ఆట జరిగే పరిస్థితి లేదని తేల్చేశారు. మరో సమీక్షకు తావు లేకుండా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి సంపూర్ణ విజయం సాధించే అవకాశం రాకపోయినా... ఇదివరకే సూపర్–8కు చేరిన భారత్ 7 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. కెనడా లీగ్ దశలో ఐర్లాండ్‌పై ఏకైక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన సంతృప్తికరమనే చెప్పొచ్చు. కోహ్లి (1, 4, 0) మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచినా... దీన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. సూపర్–8లో అతను కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెపె్టన్ రోహిత్ ఒక అర్ధ సెంచరీ బాదగా, రిషభ్ పంత్ వన్‌డౌన్‌లో మెరుగ్గా ఆడాడు. ఐర్లాండ్, పాక్‌లతో విఫలమైన హిట్టర్లు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలిద్దరు అమెరికాతో జరిగిన పోరులో టచ్‌లోకి వచ్చారు. ఇక బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన బుమ్రా, హార్దిక్, సిరాజ్‌లతో పాటు అర్‡్షదీప్ రాణించాడు. స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. దీంతో విజయాల జట్టును మార్చకుండానే బరిలోకి దిగింది. సూపర్–8లోనూ ఇదే పంథా కొనసాగించే అవకాశాలే ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి భారత్‌తో పాటు అమెరికా ముందంజ వేయగా, గత రన్నరప్ పాక్ లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా X స్కాట్లాండ్ వేదిక: గ్రాస్ ఐలెట్; ఉ.గం.6.00 నుంచి పాకిస్తాన్ X ఐర్లాండ్ వేదిక: లాడర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంసూపర్–8లో భారత్ మ్యాచ్లుజూన్ 20 – అఫ్గానిస్తాన్‌తో (బ్రిడ్జ్‌టౌన్) జూన్ 22 – బంగ్లాదేశ్ (లేదా) నెదర్లాండ్స్‌తో (నార్త్‌సౌండ్) జూన్ 24 – ఆ్రస్టేలియాతో (గ్రాస్ ఐలెట్) -
IPL 2024- SRH: ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన దెబ్బ ఐపీఎల్ మ్యాచ్‌పై కూడా పడింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. వాన తెరిపినివ్వకపోవడంతో కనీసం టాస్ కూడా వేసే అవకాశం రాలేదు. మధ్యాహ్నం తర్వాత కురిసిన వానకు నగరం మొత్తం జలమయమైంది. రాజీవ్‌గాంధీ స్టేడియంలో కూడా అవుట్‌ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పేశారు. అయితే ఏ దశలోనూ వాన పూర్తిగా ఆగలేదు. టాస్ కాస్త ఆలస్యం కాగా... నిర్ణీత రాత్రి 7:30 గంటల సమయంలో కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ వెంటనే చిరు చినుకులతో మొదలై మళ్లీ విరామం లేకుండా కురిసింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలన్నా రాత్రి 10:15 గంటలకు పూర్తిగా వాన ఆగాలి. కానీ అలా జరగలేదు. దాంతో అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గుజరాత్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా రద్దు కావడం గమనార్హం. ఈ ఫలితంతో సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌ల తర్వాత 15 పాయింట్ల వద్ద మూడో స్థానంలో నిలిచింది. దాంతో టీమ్‌కు ప్లే ఆఫ్స్ స్థానం ఖాయమైంది. ఆదివారం సన్‌రైజర్స్ సొంతగడ్డపైనే పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచి... అదే రోజు రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓడితే సన్‌రైజర్స్‌కు రెండో స్థానం ఖాయమవుతుంది. 2020లో చివరిసారి ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2021, 2022, 2023 సీజన్లలో వరుసగా 8వ, 8వ, 10వ స్థానాల్లో నిలిచింది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
స్టార్క్ హ్యాట్రిక్... ఆ్రస్టేలియా, నెదర్లాండ్ మ్యాచ్ రద్దు
తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్ (34), క్యారీ (28), స్టార్క్ (24 నాటౌట్) రాణించారు. వాన్ డర్ మెర్వ్, డి లీడ్, వాన్ బీగ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది. మిచెల్ స్టార్క్ చెలరేగి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్స డౌడ్, వెస్లీ బరెసి, బాస్ డి లీడ్లను అవుట్ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్ మ్యాచ్‌లో అక్టోబర్ 3న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు
వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వెల్లింగ్టన్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మౌంట్ మౌంగానుయ్ వేదికగా ఆదివారం(నవంబర్ 20)న జరగనుంది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరీస్. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. దీంతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. కాగా హార్దిక్ కెప్టెన్‌గా ఇది రెండో టీ20 సిరీస్. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించాడు. ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే.. -
అంపైర్లు లేరు.. వన్డే మ్యాచ్ రద్దు
Umpires Not Available For IRE vs USA 1st ODI.. అంపైర్ టీమ్‌లో కరోనా కలకలం రేపడంతో ఐర్లాండ్, యూఎస్ఏ మధ్య జరగాల్సిన తొలి వన్డేను రద్దు చేశారు. అంపైర్ టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ సోకడంతో మిగతా ముగ్గురు అంపైర్లకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలోల నెగెటివ్ అని తేలినప్పటికి.. పాజటివ్ వచ్చిన వ్యక్తితో మిగతా ముగ్గురికి క్లోజ్ కాంటాక్ట్ ఉన్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉంచారు. మ్యాచ్ నిర్వహించాలని అనుకున్నప్పటికి అంపైర్లు అందుబాటులో లేకపోవడంతో ఇరుజట్ల బోర్డుల అంగీకారంతో మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపింది. కాగా డిసెంబర్ 26న ఈ వన్డే జరగాల్సింది. అయితే మిగతా రెండు వన్డేలు మాత్రం డిసెంబర్ 28, 30వ తేదీల్లో యధావిధిగా జరుగుతున్నాయని ఇరుబోర్డులు ప్రకటించాయి. ఇక అంతకముందు ఐర్లాండ్, యూఎస్ఏల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. -
సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభంకావాల్సిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా అర్దంతరంగా రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పందించాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని, మిస్ అయిన మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని అశిద్దామని భావేద్వేగపూరిత మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. తన హెంగ్రౌండ్(ఓల్డ్‌ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని ఈ 39 ఏళ్ల లాంకషైర్ క్రికెటర్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by James Anderson (@jimmya9) ఇదిలా ఉంటే, ఇదు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. పాక్షికంగా రద్దైన ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రా కాగా, రెండో మ్యాచ్ భారత్, మూడో టెస్ట్ ఇంగ్లండ్, నాలుగో మ్యాచ్ టీమిండియా గెలిచాయి. 4 మ్యాచ్‌ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్ ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో ఓసారి 5 వికెట్ల ప్రదర్శన మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో 21 వికెట్లతో ఓలీ రాబిన్సన్ అగ్రస్థానంలో ఉండగా, 18 వికెట్లతో టీమిండియా పేసర్ బుమ్రా రెండో ప్లేస్‌లో నిలిచాడు. చదవండి: అదే జరిగితే ఇంగ్లండ్‌తో సిరీస్ సమం అయినట్టే.. -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
Ind Vs Eng: ఐదో మ్యాచ్ రద్దు.. 2-1 ఆధిక్యంలో టీమిండియా
-
డ్రయర్‌తో ఆరబెట్టి.. ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేశారు!
అందరూ అనుకున్నట్లుగా టి20 ప్రపంచకప్ ఏడాది భారత్ తొలి అడుగు మెరుపులతో పడలేదు. ప్రత్యర్థి శ్రీలంక కోరుకున్నట్లుగా ఆతిథ్య జట్టు పరాజయం పాలవ్వలేదు. ఎవరూ ఊహించనట్లుగా చినుకులు మైదానాన్ని ముంచెత్తాయి. కప్పి ఉంచిన కవర్లకేమో చిల్లులు పడ్డాయి. అసలు ఒక్కబంతి అయినా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. గువాహటి: టాస్ పడనైతే పడింది... కానీ బంతి పడలేదు. బ్యాట్ బరిలోకే దిగలేదు! 2020లో తొలి టి20 మెరుపులపై... అభిమానుల ఆసక్తిపై నీళ్లు చల్లుతూ వరుణుడు ముంచెత్తాడు. దీంతో భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇక్కడి బర్సపర అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన తొలి టి20 మ్యాచ్ రద్దయ్యింది. అస్సాం క్రికెట్ అసోసియేషన్ నిర్వాకం కూడా ఈ రద్దులో ఓ భాగమైంది. చిల్లులున్న కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచగా... కురిసిన నీరు కురిసినట్లుగా పిచ్‌లోకి ఇంకింది. దీంతో తడిసి ముద్దయిన పిచ్‌పై మ్యాచ్ అసాధ్యమని అంపైర్లు తేల్చేశారు. టి20ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో, రాష్ట్ర క్రికెట్ సంఘంపై అసంతృప్తితో భారంగా మైదానం వీడారు. మంగళవారం ఇండోర్‌లో రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఆసక్తిగా స్టేడియానికొస్తే... విజయంతో ఈ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభిద్దామని ఇటు టీమిండియా... ఎంతో ఆసక్తిగా ప్రత్యక్షంగా మెరుపుల మ్యాచ్ చూడాలని అటు అభిమానులు స్టేడియానికి వస్తే... అకాల వర్షం అమాంతం ముంచెత్తింది. టాస్ వేశాక... ఆటగాళ్లు బ్యాట్‌తో మెరుపులు మెరవాల్సిన చోట వరుణుడు చినుకులు కురిపించాడు. దీంతో ఎంతసేపటికీ ఆట మొదలేకాలేదు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్ అయిన జరుగుతుందని ప్రేక్షకులు వర్షంలో తడుస్తూ ఎదురుచూసినా... స్టేడియం సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ముచ్చటా తీరలేదు. అంపైర్లతో అసహనం వ్యక్తం చేస్తున్న కోహ్లి స్టేడియం సిబ్బంది చిల్లులు పడిన కవర్లను పిచ్‌పై కప్పేసింది. అదేమో వాననీటితో తడిపేసింది. ఈ నిర్లక్ష్యం ఓ మ్యాచ్‌నే నష్టపరచలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో ధనం, పలుకుబడి ఉన్న బీసీసీఐ పరువును గంగలో కలిపేసింది. మరీ చౌకబారుగా స్టేడియం సిబ్బంది శ్రమించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. హెయిర్ డ్రయర్ (వెంట్రుకలను ఆరబెట్టే మెషిన్)తో, బట్టలను ఇస్త్రీ చేసుకునే ఐరన్ బాక్స్‌లతో పిచ్‌ను ఆరబెట్టే పనిచేయడం అస్సాం క్రికెట్ సంఘాన్ని నవ్వుల పాలు చేసింది. దండిగా డబ్బులున్నా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురించి ఎప్పుడు చెప్పుకున్నా... తొలి మాట అత్యంత ధనవంతమైన బోర్డు అనే. ఇంతటి సుసంపన్నమైన బోర్డుకు అనుబంధమైన రాష్ట్ర సంఘంలో ఇదేం దుస్థితి అనే విమర్శలు వెల్లువెత్తాయి. చాలా ఏళ్లుగా బోర్డు రాష్ట్ర సంఘాలన్నింటికీ విరివిగా నిధులు పంపిణీ చేస్తోంది. ఇవి ఏ వేలల్లో... లక్షల్లో కాదు ఏకంగా కోట్లలోనే నిధులిస్తుంది. అంత పెద్ద మొత్తంలో నిధులు అందుకునే క్రికెట్ సంఘం వద్ద పిచ్‌ను కప్పే నాణ్యమైన కవర్లే ఉండవా అనేది కొన్ని కోట్ల మెదళ్లను తొలిచే ప్రశ్న. హెయిర్ డ్రయర్‌తో పిచ్‌ను ఆరబెడుతున్న వ్యక్తికి కోహ్లి సూచనలు అస్సాం సంఘం తీరు మరీ ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. మ్యాచ్‌ను నిర్వహిస్తే క్రికెట్ అభిమానులకు వినోదమే కాదు... ప్రకటనల రూపేణా ప్రసారకర్తకు, టికెట్లు, గ్రౌండ్ రైట్స్ రూపంలో రాష్ట్ర సంఘానికి కోట్లలో డబ్బు వచ్చేది. ఇప్పుడు ఒక్క బంతి అయిన పడకపోవడంతో అమ్ముకున్న టికెట్ల డబ్బును కూడా తిరిగి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిక్కచ్చిగా వ్యవహరించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మాత్రం కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ మ్యాచ్ నిర్వహణ ఉండనే ఉండదు. అదే జరిగితే అస్సాం క్రికెట్ సంఘం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. -
వాన దోబూచులాట
భారత్–వెస్టిండీస్ తొలి వన్డేను వరుణుడు వీడని నీడలా వెంటాడాడు. అటు కుండపోతగానైనా కురవక... ఇటు పూర్తిగానూ ఆగక ఒకటికి రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ఇలా మ్యాచ్ మొదలైందో లేదో... అలా వస్తూ, పోతూ ఆటగాళ్లతో దోబూచులాడాడు. మొత్తమ్మీద 13 ఓవర్ల ఆటను మాత్రమే సాగనిచ్చాడు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 12.30 గంటల సమయానికీ వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ప్రావిడెన్స్ (గయానా): కరీబియన్ పర్యటనలో టి20లను ఆడుకోనిచ్చిన వరుణుడు వన్డే సిరీస్‌కు మాత్రం అడ్డంకిగా నిలిచాడు. గురువారం భారత్– వెస్టిండీస్ తొలి వన్డే ఒక అడుగు ముందుకు... పది అడుగులు వెనక్కు తరహాలో సాగి చివరికి రద్దయింది. ప్రావిడెన్స్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్ పరిసరాలను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు. టి20 సిరీస్‌లో అవకాశం లభించని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌ను ఈ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకున్నారు. 25 నిమిషాలు సాగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 5.4 ఓవర్లు ఆడి 7 పరుగులు చేసింది. ఈ దశలో వాన గంటా 15 నిమిషాలు అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్‌ను 34 ఓవర్లకు తగ్గించారు. మరో 8 ఓవర్ల పాటు కొనసాగిన ఆటలో విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ (31 బంతుల్లో 4) వికెట్ కోల్పోయింది. చివరకు 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అవతలి ఎండ్‌లో ఓపెనర్ ఎవిన్ లూయీస్ (36 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రం ధాటిని ప్రదర్శించాడు. ఖలీల్ అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. ఇంతలోనే చినుకులు పెద్దవి కావడంతో అంపైర్లు మైదానాన్ని వీడాల్సిందిగా ఆటగాళ్లకు సూచించారు. ఎంత వేచి చూసినా ఫలితం లేకపోవడంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 12.45కు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతుంది. -
మళ్లీ వరుణుడు గెలిచాడు
బ్రిస్టల్: ప్రపంచ కప్‌లో వర్షం దెబ్బకు మూడో మ్యాచ్ కొట్టుకుపోయింది. టాస్ వేసే అవకాశమూ లేనంతటి వానతో శ్రీలంక–బంగ్లాదేశ్ మధ్య మంగళవారం ఇక్కడ జరగాల్సిన వన్డే రద్దయింది. మధ్యలో రెండుసార్లు తెరిపినిచ్చినా... ఆ వెంటనే ప్రారంభమైంది. మైదానంలో నీటిని తోడేందుకు గ్రౌండ్స్‌మెన్ అవిశ్రాంతంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. చివరకు అంపైర్లు ఆట సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. లంకకు ఈ పరిస్థితి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఎదురవడం గమనార్హం. గత శుక్రవారం పాకిస్తాన్‌తో ఆ జట్టు మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. అంతకుముందు వర్షం ప్రభావంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధనలు వర్తింపజేసిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను లంక 34 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆ జట్టు్ట ఖాతాలో నాలుగు పాయింట్లున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాపై గెలిచి... ఇంగ్లండ్ మీద భారీ తేడాతో, న్యూజిలాండ్ చేతిలో త్రుటిలో ఓడిన బంగ్లాదేశ్ (4 మ్యాచ్‌లు, 2 పాయింట్లు)కు ఓ విధంగా బలహీన లంకతో పోరు కీలకమైనదే. వారు గెలిచే వీలున్న పరిస్థితుల్లో వర్షం దెబ్బకొట్టింది. ఈ పరిణామం రెండు జట్ల నాకౌట్ అవకాశాలపై ప్రభావం చూపేదే. మనకూ తప్పదా? వర్షం ప్రభావం గురువారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరగాల్సిన భారత్–న్యూజిలాండ్ మ్యాచ్‌పైనా పడే ప్రమాదం కనిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షాలకు అవకాశముంది. గురువారం మధ్యాహ్నానికి కాని సాధారణ వాతావరణం నెలకొనదని తెలుస్తోంది. దీంతో మన మ్యాచ్‌కు కొంతమేరయినా ఇబ్బంది కలిగే వీలుంది. అయితే, వాన తగ్గినా... ఆటగాళ్లకు శీతల గాలుల కష్టాలు తప్పేలా లేవు. గరిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలను మించకపోవడమే దీనికి కారణం. మబ్బులు కమ్మిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ వ్యాప్తంగా రెండ్రోజులుగా నిరంతరం జల్లులు పడుతున్నాయి. అంటే, బుధవారం టాంటన్‌లో పాకిస్తాన్–ఆస్ట్రేలియా మ్యాచ్‌కూ గండం పొంచి ఉన్నట్లే. మరోవైపు ఈ వారమంతా ఇలాగే ఉంటుందంటూ ఇప్పటికే నాటింగ్‌హామ్ వాతావరణ శాఖ స్థానికులకు సూచనలు జారీ చేసింది. ఇందులో భాగంగా భారీ వరదలకూ ఆస్కారం ఉంటుందని హెచ్చరించింది. -
పాక్‌ను ప్రపంచకప్ నుంచి బహిష్కరించాలి
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి ఘటనకు నిరసనగా నిన్నటి వరకు ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలన్న డిమాండ్లపై వ్యాఖ్యలు, చర్చలు జరగ్గా... గురువారం ఏకంగా ఆ దేశాన్ని ప్రపంచ కప్ నుంచే తప్పించాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఐసీసీకి పంపేందుకు బీసీసీఐ బుధవారమే ముసాయిదా లేఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సూచనతో... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈ డేవ్ రిచర్డ్ సన్, ప్రపంచ కప్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తిలను ఉద్దేశిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి లేఖ రూపొందించారు. దీనిపై శుక్రవారం జరిగే బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి సంబంధిత కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. బోర్డు సమావేశంలో దేశానికి ఏది మేలనే అంశంపై చర్చిస్తామని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ ప్రకటించారు. మరోవైపు బోర్డు అధికార వర్గాలు మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదని అంటున్నాయి. ‘ఇలా చేసేందుకు వ్యవస్థా పరంగా, నిర్వహణ పరంగా ఏ విధంగానూ అవకాశాలు లేవు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం... ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన సభ్య దేశాలు ప్రపంచ కప్‌లో పాల్గొనే హక్కుంటుంది. పాక్‌ను నిషేధించాలని మనం కోరితే ఆ డిమాండ్‌ను ఐసీసీ సభ్య దేశాల ముందు ఓటింగ్‌కు పెడుతుంది. ఈ విషయంలో భారత్‌ను వారు సమర్థించరు. అయినా, లేఖ రాయాలంటే ఏప్రిల్‌లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ప్రతిపాదన చేయాలి. ఇప్పుడు ఐసీసీలో మనకు తగినంత మద్దతు లేదు. బల పరీక్షకు నిలిస్తే మన ప్రతిపాదన వీగిపోతుంది. దీని ప్రభావం 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచ కప్ ఆతిథ్యంపైనా పడుతుంది’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆడి గెలిచి... దెబ్బకొట్టాలి: గావస్కర్ మ్యాచ్‌ను బహిష్కరించి కాకుండా... మైదానంలో గెలిచి పాక్ ప్రపంచకప్ అవకాశాలపై దెబ్బకొట్టాల ని సూచించాడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గావ స్కర్. మనం ఆడొద్దనుకుంటే...2 పాయింట్లు పొందడం ద్వారా పరోక్షంగా పాక్ విజయం సాధించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ప్రజల భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలను. అయితే, బహుళ దేశాల టోర్నీలో మ్యాచ్ ఆడకుండా పాయింట్లు కోల్పోవడం సరికాదు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటా. సరికొత్త పాకిస్తాన్‌ను నిర్మించాలని ఈ సందర్భంగా నా స్నేహితుడు, పాక్ ప్రధాని ఇమ్రా న్కు సూచిస్తున్నా’ అని గావస్కర్ పేర్కొన్నారు. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ డీకే జైన్ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జస్టిస్ ఎస్ఏ బాబ్డె, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ గురువారం ఉత్తర్వులిచ్చింది. -
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
బెల్ఫాస్ట్: వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే క్రమంలో విజయవంతంగా తొలి అడుగు వేయా లని భావించిన వెస్టిండీస్‌కు వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ఐర్లాండ్‌తో బుధవారం జరగాల్సిన ఏకైక వన్డే భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. గేల్ తదితరుల పునరాగమనంతో ఈ మ్యాచ్‌లో విజయంపై విండీస్ ఆశలు పెంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 4–1తో గెలిస్తే సరిపోయేది. అయితే తాజా సమీకరణం ప్రకారం ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకూడదు. అంటే 5–0 లేదా 4–0తో విండీస్ ఆ సిరీస్‌ను గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే శ్రీలంక నేరుగా ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవుతుంది. వచ్చే ఏడాది జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో విండీస్ ఆడాల్సి ఉంటుంది.