
తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్ (34), క్యారీ (28), స్టార్క్ (24 నాటౌట్) రాణించారు. వాన్ డర్ మెర్వ్, డి లీడ్, వాన్ బీగ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది.
మిచెల్ స్టార్క్ చెలరేగి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్‌స డౌడ్, వెస్లీ బరెసి, బాస్ డి లీడ్‌లను అవుట్ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్ మ్యాచ్‌లో అక్టోబర్ 3న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment