వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వెల్లింగ్టన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మౌంట్ మౌంగానుయ్ వేదికగా ఆదివారం(నవంబర్ 20)న జరగనుంది.
కాగా టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరీస్. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
దీంతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. కాగా హార్దిక్ కెప్టెన్‌గా ఇది రెండో టీ20 సిరీస్. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించాడు. ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.
చదవండి: ఐపీఎల్‌లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే..
Comments
Please login to add a commentAdd a comment