called off
-
HYD: ట్యాంకర్ డ్రైవర్ల ధర్నా విరమణ.. బంకుల వద్ద రద్దీ
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగనుంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది. దీనికి నిరసనగా ఆయిల్ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. బంకుల ముందు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు అలర్డ్ అయ్యారు. తెరచి ఉన్న కొన్ని బంకుల ముందు ఒక్కసారిగా జనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆయిల్ ట్యాంకర్లు ధర్నా విరమించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీచదవండి..తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ కాంగ్రెస్ -
శర్వానంద్ పెళ్లి ఆగిపోయిందా?
-
కస్టమర్లకు గమనిక: జనవరి 30, 31 తేదీల్లో యథావిధిగా బ్యాంకు సేవలు
సాక్షి,ముంబై: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముంబైలో జరిగిన సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు జనవరి 30-31 తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమ్మె వాయిదా పడడంతో సంబంధిత తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. (అదానీకి మరో ఎదురుదెబ్బ: సెబీ కన్ను, మరింత లోతుగా పరిశీలన) ఐదు రోజుల పనిదినాలు, ఎన్పీఎస్ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో నియామకాలు తదితర డిమాండ్స్‌తో బ్యాంకు యూనియన్లు జనవరి 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం వెల్లడించింది. (అదానీ సెగ: ఎల్ఐసీలో రెండు రోజుల్లో వేల కోట్లు సంపద ఆవిరి) ఉద్యోగుల డిమాండ్లపై చర్చ నిమిత్తం జనవరి 31న బ్యాంకు యూనియన్లతో సమావేశమయ్యేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చించనున్నారు. -
ఆగని వర్షం.. భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 రద్దు
వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. వెల్లింగ్టన్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో.. ఒక బంతి కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మౌంట్ మౌంగానుయ్ వేదికగా ఆదివారం(నవంబర్ 20)న జరగనుంది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరీస్. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. దీంతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టాడు. కాగా హార్దిక్ కెప్టెన్‌గా ఇది రెండో టీ20 సిరీస్. అంతకుముందు ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యహరించాడు. ఈ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: ఐపీఎల్లో కప్ సాధిస్తే.. టీమిండియా కెప్టెన్ చేయాలా? ఇదెక్కడి రూల్! అలా అయితే.. -
ఊహించని ట్విస్ట్.. విడాకులపై వెనక్కి తగ్గిన ధనుష్-ఐశ్వర్య!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఈ ఏడాది ప్రారంభంలో.. ధనుష్,ఐశ్వర్యలు సోషల్ మీడియా వేదికగా భార్యభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 18ఏళ్ల వివాహం తర్వాత ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ప్రకటించడం అభిమానులకు కూడా ఆవేదనను గురిచేసింది. వీరిద్దరూ కలిసి ఉంటే బాగుండు అని అంతా అనుకున్నారు. ఇప్పుడిదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది. ధనుష్-ఐశ్వర్యలు తమ విడాకుల ప్రకటనను రద్దు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలె రజనీకాంత్ ఇంట్లో ఇరు కుటుంబసభ్యులు సమావేశమయ్యారట. ఈ సందర్భంగా ఈ జంట మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఐశ్వర్య-ధనుష్‌లు కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నారట. ఇదే గనుక నిజమైతే, అభిమానులకు ఇంతకంటే గుడ్‌న్యూస్ ఏముంటుంది. -
భారత్- ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ రద్దు..
India Women vs Australia Women 1st T20I: భారత్, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన భారత్ 15.2 ఓవర్లలో 134/4 గా ఉన్న సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను తాత్కాలింగా నిలిపివేశారు. తరువాత దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఎప్పటికీ ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా భారత్‌కు ఓపెనర్లు షఫాలి వర్మ(17), స్మృతి మంధన(18) శుభారంభాన్ని ఇచ్చారు. జెమిమా రోడ్రిగ్స్ 49 పరుగులచేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహామ్ చెరో వికెట్ సాధించారు. దాదాపు గంట సమయం ఎదురు చూసిన అంపైర్స్ .. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం రెండో టీ20 జరగనుంది. చదవండి: CSK Vs PBKS: ధోని (12) మరోసారి విఫలం.. చెన్నై 61/5 -
పాకిస్తాన్‌కు మరో షాక్.. సిరీస్‌ను రద్దు చేసుకున్న ఇంగ్లండ్
England Call Off Pakistan Tour : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు సైతం రద్దు చేసుకుంది. ఆటగాళ్ల భద్రతా కారణాల దృృష్ట్యా పాకిస్తాన్‌తో సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో ఇరు జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలు అన్నీ ఆవిరయ్యాయి. భద్రతా కారణాలతో న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Ipl 2021: ముంబై ఆటగాడిపై భారత మాజీ కీపర్ కీలక వాఖ్యలు.. -
టీమిండియాను ట్రోల్ చేసిన వాన్.. పీటర్సన్ కౌంటర్
లండన్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ మరోసారి టీమిండియాను ట్రోల్ చేశాడు. ఐదో టెస్టు రద్దు నేపథ్యంలో వాన్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు కావడంతో టీమిండియా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు నష్టం కలిగించింది. ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల ఈసీబీ భారీగా నష్టపోతుంది. సరిగ్గా గతేడాది దక్షిణాఫ్రికాతో ఇదే రీతిలో మేం సిరీస్‌ను రద్దు చేసుకున్నాం. మాకు శాపం తగిలినట్టుంది'' అంటూ గుర్తు చేశాడు. అయితే వాన్ వ్యాఖ్యలపై మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ టీమిండియాకు మద్దతిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ''ఇది ఊహించని పరిణామం. ఇందులో టీమిండియా తప్పు ఎక్కడుంది. గతంలో కరోనా కారణంగానే ఈసీబీ దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకుంది. మరి దక్షిణాఫ్రికా బోర్డు కూడా చాలా నష్టపోయింది. ప్రతీ విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'టీమిండియా ఓడిపోయింది'.. వెంటనే మాట మార్చిన ఈసీబీ ఇక కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దు అయిన సంగతి తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: IPL 2021: కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ India have let English Cricket down !!! But England did let South African Cricket down !!! — Michael Vaughan (@MichaelVaughan) September 10, 2021 England left the tour of SA for Covid scares & cost CSA plenty, so don’t go pointing fingers! 👀 — Kevin Pietersen🦏 (@KP24) September 10, 2021 -
కరోనా ఎఫెక్ట్ : ఆసీస్-కివీస్ సిరీస్ రద్దు
సిడ్నీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ అర్థంతరంగా రద్దు చేసుకుంది. దేశంలో కోవిడ్-19ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చేవారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చినవారిని ఏయిర్‌పోర్ట్‌లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టు మేనేజ్మెంట్ అలర్ట్ అయింది. న్యూజిలాండ్‌లో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు అమలుకాకముందే తమ దేశానికి వెళ్లిపోవాలని కివీస్ జట్టు అనుకుంది. దీంతో ఆదివారం జరగాల్సిన రెండో వన్డేతో పాటు మిగిలిన టీ20 సిరీస్‌ను కూడా వాయిదా వేసుకొని బయలుదేరనుంది. (ఐపీఎల్ 2020 వాయిదా) అంతకుమందు శుక్రవారం కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్ అనంతరం కివీస్ పేస్ బౌలర్ లోకి ఫెర్గూసన్ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా పరీక్షల నిమ్మితం ఐసోలేషన్ వార్డుకు తరలించింది. ఇదే విషయమై న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ' మ్యాచ్ ముగిసిన అనంతరం లోకి ఫెర్గూసన్ పొడి దగ్గుతో బాధపడుతుండడంతో అతన్ని హోటల్ రూంలోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచాం. 24 గంటల పాటు అతను అబ్జర్వేషన్లో ఉండనున్నాడు. కరోనా వైరస్ సోకిందా లేదా అన్నది అతని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుందని' పేర్కొన్నాడు. మరోవైపు ఆసీస్ ఆల్‌రౌండర్ కేన్ రిచర్డ్సన్కు కరోనా సోకిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చా చెప్పింది. అతని రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత కరోనా నెగిటివ్ అని తేలిందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. (భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు!) The Black Caps will return home due to the New Zealand government's tighter #COVID19 border restrictions https://t.co/GF493FicXL pic.twitter.com/YXEh9QwVFg — cricket.com.au (@cricketcomau) March 14, 2020 కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగతా రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. (రిచర్డ్సన్కు కరోనా లేదు) -
వర్షం కారణంగా మహిళల టీ20 రద్దు
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా-భారత్ మహిళల మధ్య జరుగుతున్న నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ పచ్చిగా ఉండడం, మరి కొద్ది గంటల్లో పురుషుల మ్యాచ్ ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే భారత మహిళల టీ20 చరిత్రలో రద్దైన తొలి మ్యాచ్‌కావడం విశేషం. దీంతో హర్మన్ ప్రీత్ సేన నిర్ణయాత్మక ఐదో టీ20 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత మహిళలు చివరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం అవుతోంది. లేకుంటే డ్రాగా ముగుస్తోంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు మ్యాచ్ నిలిచే సమయానికి 15.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ నికెర్క్(55: 47 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సులు), లిజెల్లే లీ(59: 39 బంతులు,2ఫోర్లు, 5 సిక్సర్లు, నౌటౌట్)లు రాణించారు. పురుషుల మ్యాచ్ కోసం మైదాన సిబ్బంది కృషి చేస్తున్నారు. -
వెనక్కి తగ్గిన పెట్రోల్ పంప్ డీలర్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఈ నెల 16 నుంచి కొనుగోలు, అమ్మకాలను నిరవధికంగా బంద్ చేస్తామన్న నిర్ణయంపై పెట్రోల్ బంకుల యజమానులు వెనక్కి తగ్గారు. పెట్రోల్ పంప్ డీలర్లు దేశవ్యాప్తంగా జూన్ 16న చేపట్టనున్న సమ్మెను ఉపసంహరించుకున్నారు. నో పర్చేజ్, నో సేల్ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(ఇండిపెండెంట్ చార్జ్ ) ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాకు వివరించారు. రోజువారీ ధరల విధానానికి సంబంధించి డీలర్ల సంఘాల ఆందోళనవ్యక్తం చేసినట్టు చెప్పారు. ఆటోమేటెడ్ అవుట్లెట్లను పెంచడం, ఇంధన ధరలను అమలు చేయడం లాంటి చర్యలకు మద్దతు ఇవ్వడం కోసం తాము కృషి చేస్తున్నామని అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల తీసుకున్న రోజువారి ధరల విధానం వల్ల పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ప్రభావం పడుతుందని డీలర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రోజువారీ ధరల హెచ్చుతగ్గులతో బాగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. 75 శాతం పంపుల్లో ఆటోమిషిన్ సౌకర్యం లేదని, అందువల్ల రోజువారీ ధరల హెచ్చుతగ్గుల విధానాన్ని అమలు పర్చలేమని స్పష్టం చేశారు. ఆలిండియా పెట్రోలియం అసోసియేషన్ ప్రతి నిధులు మంగళ, బుధవారాల్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలతో చర్చలు జరపనున్నారని, ఒక వేళ చర్చలు సఫలం కాకుంటే పెట్రోల్, డీజిల్ కొనుగోల్లు, అమ్మకాలను నిలిపేస్తామని స్పష్టం చేస్తూ 16న సమ్మె చేపట్టనున్నట్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
జకీర్ ఝలక్.. ప్రెస్ మీట్ ఉత్తిదే!
ముంబయి: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మరోసారి ఝలక్ ఇచ్చాడు. అతడు ముందు ప్రకటించినట్లు ముంబయి మీడియా ముందుకు స్కైప్ ద్వారా రావడం లేదు. ఆయన స్కైప్ మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయింది. గురువారం తాను స్కైప్ ద్వారా మీడియా ముందుకు వస్తానని జకీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న జకీర్ నాయక్ భారత దేశంలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యంతరకర ప్రసంగం చేశాడు. ఢాకా పేలుళ్ల నేపథ్యంలో భారత ముస్లిం యువకులను రెచ్చగొట్టే చర్యలకు దిగాడు. దీంతో ఆయనను విచారించాలని ఒక పక్క పోలీసులు భావిస్తుండగా అతడు మాత్రం దేశంలోకి అడుగుపెట్టకుండా ఆఫ్రికా టూర్ అంటూ చెబుతున్నాడు. అదే సమయంలో తానేం పారిపోవడం లేదని అన్ని విషయాలు స్కైప్ ద్వారా అగ్రిపదలోని మెఫిల్ హాల్ లో ముంబయి మీడియా వద్దకు వస్తానని చెప్పాడు. అయితే, ప్రస్తుతం అతడి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయినట్లు తెలుస్తోంది. -
నిలిచిపోయిన రెండో రోజు ఆట
ఫతుల్లా: వర్షం కారణంగా, భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్, రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఉదయం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేశారు. దీంతో ఒక్క బంతి కూడా బౌల్ చేయకుండానే రెండోరోజు ఆట ముగిసింది. ఈ టెస్ట్ లో భాగంగా మూడవ రోజు ఆట తిరిగి రేపు ఉదయం 9:30 కు ప్రారంభం కానుంది. తొలిరోజు మ్యచ్ ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. -
భారత్ -పాకిస్తాన్ సమావేశాలు రద్దు
న్యూఢిల్లీ: మరో వారం రోజుల్లో భారత్-పాకిస్తాన్ ల మధ్య జరుగనున్న విదేశాంగ కార్యదర్శల సమావేశం రద్దయింది. ఈ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం భారత్ స్పష్టం చేసింది. ఆగస్టు 25 వ తేదీన పాకిస్తాన్ లోని విదేశాంగ కార్యదర్శల సమావేశం పాల్గొనాల్సిన భారత్ తన పర్యటనను ఆకస్మికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కాశ్మీర్ సమస్య ప్రధాన కారణం. జమ్మూ-కాశ్మీర్ అంశంపై పాక్ పదేపదే జోక్యం చేసుకోవడంపై భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ అంతరంగీక వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యాన్ని సహించబోమని దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పాకిస్తాన్ హై కమీషన్ అబ్దుల్ బాసిత్ ఏర్పాటు వాద చర్చలకు తెరలేపిన అనంతరం భారత్ పర్యటనను రద్దు చేసుకుని గట్టి హెచ్చరికలు పంపింది. మళ్లీ పాకిస్తాన్ అందుకు అనుగుణగా మరోసారి చర్చలు జరపడానికి ప్రణాళిక సిద్ధం చేసిన సమయంలో భారత్ తన తిరుగుబాటు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉండగా పాకిస్తాన్ తాజా వైఖరి అనేక రకాలైన ప్రశ్నలను ఎత్తిచూపేదిగా ఉందని భారత విదేశాంగ ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కాగా, పాకిస్తాన్ తరుచు భారత జవాన్లపై కాల్పుల జరిపి ఇరుదేశాల మధ్య ఉన్న విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. -
అంగన్వాడీ కార్యకర్తల సమ్మె విరమణ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అంగన్వాడీ కార్యకర్తల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను విరమించారు. తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరవధిక సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలన్నీ బోసిపోయాయి. ఐసీడీఎస్ చరిత్రలోనే తొలిసారిగా అంగన్వాడీలు మహా ఉద్యమాన్ని చేపట్టడంతో హక్కుదారులైన చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం దూరమైంది. ప్రభుత్వంతో చర్చలు సఫలంకావడంతో ఎట్టకేలకు సమ్మెను విరమించారు. -
ఐదో వన్డేనూ వర్షార్పణం
భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వరుణుడు మరోసారి ప్రతాపం చూపాడు. ఇరు జట్ల మధ్య శనివారమిక్కడ జరగాల్సిన ఐదో వన్డే ఊహించినట్టే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారడంతో మ్యాచ్ జరగడం శుక్రవారం నుంచే సందేహంగా మారింది. మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. నాలుగో వన్డే కూడా వర్షం కారణంగా ఫలితం తేలని సంగతి తెలిసిందే. ఈ ఏడు వన్డేల సిరీస్‌లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు వన్డేలు జరగాల్సివుంది. ధోనీసేన సిరీస్ నెగ్గాలంటే మిగిలిన రెండూ గెలవాలి. ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఈ నెల 30న నాగపూర్‌లో జరగనుంది.