ఐదో వన్డేనూ వర్షార్పణం | Fifth ODI between India, Australia called off due to rain | Sakshi
Sakshi News home page

ఐదో వన్డేనూ వర్షార్పణం

Published Sat, Oct 26 2013 6:32 PM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

ఐదో వన్డేనూ వర్షార్పణం

ఐదో వన్డేనూ వర్షార్పణం

భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వరుణుడు మరోసారి ప్రతాపం చూపాడు. ఇరు జట్ల మధ్య శనివారమిక్కడ జరగాల్సిన ఐదో వన్డే ఊహించినట్టే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారడంతో మ్యాచ్ జరగడం శుక్రవారం నుంచే సందేహంగా మారింది. మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. నాలుగో వన్డే కూడా వర్షం కారణంగా ఫలితం తేలని సంగతి తెలిసిందే.

ఈ ఏడు వన్డేల సిరీస్లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు వన్డేలు జరగాల్సివుంది. ధోనీసేన సిరీస్ నెగ్గాలంటే మిగిలిన రెండూ గెలవాలి. ఇరు జట్ల మధ్య ఆరో వన్డే ఈ నెల 30న నాగపూర్లో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement