భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు | India, Australia match abandoned | Sakshi
Sakshi News home page

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు

Published Mon, Jan 26 2015 2:50 PM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు

సిడ్నీ: వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయ్యింది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేయాలని నిర్ణయించారు. ఇరు జట్లకు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. ఈ సిరీస్లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తేనే ఫైనల్ బెర్తు లభిస్తుంది.  

భారత్, ఆసీస్  మ్యాచ్ కు వరుణుడు పదేపదే ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ ను 44 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆసీస్.. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టీమిండియా 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం పడింది. ఆ తర్వాత వర్షం తెరిపి ఇవ్వకపోడంతో గ్రౌండ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ ను రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement